మాంసాహారం తిని దేవాలయాలకు వెళ్ళకూడదు.. ఎందుకంటే?

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లేముందు మాంసాహారం ముట్టుకోకూడదని పెద్దలు అంటూ ఉంటారు. మాంసాహారం ముట్టని రోజు ఆలయాలను దర్శించాలని చెప్తుంటారు. మాంసాహారం తీసుకుని ఆలయానికి వెళ్తే వికార కోరికలు పుడతాయట.

మాంసాహారం కామ, వికార కోరికలను ఉత్పన్నం చేస్తాయట. మాంసాహారాన్ని స్వీకరిస్తే.. రజో గుణం(కోపం, కామం) ఆవహిస్తుందని, ఈ గుణాలు ఉండటం వల్ల సత్వ గుణం తగ్గిపోతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

సాత్విక గుణాలతో ఆలయాలను దర్శించుకోవడం, దైవారాధన చేయడం ఉత్తమం.

సాత్విక గుణాలతో ఆలయాలను దర్శించుకోవడం, దైవారాధన చేయడం ఉత్తమం.

సాత్విక గుణాలతో ఆలయాలను దర్శించుకోవడం, దైవారాధన చేయడం ఉత్తమం. మాంసాహారం తీసుకుంటే ఏర్పడే రజోగుణ, తమోగుణాల ప్రభావం వల్ల మనో నిగ్రహం కోల్పోయే అవకాశం ఉందని, తద్వారా దైవారాధన సఫలం కాదని పెద్దలంటారు.

ఇండియన్ బిలీనియర్స్ కంటే ఎక్కువ ధనం ఉన్న ఆలయాలు

గుడ్డు మరియు మాంసాహారాల్లోనే కాకుండా, ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు కూడా తీసుకోకూడదు

గుడ్డు మరియు మాంసాహారాల్లోనే కాకుండా, ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు కూడా తీసుకోకూడదు

అందుకే మాంసాహారం కంటే.. సాత్విక ఆహారం పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ఉత్తమం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే గుడ్డు మరియు మాంసాహారాల్లోనే కాకుండా, ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులతో కూడా తమో, రజో గుణాలు ఉంటాయి. అందువల్ల గుడికి వెళ్లే సమయంలోనూ మరియు దైవకార్యాలు చేసే సమయంలోనూ రజో గుణాలు ఉన్న ఆహారాలను తీసుకోకూడదు.

అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు

అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు

కొన్ని ఆలయాల్లో మాత్రం మాంసాహారం తీసుకుని వెళ్ళొచ్చు. కొన్ని అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు మాంసాహారం ఓకే.

అలాగే పూరీ జగన్నాథ ఆలయంలోనే

అలాగే పూరీ జగన్నాథ ఆలయంలోనే

అలాగే పూరీ జగన్నాథ ఆలయంలోనే మాంసాహారం కూడా ప్రసాదంగా పెడతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే జగన్నాథుడి భార్య విమలాదేవికి ప్రతిరోజూ దుర్గాపూజలు చేసి.. అమ్మవారికి బలి ఇచ్చిన మేక మాంసాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు.

చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా

చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా

అలాగే గుడి కొలనులోని చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీ.

దేవుడికి నైవేద్యం నివేధించే విషయంలో ఖచ్చితంగా చేయకూడని పొరపాట్లు ..!!

అయితే ఆంజనేయుడు, విష్ణుమూర్తి, శివాలయాల్లో

అయితే ఆంజనేయుడు, విష్ణుమూర్తి, శివాలయాల్లో

అయితే ఆంజనేయుడు, విష్ణుమూర్తి, శివాలయాల్లో మాంసాహారం నిషిద్ధం.

English summary

Why is eating non-vegetarian food before visting a temple prohibited?

Its not prohibited , Its our belief and conscience which prohibits us doing this, Eating non vegetarian is considered to be like doing something against your spiritual progress and somewhat profane in certain community.
Subscribe Newsletter