For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vasant Panchami 2021 :చదువుల తల్లి అనుగ్రహం పొందాలంటే... సరస్వతీ దేవిని ఇలా పూజించండి..

వసంత పంచమి రోజున ఏ పూజలను ప్రత్యేకంగా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ మతం ప్రకారం వసంత పంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజు చదువుల తల్లి సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. పురాణాల ప్రకారం, ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి.

Vasant Panchami 2021: Date, Shubh Muhurat, Saraswati Puja Vidhi in Telugu

మాఘ మాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతోపిలుస్తారు. జ్ణానం, విద్య, చదువుకు నానార్థాలుగా పిలువబడే విద్యకు సరస్వతీ దేవత ఆధిదేవత. వసంతపంచమి రోజున ఈ అమ్మవారు జన్మించారని చాలా మంది భావిస్తారు.

Vasant Panchami 2021: Date, Shubh Muhurat, Saraswati Puja Vidhi in Telugu

అందుకే ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈరోజు శ్రీ మహాలక్ష్మీ ఆవిర్భవించిందని, అందుకే దీనిని మదన పంచమిగా కూడా పిలుస్తుంటారు. ఈ సందర్భంగా రెగ్యులర్ గా చేసే పూజల మాదిరిగా కాకుండా, ఏ విధంగా పూజిస్తే.. చదువుల తల్లి సరస్వతీ అనుగ్రహం లభిస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జ్యోతిష్కుడు చెప్పినదానిపై మీరు ఏమి విశ్వసించగలరు? ఏమి నమ్మకూడదు? జ్యోతిషశాస్త్రం ఏమి చెబుతుందో చూడండి?జ్యోతిష్కుడు చెప్పినదానిపై మీరు ఏమి విశ్వసించగలరు? ఏమి నమ్మకూడదు? జ్యోతిషశాస్త్రం ఏమి చెబుతుందో చూడండి?

వసంత పంచమి ఎప్పుడు?

వసంత పంచమి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదో రోజున అంటే ఫిబ్రవరి 16వ తేదీన మంగళవారం నాడు వసంత పంచమి పండుగను జరుపుకోనున్నారు. వసంత పంచమి రోజున చాలా శుభయోగాలు ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున చదువుల తల్లి సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయి.

శుభ సమయం..

శుభ సమయం..

ఫిబ్రవరి 16వ తేదీన అంటే మంగళవారం నాడు తెల్లవారుజామున ఉదయం 3:36 గంటలకు పంచమి తిథి ప్రారంభమవుతుంది. వసంత పంచమి ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 5:46 గంటలకు ముగియబోతుంది.

పూజా విధానం..

పూజా విధానం..

మాఘ శుక్ల పంచమి రోజున సరస్వతీ దేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజున మహాగణపతిని కూడా షోడపశోచారాలతో పూజించాలి. సరస్వతీ దేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని తీసుకుని జ్ణానానికి చిహ్నాలైన పుస్తకాలు, లేఖినులను, పూజా పీఠంపై ఉంచి అష్టోత్తరం చదవాలి. తెల్లని కుసుమాలు, సుగంధ ద్రవ్యాలు, చందనంతో అర్పించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి.

Gupt Navratri 2021:గుప్త నవరాత్రి ఎప్పుడు? అమ్మవారిని ఎలా ఆరాధిస్తే అనుగ్రహం లభిస్తుంది...!Gupt Navratri 2021:గుప్త నవరాత్రి ఎప్పుడు? అమ్మవారిని ఎలా ఆరాధిస్తే అనుగ్రహం లభిస్తుంది...!

పిల్లలకు అక్షరాభ్యాసం..

పిల్లలకు అక్షరాభ్యాసం..

ఈరోజున మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలు తమ చిన్నారులకు అక్షరభ్యాసం కూడా చేయిస్తారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బాసరతో పాటు ఇతర సరస్వతీ దేవి ఆలయాల్లో ఈ వసంత పంచమి రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

పూర్వకాలం నుండి ఆనవాయితీగా..

పూర్వకాలం నుండి ఆనవాయితీగా..

వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తే.. చిన్నారులకు అక్షరభ్యాసం చేయిస్తే.. ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని.. అపారమైన జ్ణానం సిద్ధిస్తుందని.. నిరంతరం విద్యాభివ్రుద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. పూర్వకాలంలో రాజులు తమ ఆస్థానాలలో దర్బారులు నిర్వహించి, పండితులు, కవులు, కళాకారులు సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.

సరస్వతీ దేవి అనుగ్రహంతో..

సరస్వతీ దేవి అనుగ్రహంతో..

వ్యాస మహార్షి కూడా చదువుల తల్లి సరస్వతీ దేవి అనుగ్రహంతోనే వేదాలను విభజించాడు. అష్టాదశ పురాణాలను ఆవిష్కరించి, భారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతదేశ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడిగా నిలిచాడు.

English summary

Vasant Panchami 2021: Date, Shubh Muhurat, Saraswati Puja Vidhi in Telugu

Here we are talking about the vasant panchami 2021: date, shubh muhurat, saraswati puja vidhi in Telugu. Read on
Story first published:Friday, February 12, 2021, 16:42 [IST]
Desktop Bottom Promotion