For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన స్నేహితులను మరియు గోవులను బ్రహ్మ అపహరించిన తరుణంలో కృష్ణుడు చేసిన పనేమిటి?

|

శ్రీ కృష్ణ భగవానుని జీవితం నుండి సంగ్రహించిన ఆసక్తికరమైన కథనాలు ఎల్లప్పుడూ మనకు ఒక ప్రేరణగానే ఉంటాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ క్రమంలో భాగంగానే రాదా కృష్ణుని కథలు బహు ప్రాచుర్యంలో ఉన్నాయి, నేడు ఈ కథలు అనేక మిలియన్ ప్రేమ కథల ప్రేరణకి మూలంగా ఉన్నాయనడంలో ఆశ్చర్యం లేదు. తన అల్లరి చిల్లరి చిలిపి చేష్టలు, గోకులంలోని స్త్రీలతో వ్యవహరించిన విధానాలు, తన తల్లిని ఇరుకున బెట్టిన అనేక వెన్న దొంగతనాల కథలు, తన స్నేహితులను మరియు గోకులంలోని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రక్షించడానికి అవలంభించిన మార్గాలు, వంటి అద్భుతమైన అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జననం, పూతన మరణం, కాళియ మర్దనం, గోవర్ధన పర్వతం వంటివి అనేకం భక్తుల మనస్సులో ఎన్నటికీ నిలచిపోయి ఉంటాయి. క్రమంగా మీరాబాయి వంటి అనేకమంది భక్తులు, తమ జీవితాన్నే కృష్ణునికి అంకితం చేసి కీర్తనలు రచించారు కూడా.

ఉదాహరణకు, దేవేంద్రుని కోపానికి గురైన గోపాలకులను రక్షించే క్రమంలో, చిటికిన వేలితో గోవర్ధన గిరి ఎత్తిన శ్రీ కృష్ణ భగవానుని, నిజంగా భూమి మీద వెలసిన ఒక దైవిక అవతారంగా ప్రజలు గ్రహించారు. అలా అనేక మార్లు ఇబ్బందులలో ఉన్న తన భక్తులను ఎల్లప్పుడూ రక్షించే మార్గం గురించి ఆలోచించే శ్రీ కృష్ణ భగవానుడు, తన భక్తుల హృదయాలలో ఎల్లప్పుడూ ఒక స్థానాన్ని కలిగి ఉంటాడు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

శ్రీ కృష్ణుని స్నేహితులు అపహరణకు గురైనప్పుడు అతను అవలభించిన విధానాలను వివరించేందుకు గోవర్ధన గిరి సంఘటన వలెనే, మరొక సంఘటన కూడా ఉదాహరణగా ఉంది.

తన స్నేహితులను మరియు గోవులను బ్రహ్మ అపహరించిన తరుణంలో కృష్ణుడు చేసిన పనేమిటి?

అతను తన స్నేహితులతో ఆడుతున్న సమయాన :

ఒకసారి, గోకులంలో ఒక అందమైన మైదానంలో, శ్రీ కృష్ణ భగవానుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ అంతులేని ఆనందాలలో ఆటలాడుతున్న సమయంలో, బ్రహ్మ దేవుడు వారిని గమనించసాగాడు, వీరి విషయంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు. క్రమంగా శ్రీ కృష్ణుడు, తన స్నేహితులతో, మరియు ఆవులతో సమానంగా ప్రేమను పంచుతూ, కలిసి ఆడుకుంటూ బ్రహ్మను సైతం ఆశ్చర్యపర్చాడు. వారిమీద గల కృష్ణుడి ప్రేమ, ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని పరీక్షించాలని భావించాడు బ్రహ్మ.

శ్రీ కృష్ణ భగవానుడు లేని సమయం గమనించి, అవకాశముగా భావించిన బ్రహ్మ దేవుడు, అతని స్నేహితులు మరియు ఆవులను అపహరించి దూరంగా తీసుకెళ్ళాడు. వారెక్కడికి వెళ్ళారో తెలియని కారణాన, వీరిని వెతకడంలో తన ప్రేమను పరీక్షించవచ్చని బ్రహ్మ దేవుని ఆలోచన. కానీ కృష్ణుడు సర్వజ్ఞుడైన సర్వశక్తి సంపంనుడని బ్రహ్మ గ్రహించలేక పోయాడు. కృష్ణునికి భూత, భవిష్యత్ వర్తమాన కాలాలనందు గల పూర్తి అవగాహన కారణంగా, ఎటువంటి ప్రదేశం అయినా, ఎటువంటి వ్యక్తైనా లేదా ఇతరుల మనసులోని ఉద్దేశాలైనా అతని నుండి దాచబడలేదన్నది జగమెరిగిన సత్యం.

బ్రహ్మ దేవుడు తన స్నేహితులను ఆవులను అపహరించాడని కనుగొన్నాడు శ్రీ కృష్ణుడు:

బ్రహ్మ వారందరినీ యోగ నిద్రలో ఉంచాడని గమనించాడు శ్రీ కృష్ణ భగవానుడు. యోగ నిద్ర అనేది ఒక వ్యక్తి యొక్క నిస్తేజమైన స్థితిగా చెప్పబడినది, అందులో ఉన్న వ్యక్తికి, చుట్టుపక్కల జరిగే ఏ విషయం గురించి కూడా, కనీస అవగాహన ఉండదు. ఒక మైకం ఆవరించుకుని ఉంటుంది. మరియు వారు ఎక్కడికి వెళ్లిపోయారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అంతేకాక, యోగ నిద్ర నుండి బయటకు వచ్చినా కూడా, వ్యక్తి జరిగిన సంఘటనను సైతం మర్చిపోతాడు.

అయినప్పటికీ, శ్రీ కృష్ణుడు దేవ లోకం నుండి బ్రహ్మ తమను గమనిస్తున్న విషయాన్ని అప్పటికే పసిగట్టాడు. కానీ, అతను ప్రధానంగా స్నేహితుల తల్లిదండ్రుల గురించి ఎక్కువగా మదనపడ్డాడు. బ్రహ్మ తనను పరీక్షిస్తున్నాడు సరే, కానీ ఆ కారణాన బాలుర తల్లిదండ్రులు భాధలకు గురికాకూడదు కదా అని.

కానీ శ్రీ కృష్ణుడు సర్వశక్తిమంతుడు, అత్యున్నత శక్తి, మరియు దూర దృష్టి కలవాడు, అసాద్యాన్ని సుసాద్యం చేయగల సామర్ధ్యం ఉన్నవాడు. తల్లిదండ్రులు భయపడకూడదన్న ఆలోచనతో, తన మాయలతో, తానే మిగిలిన అందరి స్నేహితులు మరియు ఆవుల రూపాలలోకి మారి, వారికి అనుమానం రాకుండా చూడడంలో జాగ్రత్త తీసుకున్నాడు.

బ్రహ్మకు అనుమానం వచ్చింది :

ఎన్ని రోజులకూ కృష్ణుడు వారికోసం రాకపోవడంతో, అసలు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అన్న అనుమానం బ్రహ్మకు వచ్చింది. తేరిపారా చూడగా ఆశ్చర్యానికి లోనవడం బ్రహ్మ వంతైంది. ఒక్కరు కాకుండా, అనేకమంది కృష్ణులు గోకులంలో పశువులను కాయడం చూసి అవాక్కయిన బ్రహ్మ, ఒకింత కలవరానికి లోనయ్యాడు.

అలా ఎన్నిరోజులు చూసినా కృష్ణుని నుండి ఎటువంటి స్పందన కూడా రాని పక్షంలో తన దైవిక దృష్టితో మరలా గోకులాన్ని చూడసాగాడు. కానీ, తాను అపహరించిన పిల్లలందరూ తమ తమ ఇళ్ళల్లో ఉండడం గమనించాడు. ఇదంతా కృష్ణుని లీలగా గుర్తించాడు బ్రహ్మ.

కృష్ణునికి అందరూ సమానమే అన్న విషయాన్ని నిర్ధారించుకున్నాడు :

క్రమంగా దేవదేవుడైన మహా విష్ణువే, కృష్ణావతారం అన్న విషయాన్ని గ్రహించాడు బ్రహ్మ, కృష్ణుని పర్యవేక్షిస్తున్న సంగతి కూడా అతనికి తెలుసని గ్రహించిన బ్రహ్మ, తానే మోసపోయాడని గ్రహించి, కృష్ణుని స్నేహితులను, ఆవులను యోగ నిద్ర నుండి తిరిగి గోకులానికి పంపించాడు.

స్నేహితుల తల్లిదండ్రుల గురించి శ్రీ కృష్ణుడు ఆలోచించిన తీరులోనే, అతను అందరి మీద ఒకే రకమైన ప్రేమను కలిగి ఉన్నాడు అనడానికి నిదర్శనంగా గుర్తించాడు. మరియు బ్రహ్మకు పూర్తిగా ఒక అవగాహన వచ్చింది, కృష్ణుడు సర్వ శక్తి సంపన్నుడని, మరియు తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతూ, అందరిమీద ఒకే రకమైన ప్రేమను కలిగి ఉంటాడని.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

What Krishna Did When Brahma Abducted His Friends

The interesting anecdotes from the lives of Lord Krishna have always been an inspiration for us. There are stories about his love with Radha, which are today a source of inspiration for millions. The various stories about his mischievous behaviour, and the way he used to make it so complicated for his mother to deal with the ladies in Gokul, whose butter he would steal away; the way he used to rescue his friends and the people of Gokul when they were in trouble, are no less than wonders.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more