For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కసారి ఆ ఆలయంలో నిద్రిస్తే మీకు కచ్చితంగా పిల్లలు పుడతారు, వందేళ్లుగా ఆచారం, లక్షల మందికి పిల్లలు

గుడిలో నిద్ర చేస్తున్న సమయంలో దేవత స్త్రీలను మనిషి రూపంలో కనిపించి పిల్లలు కలగాలంటూ ఆశీర్వదిస్తుంది. ఒక్కసారి ఆ ఆలయంలో నిద్రిస్తే మీకు కచ్చితంగా పిల్లలు పుడతారు, వందేళ్లుగా ఆచారం, లక్షల మందికి పిల్లలు

|

పెళ్లి అయిన భార్యాభర్తలంతా పిల్లలు కావాలని కోరుకుంటారు. వివాహం అయిన కొన్ని రోజులకే బంధువులు, తెలిసినవారంతా శుభవార్త ఎప్పుడు చెబుతావంటూ అడుగుతూ ఉంటారు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ వారికోసమైనా వెంటనే పిల్లల్ని కనాలని చాలా తాపత్రయపడతారు. ఇక మరికొందరు దంపతులకు పెళ్లయి చాలా ఏళ్లు అయినా కూడా పిల్లలు కలగరు. దీంతో వారు పిల్లలు కలగాలని రకరకాలుగా ప్రయత్నిస్తారు. పూజలు చేస్తుంటారు.

కొందరు మహిళలు పిల్లలు పుట్టాలని చాలా మూఢనమ్మకాలను నమ్ముతారు. అయితే అవన్నీ మూఢనమ్మకాలు అని తీసిపారేయలేము. అందులో కొన్ని జరగొచ్చు కూడా. ఒక ఆలయంలో పెళ్లి అయిన మహిళ తనకు పిల్లలు కావాలని మనసారా కోరుకుని ఒక రాత్రి ఆలయంలో నిద్రపోతే కచ్చితంగా పిల్లలు కలుగుతారట.

స్త్రీలు రాత్రి నిద్ర చేస్తే

స్త్రీలు రాత్రి నిద్ర చేస్తే

ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటని కొట్టి పారేయకండి. మూఢనమ్మకాలు కొన్ని సార్లు నమ్మడం వల్ల తప్పేం లేదు. పూజలు చేయించి పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మబలికే దొంగ స్వామీజీలను నమ్మడం కంటే ఇలాంటి నమ్మకాలను పాటించడం తప్పేమి కాదు. దైవ అనుగ్రహం లేనిది ఏమీ కాదు. అందుకే మనస్పూర్తిగా దైవంను కోరుకోవడం కోసం దేవాలయంకు వెళ్తాం. అయితే అక్కడ దేవాలయంలో మాత్రం స్త్రీలు రాత్రి నిద్ర చేసి సంతానం కోసం పూజలు చేస్తారు.

పిల్లలు పుట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి

పిల్లలు పుట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి

దేవాలయంలో నిద్ర చేయడం వల్ల పిల్లలు పుట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. దేవుడి గుడిలో నిల్చుని జాబ్‌ రావాని కోరుకుంటే ఆ దేవుడు కరుణించి జాబ్‌ ప్రసాదించాడని నమ్మే వారు ఉన్నప్పుడు దేవుడి గుడిలో నిద్ర చేసి పిల్లలు కోరుకునే వారి కోర్కెలు దేవుడు తీర్చుతాడని కూడా నమ్మవచ్చు.

మండి జిల్లాలోని సిమాస్ గ్రామంలో

మండి జిల్లాలోని సిమాస్ గ్రామంలో

మరి ఆ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందా? అనే కదా మీ సందేహం. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని లడ భరోల్ సమీపంలో సిమాస్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో దేవత సిమ్సా దేవత. సిమ్సా దేవిని 'సాన్టాన్-దత్రీ' అని కూడా పిలుస్తారు.

బంజరు స్త్రీలంతా

బంజరు స్త్రీలంతా

ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఇది హిమాచల్ ప్రదేశ్ తో పాటు చాలా ప్రాంతాలకు వారికి బాగా తెలుసు. నవరాత్రి సమయంలో పంజాబ్, హర్యానా, చండీగఢ్ లాంటి సమీపంలోని రాష్ట్రాల్లోని వేలాది బంజరు స్త్రీలంతా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

సాలింద్ర భాషలో మాట్లాడుకుంటారు

సాలింద్ర భాషలో మాట్లాడుకుంటారు

నవరాత్రి సమయంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టని దంపతులు పెద్ద సంఖ్యలో వస్తారు. నవరాత్రి పండుగ సమయంలో పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలు 'సాలింద్ర' (లేదా కల) అనే స్థానిక భాషలో మాట్లాడుకుంటారు. నవరాత్రి సమయంలో పిల్లలు లేని స్త్రీలు ఈ ఆలయంలో నెల మీద రాత్రి సమయంలో నిద్రిస్తారు.

దేవత కలలో కనపడుతుంది

దేవత కలలో కనపడుతుంది

పిల్లల కోసం ఆ గుడిలో దసరా నవరాత్రుల సమయంలో వచ్చే మహిళలు మరుసటి దసర వరకు ఎక్కువ శాతం మంది వారి పిల్లలతో అదే గుడికి వెళ్తూ ఉంటారు. ఇది ఈ మధ్య ప్రారంభం అయిన విషయం కాదు. దేవత మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆలయాన్ని సందర్శించే స్త్రీలకు దేవత కలలో కనపడుతుంది. దేవత మనిషి రూపంలో కనపడి బిడ్డ కలగాలని ఆశీర్వాదం ఇస్తుంది. కలలో పువ్వు లేదా పండు స్వీకరించినట్టు వస్తే ఆమెకు బిడ్డ పుడతాడని నమ్మకం.

కలలో జామ పండు కన్పిస్తే

కలలో జామ పండు కన్పిస్తే

ఇక్కడ పుట్టే బిడ్డ అడ లేదా మగ అనే విషయం కూడా తెలుస్తుందని నమ్మకం ఉంది. స్త్రీ కలలో జామ పండు కన్పిస్తే అబ్బాయి పుడతాడని,అదే బెండకాయ కన్పిస్తే అమ్మాయి పుడుతుందని నమ్మకం. అలాగే స్త్రీకి కలలో రాయి కనపడకుండా చెక్క లేదా మెటల్ కనపడితే పిల్లలు పుడతారని నమ్మకం. ఆమెకు బిడ్డ పుడతాడని కల రాగానే ఆమె ఆలయ ప్రాంగణాన్ని వదిలివేయాలి.

చిన్న పిల్లలు కదిలిస్తే

చిన్న పిల్లలు కదిలిస్తే

ఒకవేళ ఆలయంలోనే ఉంటే ఆమె శరీరం మీద దురదలు,ఎర్రని మచ్చలు వస్తాయి. సిస్సా దేవాలయానికి సమీపంలో ఒక పెద్ద రాయి ఉంది. ఇది చాలా ప్రజాదరణ పొందింది. ఈ రాయిని మీరు కదిలిస్తే కదలదు. కానీ మీ చేతిలో చిన్న పిల్లలు కదిలిస్తే సులభంగా కదులుతుంది.

కొన్ని రోజుల పాటు నిద్రించాలి

కొన్ని రోజుల పాటు నిద్రించాలి

100 సంవత్సరాలకు పైగా ఈ గుడి సంతానం కలిగించే దైవానికి నెలవు అయ్యింది. కాలక్రమేణ ఈ గుడి ప్రాచుర్యం పెరగడంతో పాటు చుట్టు పక్కల వారు అంతా వస్తున్నారు. సంతానం కలగని ప్రతి ఒక్కరు కూడా గుడిలో ఒకటి లేదా రెండు లేదా మూడు ఇలా కొన్ని రోజుల పాటు నిద్రించాల్సి ఉంటుంది.

సంతాన పూజలు

సంతాన పూజలు

సాయంత్రం సమయంలో సమీపంలోని కోనేరులో స్నానం చేసి తడి బట్టలతోనే గుడి చుట్టు మహిళలను నిద్రిస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో కూడా ఈ గుడిలో ఆడవారి సంతాన పూజలు జరుగుతూనే ఉంటాయి. పంజబ్‌, హర్యాన చండీగడ్‌ వంటి రాష్ట్రాల నుంచి కూడా మహిళలు పిల్లల కోసం ఈ దేవాలయానికి వెళ్తారు అంటే ఏ స్థాయిలో ఆ గుడి ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గుడి చుట్టు పడుకుని ఉంటారు

గుడి చుట్టు పడుకుని ఉంటారు

పెద్ద సంఖ్యలో ఆడవారు నవరాత్రి సమయంలో గుడికి నిద్రకు వచ్చినా కూడా గుడి నిర్వాహకులు అందరికి అవకాశం ఇస్తారు. కొన్ని సందర్బాల్లో కనీసం కాళ్లు పెట్టేందుకు కూడా వీలు లేకుండా ఆడవారు ఒకరిపై ఒకరు అన్నట్లుగా గుడి చుట్టు పడుకుని ఉంటారు.

స్త్రీలు గుడిలో నిద్రిస్తూనే ఉండాలి

స్త్రీలు గుడిలో నిద్రిస్తూనే ఉండాలి

గుడిలో నిద్ర చేస్తున్న సమయంలో దేవత స్త్రీలను మనిషి రూపంలో కనిపించి పిల్లలు కలగాలంటూ ఆశీర్వదిస్తుంది. అలా ఆశీర్వాదం వచ్చే వరకు స్త్రీలు గుడిలో నిద్రిస్తూనే ఉండాలి. అక్కడకు వెళ్లిన ఎక్కువ శాతం మందికి సంతానం కలిగింది. అందుకే ఆ గుడి గురించి రోజు రోజుకు పబ్లిసిటీ పెరిగి పోతుంది. సంతానం కలగని స్త్రీలు ఎవరైనా ఒక్కసారి వెళ్లిరండి. మీపై ఆ దేవత అనుగ్రహం ఉంటే కచ్చితంగా పిల్లలు పుడతారు. వందేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ ఆచారం ద్వారా లక్షల మందికి స్త్రీలు పిల్లల్ని పొందారు.

English summary

women become pregnant after sleep in simsa mata temple

women become pregnant after sleep in simsa mata temple
Desktop Bottom Promotion