శ్రీకృష్ణుడికి 16వేల మంది గోపికలతో శృంగారం చేశాడా?

Written By:
Subscribe to Boldsky

ఏ దేవుడికి లేని విధంగా ఒక్క శ్రీకృష్ణుడికే చాలామంది ప్రేయసీలుండడం కాస్త ఆశ్చర్యకరమే. అయితే అతని మంచితనాన్ని మెచ్చే వాళ్లంతా శ్రీకృష్ణుడిపై ప్రేమ పెంచుకున్నారు. బాల్యంలో శ్రీకృష్ణుడి ఆటపాటలు ... యవ్వనంలో ఆయన చేసిన కొంటెపనులు ... మహాభారత యుద్ధసమయంలో మానసిక పరిపక్వతతో వ్యవహరించిన తీరు కృష్ణుడి వ్యక్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపాయి.

సరసాలు చేశాడు

సరసాలు చేశాడు

శ్రీకృష్ణుడు అంటేనే అందరికీ ఆయన చిలిపి చేష్టలతో పాటు రాసలీలలు గుర్తొస్తాయి. ఆయనకు అష్టభార్యలున్నారు. 16వేల మంది గోపికలతోనూ సరసాలాడాడు. ఆయన కేవలం వారితో సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేశాడు. అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మధ్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే.

వారంతా రాజ కన్యలు

వారంతా రాజ కన్యలు

నరకాసురుడు భూలోకంలోని రాజ కన్యల్ని అపహరిస్తాడు. వారందరినీ పాతాళంలో ఒక గృహంలో బంధిస్తాడు. వారంతా అలాగే ఏళ్ల పాటు నరకాసురుడి చెరలోనే బంధీగా ఉంటారు. మొత్తం 16,0000 మంది రాకుమార్తెలను అతని రాజ్యంలో బందీగా ఉంటారు. వరాహస్వామి దేవేరి-భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకాసురుడు.

వధా

వధా

నరకాసరుడు అతనికుండే వరగర్వంతో అందరినీ హింసించేవాడు. నరకాసురుడి నుంచి తమను రక్షించమని భూలోకవాసులు, స్వర్గంలోని దేవతలు కోరడంతో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా అతన్ని వధిస్తాడు.

కన్యలంతా కృష్ణుడితోనే ఉంటామంటారు

కన్యలంతా కృష్ణుడితోనే ఉంటామంటారు

నరకాసురుని సంహరించిన కృష్ణుడు రాజ్యాన్ని అతడి కుమారుడికి అప్పగించి, బంధీలుగా ఉన్న కన్యలను వారి దేశాలకు పంపాలని ఆదేశిస్తాడు. కానీ ఆ కన్యలు మాత్రం వారివారి రాజ్యాలకు వెళ్లడానికి ఇష్టపడరు. శ్రీకృష్ణుడితోనే ఉంటామని పట్టుబడుతారు. అందుకు శ్రీకృష్ణుడు మొదట నిరాకరిస్తాడు.

ప్రేమతో అలా చేయబోతారు

ప్రేమతో అలా చేయబోతారు

వారి కోరికను కృష్ణుడు నిరాకరిస్తాడు. దీంతో వారంతా ఆత్మత్యాగం చేసుకుంటామని శ్రీకృష్ణుడితో చెబుతారు. తన కోసం అంత పని చేయొద్దంటూ వారిని తనతో ఉండటానికి అనుమతిస్తాడు.

దాంతో వారంతా ద్వారక నగరానికి చేరుకుని కృష్ణుడితోనే ఉంటారు.

శ్రీకృష్ణుడిని భర్తగా భావిస్తారు

శ్రీకృష్ణుడిని భర్తగా భావిస్తారు

కృష్ణ సహచర్యాన్ని వరంగా పొందిన ఆ 16వేల మంది గోపికలు శ్రీకృష్ణుడిని తమ భర్తగా భావిస్తారు. శ్రీకృష్ణుడ్ని అందరూ శృంగార రూపంగా భావిస్తారు. శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగేశ్వరుడు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేందుకే ఆయన శిఖలో నెమలి ఫించం ధరించాడు.

సంభోగం చేయని ప్రాణి

సంభోగం చేయని ప్రాణి

ఆడా మగా కలిసి సంభోగం చేయని ప్రాణి నెమలి ఒక్కటే. మగ నెమలి బాగా పరవశించినప్పుడు వచ్చే కంటినీటిని తాగి ఆడ నెమలి గుడ్డు పెడుతుంది. ఈ పవిత్ర పక్షి నెమలి ఈకలు తలపై ధరించడానికి కారణం శ్రీకృష్ణుడు తన పవిత్రను లోకానికి చాటిచెప్పడం కోసమేనట. పదహారు వేల మంది గోపికలు ఆయన చుట్టూ ఉన్నా కూడా కృష్ణుడు మాత్రం వారితో అసభ్యంగా ప్రవర్తించలేదు. అందుకే ఆయన అత్యంత పవిత్రుడు.

దేహత్యాగం

దేహత్యాగం

కృష్ణుడు దేహత్యాగం చేసిన ప్రభాస తీర్థం సమీపంలోని కొలనులో ఈ గోపికలంతా దేహత్యాగం చేశారు. ఈ కారణంగానే ఈ కొలనును గోపీతాలాబ్ అంటారు. ఈ కొలను దగ్గర కూర్చుంటే ఆనాటి ఘట్టం కళ్లముందు కదలాడుతుందంట. గోపికలు లేకున్నా.. కృష్ణుడితో వాళ్లు గడిపిన మధురమైన క్షణాలు, మధురమైన జ్ఞాపకాలుగా ఆ కొలనులో తెలియాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందంట.

English summary

Were Gopikas Krishna's girlfriends?

Were Gopikas Krishna's girlfriends?