For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గాదేవి మహిషాసురుని సంహరించడానికి గల కారణాలు మరియు సంహరించిన విధానము

|

దేవి, మహిషాసురుని వికృత చర్యలు, అధర్మాల నుండి ప్రపంచాన్ని రక్షించిన కారణంగా నవరాత్రిని జరుపుకోవడం జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ సంగ్రామంలో దుర్గాదేవి విజయాన్ని పండుగగా జరుపుకుంటూ, ఆవిడ మహాత్మ్యాన్ని స్మరిస్తూ తొమ్మిది రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్షలను పాటించడం ఆనవాయితీగా వస్తుంది. సంహరించిన పదవరోజున విజయదశమిగా చెప్పబడుతుంది.

కింద పడిన రక్తపు చుక్కల నుండి మరొక రూపాన్ని పొందుతూ విజృంభిస్తున్న మహిషుని సంహరించే క్రమంలో భాగంగా 9 వివిధ మాయా రూపాలతో తనను తాను విభజించుకుని పోరాడిన పరాక్రమాన్ని స్మరించుకుంటూ భక్తులు ఈ నవరాత్రులను జరుపుకోవడం జరుగుతుంది. అపురూప సౌందర్యవతి అయిన దుర్గా దేవి, భక్తుల రక్షణార్ధం భీకర రూపాన్ని దాల్చి, మహిషునితో పోరాడిన కథనం, ప్రజలకు స్పూర్తిదాయకంగా ఉండడమే కాకుండా దైవత్వం మీద విశ్వాసం బలపడేలా చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

దుర్గా దేవి మహిషాసురుని ఆద్యంతం సంహరించిన విధానం గురించిన వివరాలను ఇక్కడ పొందుపరచబడింది.

అసలు మహిషాసురుడు ఎవరు ? అతని జననమెట్టిది ?

ఒకానొకప్పుడు రాంభా అనే రాక్షస రాజు ఉండేవాడు. బ్రహ్మ దేవుని ద్వారా దివ్యాశీస్సులు పొందిన వాడై, భాయోత్పాతాలు సృష్టిస్తూ లోక కంఠకునిగా మారాడు. అంతేకాకుండా, రూపాన్ని మార్చగల శక్తి కలిగిన వాడు కూడా. కానీ, ఒక అందమైన అమ్మాయిని చూసి మోహించి ప్రేమలో పడ్డాడు. కానీ శాపవశాత్తూ ఆమె గేదె రూపాన్ని ధరించి, మహిషిగా మారింది. విషయం తెలుసుకున్న రాంభా కూడా, తన తపశ్శక్తితో దున్న పోతుగా రూపాన్ని ధరించాడు. కానీ, ఇతర జంతువుల వలె రోగ నిరోధక శక్తి లేని కారణాన, మరొక దున్న పోతు చేతిలో సంహరించబడుతాడు. మహిషి కూడా, తన భర్త యొక్క అంత్యక్రియలలో చితిపై చేరి, తనకు తాను సతీసహగమనం గావించుకుని ప్రాణ త్యాగానికి సిద్దపడుతుంది.

మహిషి సతీసహగమనం చేసే సమయానికి గర్భవతిగా ఉన్న కారణాన, ఆ చితి మంటల నుండి గేదె తల కలిగి, మనిషి మొండెముతో కూడిన ఒక వికృత రూపం ఉద్భవించింది. అతనే మహిషాసురునిగా రూపాంతరం చెందాడు, క్రమంగా రాంభాకు బదులుగా లోకకంఠకునిగా మారాడు.

అసలు మహిషాసురుడు ఎవరు ? అతని జననమెట్టిది ?

అసలు మహిషాసురుడు ఎవరు ? అతని జననమెట్టిది ?

ఒకానొకప్పుడు రాంభా అనే రాక్షస రాజు ఉండేవాడు. బ్రహ్మ దేవుని ద్వారా దివ్యాశీస్సులు పొందిన వాడై, భాయోత్పాతాలు సృష్టిస్తూ లోక కంఠకునిగా మారాడు. అంతేకాకుండా, రూపాన్ని మార్చగల శక్తి కలిగిన వాడు కూడా. కానీ, ఒక అందమైన అమ్మాయిని చూసి మోహించి ప్రేమలో పడ్డాడు. కానీ శాపవశాత్తూ ఆమె గేదె రూపాన్ని ధరించి, మహిషిగా మారింది. విషయం తెలుసుకున్న రాంభా కూడా, తన తపశ్శక్తితో దున్న పోతుగా రూపాన్ని ధరించాడు. కానీ, ఇతర జంతువుల వలె రోగ నిరోధక శక్తి లేని కారణాన, మరొక దున్న పోతు చేతిలో సంహరించబడుతాడు. మహిషి కూడా, తన భర్త యొక్క అంత్యక్రియలలో చితిపై చేరి, తనకు తాను సతీసహగమనం గావించుకుని ప్రాణ త్యాగానికి సిద్దపడుతుంది.

మహిషి సతీసహగమనం చేసే సమయానికి గర్భవతిగా ఉన్న కారణాన, ఆ చితి మంటల నుండి గేదె తల కలిగి, మనిషి మొండెముతో కూడిన ఒక వికృత రూపం ఉద్భవించింది. అతనే మహిషాసురునిగా రూపాంతరం చెందాడు, క్రమంగా రాంభాకు బదులుగా లోకకంఠకునిగా మారాడు.

మహిషాసురునికి కూడా బ్రహ్మదేవుని దీవెనలు :

మహిషాసురునికి కూడా బ్రహ్మదేవుని దీవెనలు :

తన శక్తులను పెంచుకునే క్రమంలో భాగంగా మహిషాసురుడు, బ్రహ్మదేవుని కోసం వివిధ రకాలుగా తపస్సులు చేయనారంభించాడు. క్రమంగా సంవత్సరాలపాటు అన్నపానీయాలు లేకుండా, ఒంటి కాలు మీద నిలిచి తపస్సు గావించాడు. ఆఖరికి, చీమలు అతని శరీరాన్ని పూర్తిగా కప్పివేసేలా పుట్టలు ఏర్పాటు చేయడం కూడా ప్రారంభించాయి. అతని తపస్సు క్రమంగా భీకరరూపం దాల్చడంతో, ముల్లోకాలు గజగజా వణికాయి. కాలక్రమేణా, బ్రహ్మదేవుడు మహిషాసురుని తపస్సుకు సంతసించి, ప్రత్యక్షమయ్యాడు. మరణం లేకుండా కలకాలం జీవించి ఉండేలా స్వార్ధబుద్దిని కలిగి ఉన్న మహిషుడు, బ్రహ్మ దేవుని నుండి, వరంగా అమరత్వాన్ని కోరుకున్నాడు. ఏదేమైనా, బ్రహ్మ దేవుడు అమరత్వాన్ని ఇచ్చేందుకు అంగీకరించలేదు. రాక్షస జాతికి అమరత్వం అనేది సాధ్యపడదు కనుక. మహిషాసురుని అనేక అభ్యర్థనల తరువాత, బ్రహ్మ దేవుడు, పురుష దేవతలు లేదా, ఏ ఇతర పురుష శక్తులు మహిషాసురుని ఓడించలేని విధంగా వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. స్త్రీ తనను ఏమీ చేయలేదన్న అహంకారంతో, ఆ వరం పొందిన ఆనందంలో మహిషుడు తన తండ్రి విధానాన్నే అవలంభిస్తూ, లోక వినాశనాన్ని సృష్టిస్తూ ముల్లోకాలకు నిద్రలే కుండా చేశాడు. కాలక్రమేణా, అతని అధిక గర్వమే అతని నాశనానికి కారణమైంది. ఏది ఏమయినప్పటికీ, అహంకార పూరిత స్వభావం నాశన కారకమవుతుందని మహిషుడు గ్రహించలేదు.

Most Read: మొటిమలను తగ్గించడంలో వెల్లుల్లి వినియోగం

దుర్గా దేవి యొక్క జననం :

దుర్గా దేవి యొక్క జననం :

తీవ్ర భయోత్పాలను సృష్టిస్తూ లోకాలను అల్లకల్లోలం గావిస్తున్న మహిషాసురుడు, విశ్వాన్నే జయించాలని ఆకాంక్షించాడు. ఆ క్రమంలో భాగంగా శివుని వద్దకు చేరుకున్నాడు. విష్ణువు, మరియు బ్రహ్మతో ఉన్న శివుడు, బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరం కారణంగా మహిషాసురుని గెలవడం అసాధ్యమని గ్రహించారు. క్రమంగా త్రిమూర్తులు మహిషాసురుని సంహరించడానికి, ఒక శక్తి దేవతను సృష్టించాలని నిర్ణయించుకున్నారు. శివుడు, విష్ణువు మరియు బ్రహ్మ దేవుడు ముగ్గురూ కలిసి, వారి శక్తులను ఉపయోగించి, శక్తి దేవతను సృష్టించారు. ఆమే దుర్గా దేవి. 'శక్తి' అనేది ఒక సంస్కృత పదం, దీని అర్థం బలం. అందరి దేవతల శక్తిని కూడగట్టుకుని ఉన్న దేవతగా ఉన్న కారణాన, శక్తిగా నామకరణం చేయబడింది.

దుర్గా దేవి మరియు మహిషాసురుని మధ్య యుద్ధం :

దుర్గా దేవి మరియు మహిషాసురుని మధ్య యుద్ధం :

దుర్గా దేవి ప్రతిపాదన కారణంగా, దుర్గా దేవి మరియు మహిషాసురుని మధ్య యుద్ధం ప్రారంభమైంది. దేవత రాక్షసుడిపై దాడి చేసిన ప్రతి సారీ, అతని రక్తపు చుక్కల నుండి సరికొత్త రూపం ఆవిర్భవించడం ప్రారంభించిది. క్రమంగా, దుర్గా దేవి మహా కాళి రూపాన్ని ధరించింది. మహా కాళి రూపంలో, మహిషాసురుని రక్తం నేల చిందకుండా, రక్తమును తాగుతూ, మరొక రూపం ఏర్పడకుండా జాగ్రత్తలను తీసుకుంది. తొమ్మిది రోజుల పాటు ఈ పోరాటంలో, మహిషాసురుని సేవకులతో సహా, అతని శరీరం నుండి ఉద్భవించిన రాక్షసులందరినీ మట్టుబెట్టింది దుర్గా దేవి. చివరగా పదవ రోజున మహిషాసురుని సంహరించి లోక కల్యాణం గావించింది. ఆది పరాశక్తే, బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల భార్యలుగా ఉన్న సరస్వతి, లక్ష్మి మరియు పార్వతీలుగా అవతారాలు ధరించిందని, క్రమంగా సృష్టికారకంగా కూడా ఆది పరాశక్తి కీలకపాత్ర పోషించిందని శివపురాణం మరియు విష్ణుపురాణాలలో చెప్పబడింది.

Most Read: దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు ...

నవరాత్రి ప్రారంభం :

నవరాత్రి ప్రారంభం :

యుద్ధం జరిగిన తొమ్మిది రోజులను నవరాత్రులుగా, మహిషాసురుని సంహరించిన పదవ రోజును విజయ దశమిగా పిలువబడ్డాయి. క్రమంగా దేవతలు ప్రశంసల జల్లులను కురిపిస్తూ మహిషాసురమర్ధినిగా (మహిషాసురుని సంహరించిన అని అర్ధం వచ్చేలా) కీర్తించారు. ప్రతి సంవత్సరం, భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షను పాటించి, దుర్గా దేవి నామస్మరణతో దుర్గా దేవి మహాత్మ్యాన్ని స్తోత్రాలుగా చదవడం ఆనవాయితీగా వస్తున్నది. అయినప్పటికీ, అలా చేయడం సాధ్యం కాని పక్షంలో, పాటించవలసిన అధ్యాయాలు కింది క్రమంలో సూచించబడతాయి.

నవరాత్రి ప్రారంభం :

నవరాత్రి ప్రారంభం :

1 వ రోజు - మధుకైతవ సంహరణము(ఒకటవ అధ్యాయం)

2 వ రోజు - మహిషాసుర సంహరణము (2, 3, 4 అధ్యాయాలు)

3 వ రోజు - ధూమ్రాలోచన వధః (5 మరియు 6 అధ్యాయాలు)

4 వ రోజు - చండా ముండుల వధ (7 వ అధ్యాయం)

5 వ రోజు - రక్తసబీజ సంహరణము (8 వ అధ్యాయం)

6 వ రోజు - శంభ నిషుoభ వధ (9 మరియు 10 అధ్యాయాలు)

7 వ రోజు - నారాయణి మహిమ (దేవీ స్తోత్రం - 11 వ అధ్యాయం)

8 వ రోజు - ఫల స్తుతి (12 వ అధ్యాయం)

9 వ రోజు - సూరత మరియు వ్యాపారి కథ (13 వ అధ్యాయం)

10 వ రోజు - క్షమా ప్రార్థన (14 వ అధ్యాయం)

Most Read:మొబైల్ రాకముందు ప్రపంచమే వేరు, సెల్ వచ్చాక సెక్స్ కూడా చేయడం లేదు, మరి ఇంత దారుణమా?

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Why Did Goddess Durga Kill Mahishasura?

Goddess Durga protects her devotees from all forms of negative energies. Here are the details on how and why did Goddess Durga kill Mahishasura and how she killed him. Take a look.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more