For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గరుడ పురాణంలో శిక్షలే కాదు ఇంకా చాలా ఉంటాయి, వాటిని చదివి పాటిస్తే నిన్ను మించిన వారు ఎవరూ ఉండరు

గరుడ పురాణంలో కేవలం శిక్షల గురించి మాత్రమే ఉండవు. ఇందులో పూర్వ ఖండం, ఉత్తర ఖండం అని రెండు భాగాలుంటాయి. పూర్వ ఖండంలో చాలా విషయాలుంటాయి. గరుడ పురాణంలో శిక్షలే కాదు ఇంకా చాలా ఉంటాయి.

|

గరుడ పురాణం గురించి చాలా మంది ఉంటారు. అపరిచితుడు మూవీలో గరుడపురాణం గురించి బాగానే చూపించారు. అయితే దాని గురించి చాలా మందికి తెలియదు. గరుడ పురాణ ప్రకారం మనకు నరకంలో శిక్షలుంటాయనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇంకా తెలియని విషయాలు చాలానే గరుడపురాణంలో ఉన్నాయి.

వేద వ్యాసుడు దీన్ని రాశాడు. మనిషి చనిపోయాయక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, మనిషి చేసిన పాపాలకు ఎలాంటి శిక్షలుంటాయి అని పలు రకాల ప్రశ్నలను విష్ణువును ఆయన వాహనం అయిన గరుత్మంతుడు అడగడంతో విష్ణువు సమాధానాలు చెప్పాడట. గరుత్మంతుడికి చెప్పడం వల్లే దీనికి గరుడపురాణం అని పేరు వచ్చింది.

శిక్షల గురించి మాత్రమే ఉండవు

శిక్షల గురించి మాత్రమే ఉండవు

గరుడ పురాణంలో కేవలం శిక్షల గురించి మాత్రమే ఉండవు. ఇందులో పూర్వ ఖండం, ఉత్తర ఖండం అని రెండు భాగాలుంటాయి. పూర్వ ఖండంలో చాలా విషయాలుంటాయి. అందులో కథలు, చంధస్సు, యుగాలకు సంబంధించిన ధర్మాలు, విష్ణువు కు సంబంధించిన అవతారాలు ఇలా చాలా విషయాలుంటాయి.

ఆత్మ ఎక్కడికి వెళ్తుంది

ఆత్మ ఎక్కడికి వెళ్తుంది

ఉత్తరఖండంలో మొదటి అధ్యాయంలో మాత్రమే మనిషి చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే విషయాలుంటాయి. ఇక ఎవరైనా మరణిస్తే కూడా ఉత్తర ఖండం లోని మొదటి అధ్యాయాన్నే చదువుతారు.

ఇక రెండో అధ్యాయాన్ని ఎప్పుడైనా చదవవచ్చు. గరుడపురాణం ప్రతి మనిషి చదవాల్సిన గ్రంథం.

ఏయే చెడ్డపనులు చేయకూడదో ఉంటుంది

ఏయే చెడ్డపనులు చేయకూడదో ఉంటుంది

అసలు ఏయే చెడ్డపనులు చేయకూడదో గరుడ పురాణంలో ఉంటుంది. ఆ పనులు చేస్తే దారుణమైన శిక్షలుంటాయి. బ్రాహ్మణుడిని హత్య చేయడం, శిశువులను హత్య చేయడం, గోవులను హత్య చేయడం, స్త్రీలను హత్య చేయడం, గర్భంలోని శిశువును చంపడం వంటివి పాపాలు. అలాగే

గురువులు, స్త్రీలు, దేవుళ్ల ధనాన్ని దొంగలించడం పాపాలే. ఎవరికీ తెలియకుండా పాపం చేయడం, అప్పు తీర్చకుండా ఉండడం వంటివి కూడా పాపాలే.

చాలా రకాల శిక్షలు అనుభవిస్తారు

చాలా రకాల శిక్షలు అనుభవిస్తారు

నమ్మించి ద్రోహం చేయడం, హత్యలు చేయడం, తప్పు చేసిన వారిని వెనకేసుకుని వచ్చే వారు కూడా పాపులే. దేవళ్లను, గురువులను తిట్టేవారు కూడా పాపులే. వీరంతా యమలోకంలో చాలా రకాల శిక్షలు అనుభవిస్తారు. వీరు దక్షిణం మార్గానా నడవాల్సి వస్తుంది.

వైతరణిలో నడవాల్సి ఉంటుంది

వైతరణిలో నడవాల్సి ఉంటుంది

పక్కవారు ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేని వారు అనవసరంగా ఇతరుల్ని దూషించేవారు, పనికట్టుకుని ఇతరుల తప్పులు వెతికేవారు, అధర్మానికి బాసటగా నిలిచేవారంతా పాపులే. అలాగే భార్య లేదా భర్తను తిట్టేవారు, కొట్టేవారు, ఏ కారణం లేకుండా విడిచిపెట్టేవారు కూడా పాపులే. వీరంతా కూడా వైతరణిలో నడవాల్సి ఉంటుంది.

నిన్ను మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు

నిన్ను మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు

ఇంకా ఇలాంటి పాపాలా చిట్టా చాలానే ఉంది. వాటికి సంబంధించిన శిక్షలు కూడా చాలానే ఉన్నాయి. గరుడ పురాణాన్ని ఎవరైనా చనిపోయనప్పుడు మాత్రమే చదవాలని కొందరు అనుకుంటు ఉంటారు. అలాంటిదేమీ లేదు ఎప్పుడైనా గరుణ పురణాన్ని చదవవచ్చు. అందులోని విషయాలు అర్థం చేసుకుని పాటిస్తే నిన్ను మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.

English summary

When Should We Read Garuda Purana and What does it deal with

When Should We Read Garuda Purana and What does it deal with
Desktop Bottom Promotion