తిరుమల కొండపై ఉన్న తీర్థాల్లో అంతుబట్టని దేవతా రహస్యాలు..!!

By Sindhu
Subscribe to Boldsky

లోక కల్యాణార్థం, ప్రజల సంరక్షణార్థం తిరుమలలో నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిశాడని అందరికీ తెలిసిందే. తిరుమల... శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న కలియుగ వైకుంఠం. చారిత్రక, పురాణ ప్రాశస్త్యమున్న ఎన్నో ఆలయాలు, తీర్థాలకు ఏడు కొండలు నెలవుగా ఉన్నాయి. ఒక విధంగా తిరుమల ఎన్నో విశేషాల సమాహారం. సప్తగిరులే శయన రూపంలో ఉన్న శ్రీనివాసుడి ముఖాన్ని పోలి కనిపించడం ఎంతో విశేషమైనది.

Tirumala Tirthas Legends and Its references from puranas

సప్తగిరులపై వెలసిన కలియుగ వైకుంఠ పురి తిరుమల . అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయము అయిన తిరుమలలో ప్రతీ శిల చింతామణి , ప్రతీ చెట్టు, ప్రతీ తీగ మహర్షులు , ప్రతీ తీర్థం దేవగంగా స్వరూపాలని, వేంకటాచల మహాత్మ్యములో తెలుపబడినది . అటువంటి పుణ్య తీర్థములలొ కొన్నింటికి ఆయా మాసాలలో వచ్చే పౌర్ణమి తిథులలో తి .తి .దే . వారు ఉత్సవం నిర్వహిస్తారు . ఈ ఉత్సవాన్ని ముక్కోటి అని కూడా అంటారు .

స్వామి పుష్కరిణి :

స్వామి పుష్కరిణి :

స్వామి వారి ప్రధానాలయము సమీపమున ఉండే ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది . శ్రీ వెంకటేశ్వర స్వామీ వారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు . స్వామి వారిని దర్శించే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతోంది. ఈ తీర్థం వద్ద గో దానం చేయుటవలన అత్యంత పుణ్యం లభిస్తుంది .

ఆకాశ గంగ:

ఆకాశ గంగ:

ప్రధానాలయం నుంచి 5 కి మీ దూరం లో ఆకాశ గంగ తీర్థం ఉంది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాడ విశ్వాసం . ఆకాశ గంగ లో స్నానం ఆచరిస్తే 100 పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.

పాప వినాశనం :

పాప వినాశనం :

ప్రధానాలయం నుంచి 3 మైలుల దూరములో పాప వినాశనము తీర్థము వెలసింది. ఈ పాపనాసనములో స్నానం ఆచరించిన వారికి సకల పాప ప్రక్షాళన జరుగుతుందని అంటారు .

జాబాలి తీర్థం

జాబాలి తీర్థం

తిరుమలలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఈ తీర్థం ఉంది. ఇక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం చూడవచ్చు. జాబాలి అనే ముని ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు దర్శనమిచ్చినట్టు చెబుతారు. శ్రీరాముడు వనవాసంలో భాగంగా సీతమ్మవారు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్లతో ఇక్కడ కొంత కాలం ఉన్నారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

తుంబుర తీర్థం :

తుంబుర తీర్థం :

ప్రధానాలయైనికి 16 కి మీ దూరం లో తుంబుర తీర్థం ఉన్నది . వర్షాకాలములో ఈ తీర్థం ఎంతో శోభాయమానముగా పచ్చని ప్రకృతి అందాలతో కళ కళ లాడుతుంది. గంధర్వుడైన తుంబురుడు తన భార్యను శపించడంతో ఆమె కప్ప రూపంలో మారి తుంబుర తీర్థంలో ఉంటుంది. అగస్త్య ముని ఓరోజు ఇక్కడి తీర్థానికి రావడంతో ఆమె తన చరిత్ర గురించి చెప్పగా, అగస్త్యుడు అనుగ్రహం వల్ల ఆమె తిరిగి తన యథా రూపాన్ని సంతరించుకుంటుంది. అప్పటి నుంచి ఇది తుంబుర తీర్థంగా వెలుగులోకి వచ్చింది. మరో కథనం ప్రకారం తుంబురు మహర్షి ఇక్కడ ఘోరమైన తపస్సు చేయడం వల్ల ఈ తీర్థానికి తుంబుర తీర్థం పేరు స్థిరపడినట్టు చెబుతారు.ఇక్కడ స్నానం ఆచరించడం వలన కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

పాండవ తీర్థం:

పాండవ తీర్థం:

పాండవ తీర్థం తిరుమల కొండ ఆదిలో నృసింహ కొండ అభిముఖంగా ఉంది. ఈ తీర్తానికి పౌరాణిక ప్రాశస్త్యం కలదు. వనవాస సమయములో పాండవులు ఇక్కడ స్నానం ఆచరించారని చెబుతుంటారు. ఈ తీర్థమునకు గోగర్భ తీర్థమని కూడా పేరున్నది. ఇక్కడ స్నానం ఆచరించడం వలన తలచిన కార్యములు నిరాటంకంగా జరుగుతాయని భక్తుల నమ్మకం.

కుమారా ధారా తీర్థం:

కుమారా ధారా తీర్థం:

మహావిష్నువుని భక్తుడొకరు తిరుమలలో తపమునాచారించగా ఆ దేవదేవుడు ప్రత్యక్షమై అక్కడి తీర్థములో స్నానమాచారించమని చెప్తారు. అంతట ఆ భక్తుడు 16 నెలల బాలుడిగా మారెను. అప్పటినుంచి ఈ తీర్తానికి కుమార తీర్థము అని పేరు వచ్చింది. ఈ తీర్థములో స్నానం ఆచరించడం వలన రాజసూయ యాగం చేసినంత ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం . ఇక్కడికి చేరుకోవాలంటే అరణ్య మార్గం గుండా కొండలను అధిరోహించి వెళ్ళవలసి వుంటుంది. కుమారధార తీర్థానికి విశిష్ట చరిత్ర ఉంది. మాఘమాసంలో పౌర్ణమి రోజున సంతాన భాగ్యం లేని మహిళలు ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సంతాన భాగ్యం సిద్ధిస్తుందని కూడా చెబుతుంటారు

చక్రతీర్థం:

చక్రతీర్థం:

ప్రధానాలయం నుంచి 2 కి.మీ. దూరంలో శిలాతోరణం ప్రాంగణంలో చక్ర తీర్థం వున్నది. శిలాతోరణానికి సమీపంలోనే చక్రతీర్థం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మ తపస్సు చేసుకోవాలని భావిస్తారు. తనకో మంచి ప్రదేశం చూపాలని కోరడంతో వెంకటేశ్వరస్వామి తన సుదర్శన చక్రంతో రాతిని చీల్చి బ్రహ్మకు స్థానం చూపించారు. కొండపై నుంచి వచ్చిన నీటితో ఇక్కడ తీర్థం ఏర్పడింది. బ్రహ్మోత్సవ సమయంలో స్వామి ఉత్సవమూర్తిని ఇక్కడకు కూడా తీసుకొస్తారు. ఈ తీర్థం లో స్నానం ఆచరించడము వలన పాపాలు తొలగి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

నాగ తీర్థం

నాగ తీర్థం

దేవాలయం నుంచి కిలోమీటరు దూరంలో ఉంటుంది నాగతీర్థం. అలాగే, ఈ తీర్థానికి సమీపంలోనే బాలతీర్థం కూడా చూడవచ్చు. ఇక్కడ స్నానం చేస్తే బాలల్లా మారిపోతారని, అంటే అలాంటి శక్తిని సంతరించుకుంటారని చెబుతారు. ప్రస్తుతానికి ఈ తీర్థంలో జలం కనిపించడం లేదు. సృష్టికి విరుద్ధం కనుక జలం అంతరించిందని అంటారు.

శేషతీర్థం

శేషతీర్థం

సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడు ఆదిశేషుడు (నాగేంద్రుడు) రూపంలో కొలువై ఉన్న తీర్థం ఇది. తిరుమల పాపవినాశనం డ్యామ్ నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో కొంతదూరం ప్రయాణించడం ద్వారా చేరుకోవచ్చు. ఈ తీర్థాన్ని చేరుకోవాలంటే నీటి ప్రవాహాలను దాటాల్సి ఉంటుంది. చివరిగా పది మీటర్ల వ్యాసార్థంతో కూడిన పెద్ద తీర్థం ఉంటుంది. ఈత బాగా వచ్చిన వారు ఇందులోకి దిగి కొంత మేర లోపలికి వెళ్లినట్టయితే అక్కడ ఆదిశేషుడి శిలారూపాన్ని దర్శించుకోవచ్చు.

ఈత రాని వారు గాలి నింపిన వాహనాల ట్యూబులు, తాడును రక్షణగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. గైడ్ సహకారం తప్పనిసరి. ఎందుకంటే అటవీ ప్రాంతం... శేష తీర్థంలో పేరులో ఉన్నట్టుగానే నాగు పాములు ఈ తీర్థంలో, చుట్టు పక్కల సంచరిస్తుంటాయి. కనుక తెలియకుండా వెళ్లి అపాయాన్ని కొని తెచ్చుకోకుండా గైడ్ సాయం తీసుకుని వెళ్లడం మంచిది.

ఒకరోజు శ్రీ మహావిష్ణువుకు బాగా దాహం వేసింది. దాంతో జలాన్ని తీసుకురావాలని గరుత్మంతుడ్ని పురమాయించారు. కానీ ఆయన ఎంత సేపు అయినా నీరు తేకపోవడంతో అప్పుడు స్వామివారు ఆదిశేషుడ్ని కోరతారు. దీంతో ఆదిశేషుడు జలాన్ని తన తోక ద్వారా రప్పించి స్వామి వారి దాహం తీర్చారని, అందుకే ఇది శేష తీర్థం అయ్యిందని పురాణ చరిత్ర.

బస్సు సౌకర్యం

బస్సు సౌకర్యం

ఈ తీర్థములు చూసేందుకు టి టి డి వారు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. టాక్సీ లో వెళ్ళే సౌకర్యము కూడా వున్నది. CRO దగ్గర వున్న కళ్యాణి సత్రం (choultry ) నుండి APSRTC బస్సులు ప్రతి 20 ని. ఒకటి వున్నాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Tirumala Tirthas Legends and Its references from puranas

    Suta Rish addressed sages about the Mahatyam of the seventeen tirthas beginning with the Kapila Tirthas. once up on time a certain brahmana was preparing to start on a pilgrimage to the holy waters and kamaladhisa, appearing to him in a dream, asked him why he intended to go on that religious tour and intimated to him..
    Story first published: Thursday, December 8, 2016, 18:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more