For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెయ్యేళ్లు అయిన చెక్కు చెదరని రామానుజచార్యుల పార్థివదేహం ఎక్కడుందో తెలుసా...!

|

శ్రీరంగంలో శ్రీరామానుజచార్యుల దివ్య శరీరం నేటికీ ఉంది. భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ.. ప్రతి జిల్లాలోనూ మనకు దేవాలయాలు కనిపిస్తాయి. వాటిలో అందరినీ అబ్బురపరిచే దేవాలయాలలో ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ఈ ఆలయంలో శ్రీవిష్ణుమూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీరామానుజాచార్యుల వారి శరీరం. శ్రీరామనుజాచార్యుల వారు పరమపదించి వెయ్యి సంవత్సరాలు పూర్తయినా నేటికీ ఆయన శరీరాన్ని అక్కడే భద్రపరిచి ఉండటం గమనార్హం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం.

రామానుజచార్యులు క్రీ.శ 1017-1137 సంవత్సరాల మధ్య తన జీవిత కాలాన్ని కొనసాగించాడని చరిత్రకారులు చెబుతున్నారు. వీరి ప్రకారం ఆచార్యుల జీవిత కాల వ్యవధి 120 సంవత్సరాలు. పురాణాల ప్రకారం రామానుజచార్యులు తమిళ 'పింగళ' సంవత్సరంలో జన్మించి, మరో 'పింగళ' సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచినట్లు సమాచారం. తమిళ కాలమానం ప్రకారం ఒకే పేరుతో ఉండే సంవత్సరం మరోసారి రావటానికి సుమారు 60 సంవత్సరాలు పడుతుంది. దీని ఆధారంగా రామానుజచార్యుల జీవితం 60 లేదా 120 సంవత్సరాలు ఉండొచ్చు.

రామానుజ జననం..

రామానుజ జననం..

రామానుజచార్యులు తమిళనాడులోని చెన్నపట్నానికి 30 మైళ్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో శ్రీమాన్ ఆసూరి ‘సర్వక్రతు‘ కేశవ సోమయాజి దీక్షితార్, కాంతిమతి అను పుణ్యదంపతులకు రామానుజచార్యుల వారు జన్మించారు.

ఆదిశేషుని అవతారమని..

ఆదిశేషుని అవతారమని..

రామనుజచార్యులు పుట్టిన మాసం దశరథ పుత్రులైన లక్ష్మణ, శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల మామ అయిన పెరియ తిరుమల నంబి ‘శ్రీశైలపూర్ణుడు‘ ఆ శిశువు ఆదిశేషువు అవతారమని భావించారు. అప్పుడు ఇళయ పెరుమాళ్ గా పేరు పెట్టారు.

కంచిపూర్ణుడి వద్ద విద్యాభ్యాసం..

కంచిపూర్ణుడి వద్ద విద్యాభ్యాసం..

ఇళయా పెరుమాళ్ చిన్నతనంలో ‘కంచిపూర్ణుడు‘ని తన గురు సమానంగా భావించాడు. భక్తిలోని మొదటి పాఠాలు ఇళయ పెరుమాళ్ కంచిపూర్ణుడి వద్దనే అభ్యసించాడని పండితులు చెబుతుంటారు.

సిద్ధాంతాలను ప్రతిపాదించడం..

సిద్ధాంతాలను ప్రతిపాదించడం..

రామానుజులు తన జీవిత కాలంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించాడు. అంతేకాదు దీన్ని నిరూపించేందుకు ఎన్నో ఆలయాల్లో అనేక కార్యకలాపాలు నిర్వహించాడు. ఈ క్రమంలో అనేక పర్యటనలు చేశాడు. వాద, ప్రతివాదనలు కూడా చేశాడు.

అష్టాక్షరీ మంత్రాన్ని..

అష్టాక్షరీ మంత్రాన్ని..

ఈ సమయంలో తన గురువు తనకు ఉపదేశించి అత్యంత రహస్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగంలోని రాజగోపురం పైకి ఎక్కి అందరికీ ఉపదేశించాడు. సాధారణంగా అయితే అలా గురువు ఉపదేశించిన అష్టాక్షరీ మంత్రాన్ని బయటకు చెప్పకూడదన్న నియమాన్ని అతిక్రమించి గుడి రాజగోపురంపైకి ఎక్కి అందరికీ వినబడేలా గట్టిగా మంత్రాన్ని చెప్పే సమయంలో, గురువు ఈ మంత్రాన్ని ఇతరులకు చెబితే ‘నీవు నరకానికి పోతావేమో‘ అని అంటే, నాకు ఏమైనా పర్వాలేదు కానీ ప్రజలందరూ స్వర్గానికి వెళ్తారని బదులిచ్చాడట.

రెండో భాగంలో శ్రీరంగంలో..

రెండో భాగంలో శ్రీరంగంలో..

తన జీవితంలోని రెండో భాగంలో రామానుజులు శ్రీరంగంలో గడిపారట. 120 సంవత్సరాలు జీవించి పింగళి సంవత్సరమైన మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహత్యాగం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

అక్కడే శరీరాన్ని విడిచిపెట్టారు..

అక్కడే శరీరాన్ని విడిచిపెట్టారు..

చాలా మంది శ్రీరంగంలోని నాలుగో ప్రాకారంలో ఉన్న రామానుజచార్యుల ఆలయాన్ని సందర్శించినా, అక్కడ ఉన్నది ఆయన దివ్వ శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగి భంగిమలో కూర్చొని రామానుజులు అక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు.

విగ్రహంలా మెరుస్తూ..

విగ్రహంలా మెరుస్తూ..

ప్రతి సంవత్సరం రామానుజుల కోసం రెండు సార్లు ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనం అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

English summary

Unknown Facts About Ramanujacharya

Here we talking about unknown facts about ramanujacharya. Read on