For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శకుని నరనరాల్లో పగ ప్రతీకారంతో బతికాడు, కౌరవులను నమ్మించి కురు వంశాన్ని నాశనం చేశాడు, కుట్రల్లోఫస్ట్

ఇక శకుని కురుక్షేత్రంలో కురు వంశం అంతా నాశనం కావాలని కోరుకున్నాడు. అయితే అదే యుద్ధంలో సహదేవుడి చేతితో శకుని మరణించాడు. అయితే శకుని లాంటి మనుషులు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నారు. పగప్రతీకారంతో ఎత్తులు.

|

శకుని.. మహాభారతంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. భారతంలో ప్రతి విషయంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా శకుని పాత్ర ఉండే ఉంటుంది. శకునికి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధం ఉంది. తన పాచికలతో ఎత్తులకు పై ఎత్తులు వేసి భారతంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు శకుని. కుట్రలు పన్నే వారిని శకునితో పోల్చుతూ ఉంటారు. పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం వచ్చేలా వారు తన్నుకు చస్తుంటే చూసి ఆనందించాడు శకుని.

రకరకాల కథలున్నాయి

రకరకాల కథలున్నాయి

శకుని ఇలా చెయ్యడానికి రకరకాల కథలున్నాయి. దుర్యోధనునికి శకుని మేనమామ. కౌరవులందరికీ శకుని అంటే ఎంతో గౌరవం. కౌరవులకు దురాలోచనలు పెరిగేలా చేసింది శకుని. ధర్మరాజు జూదం ఆడేలా చేశాడు. శకుని పాచికలు గురించి తెలియని ధర్మరాజు కౌరవులతో జూదం ఆడుతాడు. ఓడుతాడు. పాండువులు అరణ్యవాసం వెళ్తారు. ద్రౌపది నిండు సభలో అవమానానికి గురవుతుంది. దీనికంతటికి కారణం శకుని.

చిచ్చు పెట్టడానికి బలమైన కారణం

చిచ్చు పెట్టడానికి బలమైన కారణం

శకుని కౌరవులకు పాండవులకు మధ్య చిచ్చు పెట్టడానికి బలమైన కారణం ఉంది. వాళ్ల వంశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా జీవితాంతం శకుని ప్రయత్నాలు చేశాడు. కురు వంశ నాశనమే శ్వాసగా జీవించాడు. శకుని సౌబలుడి వందమంది కుమారుల్లో చివరి వాడు. సౌబలుడు గాంధార రాజ్యంలోని సుభల దేశానికి అధిపతి. సౌబలుడికి ఒకే ఒక్క కూతురు. ఆమెనే గాంధారి.

కారాగారంలో వేస్తాడు

కారాగారంలో వేస్తాడు

గాంధారిని ధృతరాష్ట్రుడికి చేసుకోవాలనుకుంటుంది ధృతరాష్ట్రుడి తల్లి. కానీ గుడ్డి వాడైనా అతనికి మా కూతురుని ఎలా ఇస్తామంటారు. దీంతో ధ్రుతరాష్ట్రుని తల్లి గాంధారపై దండెత్తి ఆ కుటుంబాన్ని తన కాళ్ల దగ్గర పడేయాలని భీష్మున్ని కోరుతుంది. భీష్ముడు తప్పని పరిస్థితుల్లో వారందరినీ తీసుకొచ్చి కారాగారంలో వేస్తాడు. శకుని అందరికన్నా చిన్నగా ఉంటాడు.

ఒక్కొక్కరికీ ఒక్కో అన్నం మెతుకు ఇచ్చి

ఒక్కొక్కరికీ ఒక్కో అన్నం మెతుకు ఇచ్చి

శకుని పాటు అతని వంద మంది అన్నదమ్ములు, అతని తండ్రిని భీష్ముడు చెరసాలలో బంధించి చిత్రహింసలు పెడతారు. వారందరినీ ఒక కారాగారంలో ఉంచి ఒక్కొక్కరికీ ఒక్కో అన్నం మెతుకు ఇచ్చి నరకం చూపిస్తారు. అప్పుడు శకుని తండ్రి భీష్ముడుని ఒక కోరిక కోరుతాడు. మేమందరం చనిపోయినా కూడా మాలో ఒక్కడిని మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టు అంటాడు. అందుకు భీష్ముడు ఒప్పుకుంటాడు.

వాణ్ని బతకనిద్దాం మన పగను తీర్చుకుందాం

వాణ్ని బతకనిద్దాం మన పగను తీర్చుకుందాం

శకుని తండ్రి తన కొడుకుల్లో ఎవరు అత్యంత ఆలోచనపరన ఉన్నవాడు అని గమనిస్తాడు. అయితే శకుని తనకిచ్చిన ఒక్క మెతుకుని కూడా ఎంతో భద్రంగా ఉంచుకుని దాన్ని తినే పద్ధతిని మిగతావారంతా చూస్తారు. మన అందరిలో శకుని అత్యంత తెలివైన వాడు... వాణ్ని బతకనిద్దాం మన పగను తీర్చుకుందామని వారు డిసైడ్ అవుతారు. తమ దగ్గరున్న అన్ని మెతుకులను కలిపి ఒక ముద్దగా చేసి శకునికి తినిపిస్తారు.

పగను మరిచిపోతే మా ప్రాణ త్యాగాలకు విలువ లేదు

పగను మరిచిపోతే మా ప్రాణ త్యాగాలకు విలువ లేదు

తర్వాత వారంతా ఒక్కొక్కరుగా చనిపోతారు. అయితే చివరగా శకుని తండ్రి ఒక మాట చెబుతాడు. మేము ఎన్ని నరకయాతనలు అనుభవించి ఇక్కడ చనిపోతున్నామో నువ్వు కళ్లారా చూశావు... మేమందరం నిన్ను బతికించేది మన పగ తీర్చుతావని. నీకు భవిష్యత్తులో రాజభోగాలు కలిగి మన పగను మరిచిపోతే మా ప్రాణ త్యాగాలకు విలువ ఉండదు అని చెబుతాడు. తర్వాత శకుని కాలిని విరిచేస్తాడు. నువ్వు కుంటుతూ నడుస్తున్నప్పుడల్లా నీకు మన పగ గుర్తు రావాలనే ఇలా చేశానని శకుని తండ్రి చెబుతాడు.

వెన్నుముక ఎముకలతో పాచికలు తయారు చేసుకో

వెన్నుముక ఎముకలతో పాచికలు తయారు చేసుకో

నేను చనిపోయాక నా వెన్నుముక ఎముకలతో పాచికలు తయారు చేసుకో. అవి మాయ పాచికలు.. వాటితో నువ్వు ఏది అనుకుంటే అది సాధించవచ్చని చెప్పి చనిపోతాడు శకుని తండ్రి. ఆ క్షణం నుంచి శకుని తన ఒళ్లంతా పగ, ప్రతీకారాలను ఎక్కించుకుంటాడు. శకుని ప్రతి నరం కూడా పగతో రగిలిపోతుంటుంది. అయితే భీష్ముడు శకుని కుటుంబం పాపం తమకు తగలకూడదని గాంధారి రాజ కుమార్తె అయిన గాంధారిని ధ్రుతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు.

ధ్రుతరాష్ట్రుడి బామ్మర్దిగా

ధ్రుతరాష్ట్రుడి బామ్మర్దిగా

దాంతో ధ్రుతరాష్ట్రుడి బామ్మర్దిగా వాళ్ల రాజ్యంలోకి ప్రవేశిస్తాడు శకుని. ధుర్యోధనుడు పుట్టినప్పటి నుంచి మేనల్లుడిపై అమితమైన ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు. కానీ మనస్సులో కౌరవ వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలని రగిలపోతూ కౌరవులను పాండువుల పైకి ఉసి గొల్పుతాడు.

శకున్ని గాంధారా రాజ్యానికి రాజును చేసిన కూడా అతను అక్కడికి వెళ్లనంటాడు. నేను ప్రాణం ఉన్నంత వరకు దుర్యోధనుడి పక్కనే ఉంటానంటాడు.

ప్లాన్స్ మొత్తం శకునివే

ప్లాన్స్ మొత్తం శకునివే

పాండవులతో పలు రకాలుగా వైరాన్ని నెలకొప్పింది శకునే. పాండవులను చంపేందుకు లక్క ఇంటిని కాల్చేసేలా ప్లాన్ వేసింది శకునే. అన్నంలో విషం కలిపి భీమున్ని చంపాలని ప్లాన్ ఇచ్చింది కూడా శకునే. ఇలా రకరకాలుగా పాండువులతో కౌరవులు వైరం ఏర్పడిలా చేసింది శకుని మాత్రమే. కానీ కౌరవులకు శకునికి తమపై ఉన్న పగ తెలియక శకున్నే నమ్ముతారు.

కురు వంశం అంతా నాశనం కావాలని

కురు వంశం అంతా నాశనం కావాలని

ఇక శకుని కురుక్షేత్రంలో కురు వంశం అంతా నాశనం కావాలని కోరుకున్నాడు. అయితే అదే యుద్ధంలో సహదేవుడి చేతితో శకుని మరణించాడు. అయితే శకుని లాంటి మనుషులు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నారు. పగప్రతీకారంతో ఎత్తులు వేసి అవతలి వారిని నమ్మించి గొంతు కోసే వాళ్లను శకునితో పోల్చుతుంటారు.

కేరళలో శకుని ఆలయం

కేరళలో శకుని ఆలయం

అయితే శకుని శివుడికి పెద్ద భక్తుడు. కురక్షేత్రం ముగిశాక ముక్కంటిని మొక్కుకుని మోక్షం పొందాడట. కోలన్ అనే తెగకు చెందిన వారు శకుని దేవుడిలా పూజిస్తారు. కేరళలో శకుని ఆలయం ఉంది. కొల్లాం జిల్లాలో పవిత్రేశ్వరంలో ఈ ఆలయం ఉంది.

English summary

why shakuni wanted to destroy kauravas

Here why did Shakuni poison the kauravas’ brain and made them enemies to the pandavas. Readmore.
Desktop Bottom Promotion