For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగు యుగాలుగా మనం దీపావళిని చేసుకుంటున్నాం, ఈ రోజు అక్కడ సీసా పెడితే చాలా ప్రయోజనం

లక్ష్మీ దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దివాళి రోజున ఉప్పుతో నింపిన ఒక సీసాను ఇంటిలో ఏదైనా ఒక మూలలో, లేదంటే బాత్రూమ్ లో పెడితే ఇంట్లోని దుష్టశక్తులు మొత్తం పోతాయట. నరకాసురుడు కోరిక మేరకు మనం ఈ పండుగను చ

By Arjun Reddy
|

వెలుగులు తెచ్చే పండుగ దివాళి.. దీపావళి. సాధారణంగా అందరూ అమావాస్య రోజునే దీపావళి నిర్వహించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం దీపావలిని ముందుగానే చేసుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అమవాస్య రోజే దీపావలి జరుపుకోవడం ఆనవాయితీ.

కుబేర వ్రతాన్ని ఆచరిస్తే

కుబేర వ్రతాన్ని ఆచరిస్తే

దీపావళి రోజు లక్ష్మీ దేవి కుబేర వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. దీంతో స్త్రీలు సుమంగళిగా ఉంటారు. అలాగే వెండి దివ్వెలలో ఆవునెయ్యి వేసి వెలిగిస్తే సంపద కలుగుతుంది. దీపావళిని ఇప్పుడే కాదు గతంలో నాలుగు యుగాల్లోను నిర్వహించుకునేవారు.

బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి

బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి

విష్ణుమూర్తి కృత యుగంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి వేయడం వల్ల అప్పుడు దివాళి చేసుకున్నారు. ఇక త్రేతా యుగంలో రాముడు రావణుడిని చంపి అయోధ్యలో అడుగుపెట్టిన రోజును దీపావళిగా చేసుకున్నారు.

ద్వాపర యుగం లో నరకాసురుడిని చంపిన రోజును దీపావళిగా చేసుకున్నారు.

అలా నాలుగు యుగాలుగా

అలా నాలుగు యుగాలుగా

కలియుగంలో విక్రమార్కుడు పట్టాభిషేకం నిర్వహించుకున్న రోజును దీపావళిగా చేసుకున్నారు. అలా నాలుగు యుగాలుగా దీపావళిని చేసుకుంటూనే ఉన్నారు. నరకాసురుడిని సత్యభామ వధించింనందుకు సూచికగా.. చెడుపై మంచి సాధించినవిజయానికి గుర్తుగా అమవాస్య రోజు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి చేసుకుంటాం.

Most Read :జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాం, ఆ కారణంతో ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాను #mystory298Most Read :జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాం, ఆ కారణంతో ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాను #mystory298

ఉప్పుతో నింపిన ఒక సీసాను

ఉప్పుతో నింపిన ఒక సీసాను

లక్ష్మీ దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దివాళి రోజున ఉప్పుతో నింపిన ఒక సీసాను ఇంటిలో ఏదైనా ఒక మూలలో, లేదంటే బాత్రూమ్ లో పెడితే ఇంట్లోని దుష్టశక్తులు మొత్తం పోతాయట. నరకాసురుడు కోరిక మేరకు మనం ఈ పండుగను చేసుకుంటున్నాం.

వేలాది దీపాలు వెలిగిస్తాం

వేలాది దీపాలు వెలిగిస్తాం

నరకాసురుడు చనిపోయే ముందు తాను మరణించిన రోజును ప్రజలంతా ఎంతో సంతోషంగా పండుగ చేసుకోవాలని క్రిష్ణుడిని కోరడం వల్లే మనం దీపావళిని చేసుకుంటున్నాం. చీకటిని పారద్రోలి వెలుగును ఆహ్వానించినందుకు ప్రతీకగానే మనం ఈ రోజు వేలాది దీపాలు వెలిగిస్తాం. టపాసులు కాలుస్తాం. దీపావళి సంబరాలు నార్త్ ఇండియాలో ఎక్కువగా జరుగుతాయి.

English summary

why is diwali known as the festival of lights

why is diwali known as the festival of lights
Story first published:Wednesday, November 7, 2018, 14:55 [IST]
Desktop Bottom Promotion