For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జల్లికట్టు గురించి ఈ ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసా...

పురుషులందరూ జల్లి కట్టు ఆట ద్వారా తమ ధైర్యాన్ని, బలాన్ని చాటి చెప్పేందుకు దీన్ని వేదికగా చేసుకునేవారు. ఈ పోటీలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు క్యూ కట్టేవారట.

|

మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనగానే అందరికీ కోడిపందాలు అనే విషయం టక్కున గుర్తుకొస్తుంది. అలాగే తమిళనాడులో కూడా పొంగల్ పండుగ అనగానే జల్లికట్టు పండుగ జరుగుతుంది. అక్కడే కాదు మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఈ క్రీడను ఘనంగా జరుపుకుంటారు.

JalliKattu

జల్లి కట్టు ఆటలో ఎద్దును లొంగదీసుకునేందుకు అనేక మంది యువకులు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఎవ్వరు అడ్డొచ్చినా సరే ఎద్దు తన ఎదురుగా వచ్చిన వారిని తన పదునైన కొమ్ములతో పొడిచి గాయపరుస్తుంది. కొంత మంది ఈ ఆటలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో ఈ ఆటపై కోర్టులు నిషేధం విధించినా.. అక్కడ మాత్రం యధాతథంగా ఈ జల్లికట్టు జరుగుతుంది.

JalliKattu

కోనార్లు అని పిలువబడే బిషప్ లు నివసించే ప్రాంతాల్లో ఈ జల్లి కట్టు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తమిళనాడులోని మధురై, పలామెడు, పుదుక్కొట్టై, నార్తమలై, తేనిమలై వంటి నగరాల్లో జల్లి కట్టు క్రీడ బాగా ప్రాచుర్యం పొందగా, మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ జల్లి కట్టును ఆటను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పొంగల్ సందర్భంగా ఈ జల్లికట్టును ఎందుకు జరుపుతారు? దీని వెనుక కారణాలు ఏమిటి? ఎందుకని తమిళనాడు ప్రజలు ఈ ఆటకు అంత విలువ ఇస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

400 ఏళ్ల క్రితం..

400 ఏళ్ల క్రితం..

తమిళనాడులో తరతరాలుగా జరుగుతున్న ఈ వేడుకలు పొంగల్ తర్వాత కనుమ రోజున జరుగుతాయి. ఈ వేడుకలో ఎద్దు మెడకు ఒక ఉంగరాన్ని కడతారు. ఆ ఎద్దును రింగులోకి వదులుతారు. క్రీస్తు పూర్తం 400 ఏళ్ల క్రితం నుండి ఈ ఆటను కొనసాగిస్తున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

సల్లి కట్టు..

సల్లి కట్టు..

ప్రస్తుతం జల్లికట్టుగా పిలువబడే ఈ పేరు పూర్వం సల్లి కట్టుగా ఉండేది. సల్లికట్టు అంటే ఎద్దు మెడలో బంగారం బాగా అలంకరించడం. ఎద్దుతో ఎవరైతే వీరోచితంగా పోరాడి ఆ బంగారాన్ని తీసుకొస్తారో వారే విజేతగా నిలుస్తారు.

బెదిరించే ఆట..

బెదిరించే ఆట..

ప్రాచీన తమిళ సాహిత్యం మరియు సింధూ లోయ నాగరికత పెరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. క్లైంబింగ్ అనే పదాన్ని పురాతన తమిళ సాహిత్యంలో బెదిరించే ఆట పేరుగా ఉపయోగిస్తారు.

తమ ధైర్యాన్ని చాటి చెప్పేందుకు..

తమ ధైర్యాన్ని చాటి చెప్పేందుకు..

పురుషులందరూ జల్లి కట్టు ఆట ద్వారా తమ ధైర్యాన్ని, బలాన్ని చాటి చెప్పేందుకు దీన్ని వేదికగా చేసుకునేవారు. ఈ పోటీలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు క్యూ కట్టేవారట. ప్రస్తుతం జల్లి కట్టులో విజేతగా నిలిచిన వారికి బంగారం, నగదు వంటి బహుమతులు ఇస్తున్నారు.

బుల్ స్పెషల్..

బుల్ స్పెషల్..

తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లాలోని ఒక పట్టణం. పల్లికుళం సల్లి కట్టుకోసం ప్రత్యేకంగా పెంచిన కాళిమంకులం. కంగయం ఎద్దుల కన్నా ఇది దారుణంగా ఉంటుంది.

బుల్ వార్..

బుల్ వార్..

ఈ జల్లి కట్టు వంటి ఆట విదేశాల్లోనూ ప్రముఖ క్రీడగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగల్ మరియు మెక్సికోలలో , బుల్ వార్ ఇప్పటికే జాతీయ వినోద క్రీడగా వర్థిల్లుతోంది. ఈ ఆట ప్రకారం ఎద్దులను అరేనాలోకి నెట్టేవేస్తారు.వాటిని చంపేయడమే వారి లక్ష్యం. ఎద్దుల పోరాటం మరియు వధ అనేవి ఒకేలా అనిపించవచ్చు. కానీ ఈ రెండు పూర్తిగా భిన్నమైనవి.

ఎద్దులను ముస్తాబు..

ఎద్దులను ముస్తాబు..

మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ జల్లి కట్టులో ముందుగా ఎద్దులను ముస్తాబు చేస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. కొన్నిచోట్ల బుడగలు కూడా కడతారు. అంతేకాదు వీటిని బరిలో దింపేందుకు కొన్ని రోజుల నుండే సిద్ధం చేస్తారు.

ఎద్దులకు మంచి దానా..

ఎద్దులకు మంచి దానా..

సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమలో కోళ్లకు ఎలా అయితే బలమైన పౌష్టికాహారం ఇస్తారో.. అదే విధంగా అక్కడ కూడా ఎద్దులకు మంచి దానా వంటి వాటిని వేసి మేపుతూ ఉంటారు. తర్వాత జల్లికట్టుకు సిద్ధం చేస్తారు.

నిషేధం ఉన్నా..

నిషేధం ఉన్నా..

జల్లి కట్టు ద్వారా పశువులను హింసిస్తున్నారని జంతు ప్రేమికులు కోర్టులో కేసులు వేశారు. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ ఆటపై నిషేధం విధించింది. అయినా కూడా అక్కడి ప్రజలు వాటిని ధిక్కరించి ఈ ఆటను కొనసాగించారు. అంతేకాదు చెన్నైలోని మెరీనా బీచ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం చేశారు.

దిగొచ్చిన తమిళ సర్కారు..

దిగొచ్చిన తమిళ సర్కారు..

అయితే ఈ సంప్రదాయ క్రీడ కోసం ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి ఆందోళనలు చేశారు. అంతేకాదు బిల్లులో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన తమిళనాడు సర్కారు ఈ బిల్లుకు సవరణలు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్రంతోనూ ఆర్డినెన్సు జారీ చేయించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం యధావిధిగా.. జల్లికట్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

English summary

Unknown facts about JalliKattu

Do you know about the lesser known facts about Jallikattu? Read here in Telugu
Desktop Bottom Promotion