For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లంఖిణి కొడితే ఆంజనేయుడే అల్లాడిపోయాడు, రాజ్యానికి స్త్రీ కాపలా ఉండడం చాలా అరుదు

ఒక రోజు లంకకు కాపలాగా లంఖిణి ఉన్నప్పుడు ఆంజనేయుడు సీతమ్మ జాడ కోసమని వానరరూపంలో లంకలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. వెంటనే లంఖిణీ అడ్డుకుని మొత్తం వివరాలు అడుగుతుంది. లంఖిణి కొడితే ఆంజనేయుడే అల్లాడాడు.

|

లంఖిణి అనే మాట మనలో చాలా మంది విని ఉంటారు. లంక ఒక ద్వీపం. దానికి కాపలాగే ఉన్న ఆమెనే లంఖిణి. లంఖిణిని చూస్తే ఎవరైనా జడుకుసుకుంటారు. అందుకే ఆమెను లంకకు కాపలాగా పెట్టారు. లంఖిణిని మోసం చేసి ఎవరూ కూడా లంకలోకి వెళ్లలేకపోయేవారు. కొత్తవారిని కనీసం చిన్న చీమను కూడా లంకలోకి వెళ్లనిచ్చేది కాదు లంఖిణి.

ఏ రాజ్యానికైనా పెద్ద పెద్ద కండలు తిరిగిన వస్తాదులు కాపలాగా ఉంటారు. కానీ లంకకు మాత్రం లంఖిణీనే కాపలాగా పెట్టడానికి ఒక కారణం ఉంది. లంఖిణీ కండలు తిరిగిన మోనగాళ్లకు సమానంగా బలం కలిగి ఉండేది. లంఖిణీకి బ్రహ్మదేవుడి వరం కూడా ఉంది. ఆమె కన్నుగప్పి రావణుడి రాజ్యంలోకి ప్రవేశించేంత ధైర్యం ఎవరూ చేయలేకపోయేవారు.

లంక ఏర్పడడానికి కారణం

లంక ఏర్పడడానికి కారణం

ఇక లంక ఏర్పడడానికి కూడా ఒక కారణం ఉంది. చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో భూభాగం ఉండే ఈ ప్రాంతం కాస్త ప్రత్యేకమే. అసలు సముద్ర మధ్యలో ఈ ప్రాంతం ఉండడానికి ఒక కారణం ఉంది. ఆది శేషువు, వాయు దేవుడుల మధ్య ఒక గొడవ వస్తుంది. ఇద్దరూ తాను గొప్పంటే తాను గొప్పని చెప్పుకుంటారు. సరే ఎవరి బలం ఎక్కువుందో పరీక్షించుకుందామా అంటాడు.

పర్వతం విరిగి సముద్రంలోపడుతుంది

పర్వతం విరిగి సముద్రంలోపడుతుంది

దీంతో ఆది శేషువుడు సముద్రం పక్కనున్న ఒక పర్వతాన్ని గట్టిగా చుట్టుకుంటాడు. నీకు దమ్ముంటే నన్ను కొంచెమైనా కదిలించు అంటాడు. వాయుదేవుడికి కోపం వచ్చి తన ప్రతాపం చూపుతాడు. కానీ ఆది శేషువుడు అస్సలు కదలడు. చివరకు ఆ పర్వతం విరిగి సముద్రంలోపడుతుంది. అదే ఒక ద్వీపంగా మారుతుంది.

 లంక అంటున్నాం

లంక అంటున్నాం

కాలక్రమేణ దాన్నే మనం లంక అంటున్నాం. లంకలో అంతకముందు చాలా మందే నివాసం ఉన్నారు. చాలా రాజ్యాలు అక్కడ వెలిశాయి. అయితే కుబేరుడు లంకను వదిలి పారిపోయాక దాన్ని రావణుడు తన రాజ్యంగా మార్చుకున్నాడు.

లంకలోకి వెళ్లడానికి వీల్లేదు

లంకలోకి వెళ్లడానికి వీల్లేదు

ఒక రోజు లంకకు కాపలాగా లంఖిణి ఉన్నప్పుడు ఆంజనేయుడు సీతమ్మ జాడ కోసమని వానరరూపంలో లంకలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. వెంటనే లంఖిణీ అడ్డుకుని మొత్తం వివరాలు అడుగుతుంది. కొత్తవారు ఎవరైనా సరే లంకలోకి వెళ్లడానికి వీల్లేదు అంటుంది.

లంక అందాలను చూసి వస్తానంటాడు

లంక అందాలను చూసి వస్తానంటాడు

నేను వానరాన్నే కదా కేవలం లంక అందాలను చూసి వస్తానంటాడు ఆంజనేయడు. లంఖిణీ మాట ఆంజనేయుడు వినకపోవడంతో హనుమంతున్ని కొడుతుంది లంఖిణీ. ఆ దెబ్బకు ఆంజనేయుడు కూడా అల్లాడిపోతాడు. అంతటి బలవంతురాలు లంఖిణీ.

లంక నాశనం అయ్యే రోజులు

లంక నాశనం అయ్యే రోజులు

తర్వాత ఆంజనేయడు ఒక్క దెబ్బ కొట్టేసరికి లంఖిణీ కిందపడిపోతుంది. లేవలేకపోతుంది. ఆంజనేయుడి నిజ స్వరూపాన్ని చూసి శరణు కోరుతుంది లంఖిణి. అయితే ఎప్పుడైతే లంఖిణీ వానరం చేతిలో ఓడిపోతుందో అప్పుడే లంక నాశనం అయ్యే రోజులు దగ్గరపడతాయని బ్రహ్మ దేవుడు లంఖిణీకి చెప్పి ఉంటాడు.

ఆంజనేయుడికి భయపడి

ఆంజనేయుడికి భయపడి

ఆ మాటలు లంఖిణీకి గుర్తొచ్చి ఇక లంక నాశనం తప్పదనుకుంటుంది. అంతవరకు కంటికి రెప్పలా లంకను చూసుకున్న లంఖిణీ ఆంజనేయుడికి భయపడి రాజ్యంలోకి ఇతరులకు ప్రవేశం కల్పించింది.

English summary

Why lankini gave permission to hanuma enter in Lanka

Why lankini gave permission to hanuma enter in Lanka
Story first published:Monday, August 20, 2018, 18:02 [IST]
Desktop Bottom Promotion