శ్రీకృష్ణుడికి ఇష్టమైన విషయాలు ఏంటి

By: DEEPTHI
Subscribe to Boldsky

హిందూ మతంలోని అన్ని దేవుళ్ళలో శ్రీకృష్ణభగవానుడంటే ఇష్టపడని వారు ఉండరు. ఇది ఆయన స్వభావం, చిలిపితనంతో వచ్చిన ఆకర్షణే అని చెప్పుకోవాలి. దానికే వేలాది మంది భక్తుల హృదయాలు ఆకర్షితమవుతున్నాయి. ఆయనని భక్త వత్సలుడని కూడా అంటారు. దాని అర్థం భక్తులకి ఇష్టమైనవాడు, వారికి వెనువెంటనే స్పందించేవాడని అర్థం.

జన్మాష్టమి పండగను శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. 2017లో జన్మాష్టమి 14 ఆగస్టున జరుపుకుంటారు. హిందూ మతంలోని కొన్ని జాతుల్లో, జన్మాష్టమి అదే నెల 15న వస్తుంది.

Lord Sri Krishna

శ్రీకృష్ణ భక్తులు ఆరోజున ఎంతో ఉత్సాహంగా, ఉత్సవంలా పండగను జరుపుకుంటారు. చాలామండి వ్రతాన్ని చేసి, ఆలయాల్లో, ఇళ్ళల్లో పూజలు నిర్వహిస్తారు. ఇతర భక్తులు 'ఝంకీలు’ అనే ఉట్టి కొట్టే పోటీ, ఆటపాటల్లో పాల్గొంటారు.

కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు!

ఈ పండగ సందర్భంగా శ్రీకృష్ణుని హృదయానికి ఇష్టమైన, దగ్గరవైన విషయాలు చర్చిద్దాం. ఇవన్నీ ఎంత ఇష్టమైనవంటే భక్తులు తమ ప్రసాదాలలో నైవేద్యంగా ఇవే సమర్పిస్తారు. అందుకే మరింత సమయం వృథా చేయకుండా, శ్రీకృష్ణుడికి ఇష్టమైన విషయాలను తెలుసుకోండి.

Lord Sri Krishna

నెమలి పింఛం

శ్రీకృష్ణుని ఆకృతిని వర్ణించేప్పుడు తలపై నెమలి పింఛం గూర్చి మీరు వినే వుంటారు. ఆయన నెమలి పింఛాన్నే ఎందుకు ఎంచుకున్నాడనే దానికి అనేక కథనాలున్నాయి.

ఒక కథ ప్రకారం, శ్రీకృష్ణుని వేణుగానానికి ముగ్థులయి నెమలి రాజు వాటిని ఆయనకి బహుమతిగా ఇచ్చారని అంటారు.

Lord Sri Krishna

మరో కథ ప్రకారం దత్తత చేసుకున్న తండ్రి నందగోపాలుడు చిన్నతనంలో అలంకరించడానికి నెమలి పింఛాన్ని వాడేవాడని అంటారు.

కథ ఏదైనా, శ్రీకృష్ణునికి నెమలి పింఛం అంటే మాత్రం చాలా ఇష్టం.

వెన్న

శ్రీకృష్ణుడు యొక్క పుట్టుక వెనుక ఉన్న కథ

Lord Sri Krishna

శ్రీకృష్ణుడు ' వెన్నదొంగ’ గా ప్రసిద్ధుడు. దాని అర్థం వెన్నను దొంగిలించేవాడని. అన్ని ఇళ్ళలో వెన్న దొంగిలించే బాలకృష్ణుడికి ఈ పేరు వచ్చింది.

ఈనాటికి కూడా, శ్రీకృష్ణుడికి చేసే ఏ పూజ అయినా వెన్న నైవేద్యంగా పెట్టకుండా సంపూర్ణమవదు.

Lord Sri Krishna

పచ్చ వస్త్రాలు ( పీతాంబరం)

శ్రీకృష్ణుడికి పసుపు వస్త్రాలంటే ప్రాణం. అతని ప్రతి చిత్రంలో పచ్చని ధోవతినే ఉంటుంది. పురాణకథల ప్రకారం, శ్రీకృష్ణుడు పసుపుపచ్చని బట్టలు ధరించేవాడని, అవంటే అతనికి ఇష్టమని చెప్తారు. బట్టలే కాదు, మామూలుగా కూడా పసుపంటే ఆయనకి ఇష్టం. భక్తులు అందుకే పసుపురంగున్న ఆహారపదార్థాలు, పళ్ళు నైవేద్యంగా పెడతారు.

Lord Sri Krishna

వేణువు (బాసురీ)

వేణువు లేకుండా శ్రీకృష్ణుడిని ఊహించటం కష్టం. ఆ అద్భుత వేణువునుంచి వచ్చే మధుర సంగీతం మనుషులను, జంతువులను ఒకేరకంగా సమ్మోహితులను చేసేదంట. శ్రీకృష్ణుడు వేణుగానం మొదలుపెట్టగానే, సృష్టిలోని అన్ని ప్రాణులు తమని తాము మర్చిపోయి ఆ గానానికి నృత్యం చేసేవి. శ్రీకృష్ణుడికి ఆ వేణువు ఎవరో వేణువులు అమ్మే వ్యక్తి నుంచి వచ్చిందని అంటారు. ఆ అమ్మినవ్యక్తే ఎలా వాయించాలో కూడా నేర్పాడని చెప్తారు. ఎంతో పవిత్రంగా భావించే ఆ వేణువుపై అనేక కవితలు, పాటలు రాసారు. స్వామి పెదవులను తాకిన వేణువు ఎంతో అదృష్టకరమని అంటారు.

ఆవు (గోమాత)

శ్రీకృష్ణుడి ప్రేమ అన్ని జంతువులపై సమానం. కానీ ఆయనికి ఎంతో ఇష్టమైన జంతువు ఏదంటే మాత్రం గోవులనే చెప్పాలి. చిన్నతనంలో ఆయన గోవులను కాపు కాసే గోపాలుడు. వాటిని అడవుల్లోకి మేత కోసం తీసుకెళ్ళి, సాయంత్రం ఇంటికి తెచ్చేవాడు. తన కుటుంబం పెంచిన ఈ గోవుల ముందే ఆయన బాల్యలీలలన్నీ గడిచాయి.

English summary

Things that Lord Sri Krishna Loved the Most

Take a look at the things that lord Sri Krishna loved the most.
Story first published: Tuesday, August 8, 2017, 18:00 [IST]
Subscribe Newsletter