For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడు వారాల నగల గురించి ఆసక్తికరమైన విషయం

|

ప్రస్తుత రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ల ఉంగరాలు, మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు. వీటిని స్త్రీలు వారం రోజులూ ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం, ఆరోగ్యం కోసమూ బంగారు ఆభరణాలు ధరించేవారు. వాటినే ఏడు వారాల నగలు అనే వారు. ఇప్పటికీ అందరికీ ఆసక్తి ఏడు వారాల నగలు అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది..

నగలంటే ఇష్టపడని స్త్రీలు ఎవరూ వుండరు. అలాంటి నగల గురించి తెలుసుకోవటం, ధరించటం అందరికీ నచ్చే విషయం. అయితే నగలు ఎన్నో రకాలు వున్నా ప్రత్యేకించి ఏడువారాల నగలు అని సినిమాల్లో, పెద్దల మాటల్లో, కథల్లో వింటూఉంటాం. అవి ఏంటో, ఏయే రోజుల్లో ఏవి ధరించాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఆయా వారాన్ని బట్టి ఆ రోజుకి వుండే గ్రహాధిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో చెప్పబడ్డాయి.
అలా ఆదివారం సూర్యనికిష్టమైన రోజు కాబట్టి ఆ రోజున కెంపులతో చేసిన నగలు, హారాలు, కమ్మలు ధరించాలి.

Traditional Seven Week Jewellery Of India

చంద్రునికి ఇష్టమైంది సోమవారం. ఆ రోజున ముత్యాల హారాలు, ముత్యాల గాజులతో అలకరించుకోవాలి.

మంగళావారం కుజుడికిష్టమైనది. ఆ రోజున పగడాలతో చేసిన నగలు పెట్టుకోవాలి.

బుధుడికిష్టమైనది బుధవారం. ఆ రోజు ఆయనకిష్టమైన పచ్చల హారాలు, గాజులు వేసుకోవాలి.
గురువారం బృహస్పతిది. అందుకే గురువారం రోజు పుష్పరాగంతో చేసిన కమ్మలు, ఉంగరాలు ధరించాలి.

శుక్రవారం శుక్రుడికిష్టమైనది ఆ రోజు. అందుకే ఆ రోజు వజ్రాల హారాలు, ముక్కుపుడుక ధరించి లక్ష్మీదేవిలా దర్శనమివ్వాలి.

శనివారం శనిభగవానుడికి ఇష్టమైనది కాబట్టి ఆ రోజున ఆయనకిష్టమైన నీలమణి నగలు ధరించాలి. నీలంతో చేసిన కమ్మలూ, నగలు, ముక్కుపుడుకా పెట్టుకోవాలి. నవరత్నాలతో పాపిడ బిళ్ల, వంకీలూ ఇలా ఎన్నయినా చేయించుకోవచ్చు. ఇలా నవరత్నాలతో కూడిన నగలు, వారానికి అనుగుణంగా అలకరించుకోవడం కన్నా స్త్రీకి గొప్ప వైభోగం ఇంకోకటి వుండదు.

ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు సిద్దించేలా గ్రహాలు అనుకూలించి ప్రసాధిస్తాయని నమ్మకం. అందుకోసమే ఏడు వారాల నగలుగా ప్రసిద్ది చెందాయి.

English summary

Traditional Seven Week Jewellery Of India


 Many of the younger generations are not familiar with yedu varala nagalu-7 Week indian Jewels-jewelry-jewellery due to latest trends and fashion. according to indian history in olden days men used to wear gem stones based on week and women used to wear necklace studded with gem stones for each day of the week. Edu-yedu means seven, Vaaralu means days-like Sunday Monday etc. and Nagalu means Jewellery. This was a very old tradition and is still followed by few people
Story first published: Saturday, December 27, 2014, 16:42 [IST]
Desktop Bottom Promotion