For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరూధిని ఏకాదశి రోజున ఇలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వస్తుందా?

2020లో ఏప్రిల్ 18వ తేదీన వరూధిని ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశిల మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఓ ప్రత్యేకత ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

|

పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో కృష్ణ పక్షానికి చెందిన ఏకాదశిని వరూధిని ఏకాదశి లేదా వరూధిని గైరస్ అని పిలుస్తారు. మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది.

Varuthini ekadashi importance and vrat katha in Telugu

ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత ముఖ్యమైన వరూధిని ఏకాదశి ఈ నెల అంటే ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం...

పద్మపురాణ ప్రకారం..

పద్మపురాణ ప్రకారం..

పద్మపురాణం ప్రకారం, ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు.

విష్ణుమూర్తిని ప్రార్థించడం..

విష్ణుమూర్తిని ప్రార్థించడం..

ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు.

అప్పటికే రాజు కాలు..

అప్పటికే రాజు కాలు..

అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యే సరికే రాజు గారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ఓ ప్రభూ, ఇది నాకు ఎందుకు జరిగింది, అప్పుడు రాజు పూర్వ జన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట.

వరాహ అవతారాన్ని..

వరాహ అవతారాన్ని..

అయితే అదే సమయంలో అదే శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు.

దేవుని ఆదేశాల ప్రకారం..

దేవుని ఆదేశాల ప్రకారం..

ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట.

అప్పటి నుండి విష్ణు ఆరాధన..

అప్పటి నుండి విష్ణు ఆరాధన..

అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్టతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు. అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి, బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి.

మానవ కోరికలన్నీ..

మానవ కోరికలన్నీ..

శ్రీక్రిష్ణుడు యుధిష్టర రాజుకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు. వరూధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడు.

ఇవి చేయాలి..

ఇవి చేయాలి..

  • వరూధిని ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి హారం అర్పించాలి.
  • విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి
  • పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి
  • దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి.
  • ఇవి చేయకూడదు..

    ఇవి చేయకూడదు..

    • ఎర్రని ధాన్యాలను తినకూడదు
    • మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు
    • మెటల్ ప్లేట్ లో ఆహారం తినవద్దు
    • తేనే తినకూడదు
    • ఆహారం ఒక్కసారి మాత్రమే చేయాలి.

English summary

Varuthini ekadashi importance and vrat katha in Telugu

Varuthini Ekadashi or ‘Baruthani Ekadashi’ as it is also known as a holy fasting day for Hindus that is observed on the ‘ekadashi’ (11th day) of the Krishna Paksha (the dark fortnight of moon) during the ‘Vaishakha’ month in the North Indian calendar.
Desktop Bottom Promotion