For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుంభకర్ణుడు ఒకటి కోరుకుంటే మరొకటి జరిగింది, నోరు తిరగక నిద్రాసనం కోరాడు

వాస్తవానికి కుంభకర్ణుడు ఇంద్రాసనం కావాలని కోరుతాడు. అయితే బ్రహ్మ దేవుడు సరస్వతి దేవీ సహాయంతో కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతని నోరు తిరగకుండా చేస్తాడు. దీంతో కుంభకర్ణుడు..కుంభకర్ణుడు ఒకటి కోరుకుంటే.

|

ఎవరైనా సరే బాగా నిద్రపోతుంటే వారిని కుంభకర్ణుడితో పోల్చుతూ ఉంటాం. అయితే కుంభకర్ణుడు అంతలా నిద్రపోవడానికి ఒక కథ ఉంది. ఒకే ఒక చిన్న తప్పు వల్ల కుంభకర్ణుడు అలా లైఫ్ లాంగ్ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే కుంభకర్ణుడు నిద్ర నుంచి మేల్కొనగలడు. ఆ రోజు ఫుల్ గా తిని మళ్లీ పడుకోవడమే అతని పని.

కుంభకర్ణుడు రావణుడికి సోదరుడు. ఆయన ఎప్పుడూ నిద్రలోనే ఉండడానికి ఒక కారణం ఉంది. రావణుడి తండ్రి విశ్రావసుడు. తండ్రి మాట మేరకు రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు తపస్సు చేస్తారు.

మీకు ఏమి వరాలుకావాలి

మీకు ఏమి వరాలుకావాలి

చాలా ఏళ్ల తర్వాత బ్రహ్మదేవడు ప్రత్యక్షం అయి మీకు ఏమి వరాలుకావాలో కోరుకోమంటాడు. దాంతో ముందుగా రావణాసుడు తనకు చావే ఉండకూడదని కోరుకుంటాడు. అది సాధ్యం కాదని చెబుతాడు బ్రహ్మ. దేవతల వల్ల, రాక్షసుల వల్ల, మరికొన్ని జీవరాశుల వల్ల నీకు మరణం సంభవించదని చెబుతాడు బ్రహ్మ దేవుడు.

నీతినిజాయితిని పాటించేలా

నీతినిజాయితిని పాటించేలా

ఇక విభీషుణుడేమో నీతినిజాయితీనే తాను పాటిస్తూ ఉండేలా వరాన్ని ఇవ్వమని కోరుతాడు. అతనికి ఆవరాన్ని ప్రసాదిస్తాడు బ్రహ్మ. ఇక కుంభకర్ణుడు అడిగే వరం ఏమిటో ముందుగానే దేవతలకు తెలిసిపోయి ఉంటుంది. దీంతో అతనికి ఆ వరం ఇవ్వొద్దని బ్రహ్మ దేవుడిని కోరుతారు దేవతలు.

నిద్రాసనం కావాలి

నిద్రాసనం కావాలి

వాస్తవానికి కుంభకర్ణుడు ఇంద్రాసనం కావాలని కోరుతాడు. అయితే బ్రహ్మ దేవుడు సరస్వతి దేవీ సహాయంతో కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతని నోరు తిరగకుండా చేస్తాడు. దీంతో కుంభకర్ణుడు నిద్రాసనం కావాలని కోరుతాడు. బ్రహ్మ తథాస్తు అంటాడు. దీంతో అతను జీవితాంతం నిద్రలోకి పోయే వరం పొందుతాడు.

బ్రహ్మ మరో వరం ప్రసాదిస్తాడు

బ్రహ్మ మరో వరం ప్రసాదిస్తాడు

అయితే రావణుడి కోరిక మేరకు ఆరునెలలకు ఒకసారి తినడానికి లేవడానికి బ్రహ్మ మరో వరం ప్రసాదిస్తాడు కుంభకర్ణుడికి. అలా కుంభకర్ణుడిని మోసం చేసి అతనికి ఆ వరం ప్రసాదిస్తాడు బ్రహ్మ.

జీవరాశి అంతటినీ తింటూ ఉంటాడు

జీవరాశి అంతటినీ తింటూ ఉంటాడు

ఇక కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి ఒక రోజు మేల్కొంటాడు. ఆ రోజు తనకు కనపడిన జీవరాశి అంతటినీ తింటూ ఉంటాడు. మళ్లీ పడుకుని ఆరునెలలకు లేస్తాడు. ఇక రాముడితో రావణుడు యుద్ధం చేస్తున్నప్పుడు బలశాలి అయిన తన తమ్ముడు కుంభకర్ణుడి ద్వారా రాముడి సేనను చంపాలనుకుంటాడు రావణుడు.

రాముడి చేతిలో ప్రాణాలు పోతాయి

రాముడి చేతిలో ప్రాణాలు పోతాయి

కుంభకర్ణుడు నిద్రలేస్తే సైన్యం అంతా అల్లోకల్లోలం అవుతుందనుకుని కుంభకర్ణుడిని నిద్రలేపిస్తాడు రావణుడు. కుంభకర్ణుడు నిద్రలేస్తాడుగానీ యుద్ధంలో పాల్గొనలేడు. ఎందుకంటే అతను పడుకుని అప్పటికి తొమ్మిది రోజులు మాత్రమే అయి ఉంటుంది. చివరకు రాముడి చేతిలో ప్రాణాలు కోల్పొతాడు కుంభకర్ణుడు.

English summary

What is the story behind Kumbhakarna's sleep Why he Slept for six Months

What is the story behind Kumbhakarna's sleep Why he Slept for six Months
Story first published:Monday, August 13, 2018, 17:53 [IST]
Desktop Bottom Promotion