For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కౌరవుల్లోనూ మంచివాడున్నాడు, ధృతరాష్టుడు చెలికత్తెతో కన్న కొడుకే అతను, దుర్యోధనుడికి దీటైనా వాడు

గాంధారికి మొదట పిల్లలు పుట్టరు. కానీ ఆమెకు వందమంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని ధృతరాష్టుడు తెలుస్తుంది. కానీ వాళ్లు పుడతారో లేదో అని ధృతరాష్టుడికి అనుమానం కలుగుతుంది.ధృతరాష్టుడు చెలికత్తె.

|

మహా భారతంలో కౌరవులంతా కూడా చండశాసనులు అని అనుకుంటాం. కానీ కౌరవుల్లో కొందరు మంచి వారు కూడా ఉన్నారు. కౌరవుల వంశానికి చెందిన యుయుత్సుడు పాండవుల పక్షాన నిలబడి అధర్మానికి వ్యతిరేకంగా పోరాడాడు.

గాంధారికి మొదట పిల్లలు పుట్టరు. కానీ ఆమెకు వందమంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని ధృతరాష్టుడు తెలుస్తుంది. కానీ వాళ్లు పుడతారో లేదో అని ధృతరాష్టుడికి అనుమానం కలుగుతుంది. దీంతో ధృతరాష్టుడు చెలికత్తె ద్వారా సంతానం పొందాలనుకుంటాడు.

చెల్లికత్తె వల్ల పుట్టాడు

చెల్లికత్తె వల్ల పుట్టాడు

ఆ చెల్లికత్తె పేరు సుఖద. ధృతరాష్టుడు ఆమెకు విషయం చెప్పగానే ఆమె ఒప్పుకుంటుంది. దీంతో వారిద్దరూ కలిసి యుయుత్సుడు అనే బిడ్డకు జన్మినిస్తారు. అయితే గాంధారికి కరెక్ట్ గా దుర్యోధనుడు జన్మించినప్పుడు ధృతరాష్టుడికి సుఖద వల్ల యుయుత్సుడు కూడా పుడతాడు.

దుర్యోధనుడు సోదరుడిగా భావించలేదు

దుర్యోధనుడు సోదరుడిగా భావించలేదు

ధృతరాష్టుడు దుర్యోధనుడిని ఒక్కటే కోరుతాడు. రాజ్యంపై నీతో పాటు యుయుత్సుడునికి కూడా సమాన అధికారం ఉంటుందని చెబుతాడు. అయితే దుర్యోధనుడు ఎప్పుడు కూడా యుయుత్సుడున్ని తన సోదరుడిగా భావించలేదు. అంతేకాదు తన సోదరులందరికీ కూడా యుయుత్సుడునికి దూరంగానే ఉండమని చెబుతాడు. దీంతో అందరూ అతన్ని ఒక దాసికి పుట్టిన వాడిగానే చూస్తారు.

దుర్యోధనుడికి దీటుగా రాటుదేలుతాడు

దుర్యోధనుడికి దీటుగా రాటుదేలుతాడు

కానీ యుయుత్సుడు మాత్రం యుద్ధ విద్యల్లో దుర్యోధనుడికి దీటుగా రాటుదేలుతాడు. కౌరవులకు సంబంధించిన ప్రతి విషయం యుయుత్సుడునికి తెలుసు. కానీ వారివైపు ఏనాడు నిలబడలేదు. ధర్మాన్నే నమ్మాడు.

పాండవుల పక్షానే యుద్ధం చేస్తాడు

పాండవుల పక్షానే యుద్ధం చేస్తాడు

ఇక కురుక్షేత్రంలో కౌరవులు పాండువులపై పన్నిన కుట్రలు మొత్తం పాండవులకు చెబుతాడు యుయుత్సుడు. తర్వాత పాండవుల పక్షానే యుద్ధం చేస్తాడు. పాండవులకు తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడుతాడు.

యుయుత్సుడు మాత్రం బతుకుతాడు

యుయుత్సుడు మాత్రం బతుకుతాడు

అయితే ధర్మం పక్కనే నిలబడడంతో కురుక్షేత్రంలో కౌరవులంతా మరణించినా యుయుత్సుడు మాత్రం బతుకుతాడు. కురక్షేత్రం మొత్తం పూర్తయ్యాక ప్రాణాలతో బయటపడ్డ పన్నెండు మందిలో యుయుత్సుడు కూడా ఉన్నాడు.

చాలా తక్కువ మందికి తెలుసు.

చాలా తక్కువ మందికి తెలుసు.

యుద్ధం పూర్తయ్యాక పాండువులు స్వర్గానికి వెళ్తారు. అయితే ఇక్కడ పాలించే బాధ్యతలను పరీక్షితుడికి అప్పగిస్తారు. అతనికి తోడుగా యుయుత్సుడు కూడా ఉంటాడు. అలా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యుయుత్సుడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

Imagecredit

English summary

Why the only Kaurava son Yuyutsu to survive the Kurukshetra War

Why the only Kaurava son Yuyutsu to survive the Kurukshetra War
Desktop Bottom Promotion