Latest Updates
-
బట్టతల నాన్న,తాత వల్ల వస్తుందా? అమ్మ వల్లా? అసలు విషయం తెలిస్తే అవునా,నిజమా అనాల్సిందే! -
స్వైపింగ్ చేసి విసిగిపోయారా? బంబుల్ డేటింగ్లో రాబోతున్న ఈ మార్పులు మీ లైఫ్ మార్చేయవచ్చు! -
ఆన్ లైన్ ఆర్డర్స్ వద్దు.. కరకరలాడే జ్యూసీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి -
మీరు ఎంత కాలం బతుకుతారో..30 సెకన్ల ఈ కుర్చీ టెస్ట్ తో తెలుసుకోవచ్చు! -
నోరూరించే మామిడికాయ తాలింపు అన్నం..అదిరిపోతుంది బాసూ కేక కేక అంతే.. -
భర్త కోసం ఉద్యోగం వదలాలా? సుప్రీంకోర్టు తీర్పుతో వర్కింగ్ ఉమెన్స్‌కు ఊహించని ఊరట! -
టిఫిన్ బండి స్టైల్ అల్లం చట్నీ..ఏంట్రా ఇంత బాగుంది అని మెచ్చుకోవాల్సిందే! -
గ్రహాల కదలికలతో ఈ 4 రాశుల వారికి నేడు ఊహించని ధనయోగం..కెరీర్లో తిరుగులేని విజయాలు! -
ఫైబర్, ప్రోటీన్ పుష్కలం..కొవ్వు కరిగించి, కొండలను ఢీకొట్టే బలాన్నిచ్చే జొన్న కిచిడి..ఎలా చేసుకోవాలంటే.. -
మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే!
కుంభకర్ణుడు ఆరునెలలు ఎందుకు నిద్రపోయేవాడు ?
గంటల తరబడి నిద్రపోయినా.. గాఢనిద్రలో నుంచి తేరుకోకపోయినా.. అందరికీ గుర్తొచ్చేది కుంభకర్ణుడు. అలాగే.. కుంభాలు కుంభాలు తిన్నా.. పరిమితికి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్నా.. కుంభకర్ణుడితో పోలుస్తారు. మితిమీరిని ఆహారం, నిద్రపోయే వాళ్లను కుంభకర్ణుడితో పోల్చడాన్ని సరదాగా చూస్తూ ఉంటాం.
రామాయణంలో కుంబకర్ణుడి మరణం కథ..!
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరునెలలపాటు కుంభకర్ణుడు నిద్రపోతాడని మన పురాణాల్లో చెబుతూ వివరిస్తున్నాయి. పురాణాల్లో విషయమే అయినా.. మనకు ఆశ్చర్యంగా, వింతగా ఉంటుంది. కుంభకర్ణుడి పాత్ర మొత్తం చాలా విడ్డూరంగా, నమ్మలేనివిధంగా అనిపిస్తుంది. అయితే కుంభకర్ణుడు ఎందుకు ఆరునెలలు నిద్రపోతాడు ? ఇది అతనికి పుట్టికతో వచ్చిన గుణమా ? శాపమా ? వరమా ?

కుంభకర్ణుడు రావణుడి సోదరునిగా మనందరికీ తెలుసు. కైకసి, విశ్రవసునకు పుష్పోత్కటము నందు కుంభకర్ణుడు పుట్టాడు. పుట్టగానే, దొరికిన జంతువులను పట్టుకుని మింగే ప్రయత్నం చేసాడట. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణుడిని తరిమినా, అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో చెప్పుకున్నాడట. కుంభకర్ణుడు రావణునితో వెళ్లి బ్రహ్మకోసం ఘోరమైన తపస్సు చేశాడట. రావణుడి కంటే ఎక్కువగా తపస్సు చేయడంతో దేవతలందరూ భయపడి.. బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఎలాంటి విద్యలు సాధిస్తాడో అని ఆందోళనగా తమను కాపాడమని బ్రహ్మను వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ అజ్ఞ ప్రకారం సరస్వతి కుంభకర్ణుడి నాలుక మీద నిలబడి ఆరు నెలలు నిద్ర, ఒక రోజు భోజనం కావాలి అని పలికించిందట. అడిగిన వరమే యిచ్చాడు బ్రహ్మ.

అందుకే కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారట. కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చిల్లులు పడేవని మన పురాణ కథలు చెబుతాయి. కుంభకర్ణుడి నోటి నుంచి వచ్చే గాలికి సైనికులు విసిరేసినట్టు పడేవారట. అందుకే రామ, రావణ యుద్ధం సమయంలో కుంభకర్ణుని నిద్ర లేపడం చాలా కష్టమయింది. ఈ సన్నివేశాలు మనం సినిమాల్లో చూసే ఉంటాం. మేళ తాళాలు, ముక్కుల్లో గునపాలు గుచ్చినా కుంభకర్ణుడు మాత్రం నిద్రలో నుంచి బయటకురాలేదు.
రామాయణంలో రావణుని భార్య యొక్క ఆశ్చర్యమైన కథ

ఆఖరికి కుంభకర్ణుడు నిద్ర లేచినా ఆకలి ఆకలి అని అరవడంతో.. వెయ్యిమందికి సరిపడే ఆహారం ఒక్కడే ఆరగించేశాడు. ఆ తర్వాత రావణుడి కోరికతో.. రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడి వెళ్లాడు. కానీ కుంభకర్ణుడు యుద్ధంలో రామలక్ష్మణులతో పోటీపడలేక బలహీనుడయ్యాడు. ఇదంతా ముందు జన్మశాపం కారణంగా కుంభకర్ణుగా అవతరించాడని పురాణాలు చెబుతాయి.



Click it and Unblock the Notifications