భారతదేశ చరిత్రలో అనుకోకుండా యుద్ధాలకి కారణమైన స్త్రీలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

భారతదేశం చరిత్ర మొత్తం, జరిగిన ప్రతి యుద్ధం ఏదో ఒకరకంగా స్త్రీ యొక్క లోభం, లేదా ఆ భూమి కోసం లేదా రాజ్యపదవి కోసం జరిగినట్టే చిత్రీకరించారు. ఎవరో ఒకరి దృష్టికోణం నుంచి స్త్రీ బాధితురాలిగా కన్పడటం, అలా అర్థం వచ్చేట్లుగా రాయడం,కథ చెప్పడం జరిగాయ

మనం ఈరోజు అనుకోకుండా యుద్ధాలకి కారణమైన కొందరు అలాంటి గొప్ప స్త్రీల గురించి తెలుసుకుందాం, చరిత్ర కూడా వారిని వేలెత్తి చూపలేదు,ఎందుకని?

Women who caused wars in Indian History

సీత

లంకాపతి రావణుడు రాముడి భార్య సీతను అపహరించాడు, కేవలం ఇద్దరు రాజుల మధ్య గొడవ,రావణుడి చెల్లెలు శూర్పణఖను రాముడు పెళ్ళాడనన్నాడన్న కారణంగా ఇలా చేసాడు. ఇంకా లక్ష్మణుడు ఆమె వారి కుటీరానికి వచ్చినపుడు ఆమె ముక్కుచెవులు కోసాడు.

రావణుడు తన భార్యని అపహరించాడన్న ఆగ్రహంతో రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించాడు.హనుమంతుడు, వానరసేన సాయంతో జరిగిన ఈ పెద్దయుద్ధం రావణుడి వంశం మొత్తాన్ని దాదాపు నాశనం చేసేవరకు సాగింది.కొత్త రాజ్యపదవిని, లంకకి కొత్తరాజుగా విభీషణుడిని నియమించారు.

యుద్ధం ముగిసాక సీత తన పవిత్రతను నిరూపించుకోటానికి అగ్నిపరీక్ష ఇవ్వాల్సి వచ్చింది.

Women who caused wars in Indian History

ద్రౌపది

హిందూ ఇతిహాసం మహాభారతంలోని మహారాణి ద్రౌపదికి జరిగిన అవమానం అందరికీ తెలుసు. దుర్యోధనుడు ఒకసారి తమ భవనంలో అనుకోకుండా కిందపడిపోతే ద్రౌపది ఒకసారి అతన్ని చూసి నవ్వింది.ఆ వెంటనే దుర్యోధనుడు ద్రౌపదిని జూదంలో గెలవడానికి యుధిష్టిరుడితో మోసంచేసి ఆడాడు. దుర్యోధనుడు తన సోదరుడు దుశ్శాసనుడని ద్రౌపదిని సభకి బలవంతంగా ఈడ్చుకురమ్మని ఆదేశించాడు. ద్రౌపది పోరాడితే దుశ్శాసనుడు ఆమె జుట్టుపట్టుకుని సభామందిరానికి లాక్కొచ్చాడు. ఆమె భర్తలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.

దుర్యోధనుడు తన సోదరుడిని ఆమె బట్టలు విప్పమని ఆదేశిస్తే, అదృష్టవశాత్తూ ఆమె స్నేహితుడు కృష్ణుడివలన రక్షించబడుతుంది. ఈ అవమాన భారంతో, పాండవులు మరియు ద్రౌపది భారత చరిత్రలో అనుకోని విధంగా అతిపెద్ద యుద్ధానికి కారణమయ్యారు.

ద్రౌపది దుర్యోధనుడిని తన భర్తలతో చాలా దారుణంగా చంపబడతాడని, వారందరి రక్తంతో తడిసాకనే జుట్టును ముడివేస్తానని శపథం చేసింది.

'నా జీవితాన్ని మార్చేసిన సులభమైన బరువుతగ్గే చిట్కా’ అంటున్న అనాయ

యుద్ధం జరిగింది, దుర్యోధనుడు తన 100 సోదరులతో, బంధువులతో కలిసి చంపబడ్డాడు, పాండవులు కొత్త వారసులుగా హస్తినాపుర రాజ్య సింహాసనం అధిష్టించారు. మొత్తం రాజ్యంలో శాంతి,సమృద్ధి నెలకొన్నాయి.

Women who caused wars in Indian History

రాణి పద్మావతి

రాణి పద్మావతి చిత్తోడ్ మహారాణి,రాజైన రావాల్ రతన్ సింగ్ భార్య మరియు సింహళ రాజు కూతురు. మహారాణి పద్మ ఆమె అందానికి అప్పట్లో చాలా ప్రసిద్ధురాలు. అల్లాద్దీన్ ఖిల్జీ ఆమె అందాన్ని మోహించి రాణి పద్మావతిని బలవంతంగా తీసుకువెళ్ళటానికి చిత్తోడ్ రాజ్యంపై దాడిచేసాడు.

Women who caused wars in Indian History

సంయుక్త

సంయుక్త కన్నౌజ్ రాజ్యానికి మహారాజైన జైచంద్ కూతురు. పృథ్వీరాజ్ చౌహాన్ వీరత్వం గురించి విని ఆమె అతనితో ప్రేమలో పడింది. వారు ఒకసారే కలిసినా పృథ్వీరాజ్ చౌహాన్ కి కూడా ఆమె నచ్చి ఇద్దరూ పెళ్ళిచేసుకోవాలనుకుంటారు.కానీ పృథ్వీరాజ్ మరియు రాజు జైచంద్ ఇద్దరూ రాజపుతులలో రెండు శాఖలకి చెందినవారు కావటంతో ఈ విషయం తెలుసుకున్న రాజు జైచంద్ పృథ్వీరాజ్ ని అవమానించటానికి సంయుక్తకి స్వయంవరం ఏర్పాటుచేస్తాడు. పృథ్వీరాజ్ తప్ప అందరూ అర్హత ఉన్న యువరాజులు ఆహ్వానించబడ్డారు,పైగా మట్టితో చేసిన పృథ్వీరాజ్ చౌహాన్ బొమ్మను గేటు వద్ద కాపలాగా ఉంచారు.

ఈ అవమానం గురించి తెలుసుకున్న పృథ్వీరాజ్, సంయుక్తను అక్కడ నుంచి ఎత్తుకొచ్చేయాలని భావించాడు. ఆయన పథకం ఫలించింది.పెళ్ళిరోజునాడు, మహారాజు పృథ్వీరాజ్ సంయుక్తతో కలిసి తన గుర్రంపై పారిపోయి, ఢిల్లీకి వచ్చేసాడు. ఢిల్లీతో సంబంధం ఉన్నవారు,కన్నౌజ్ వారు ఏం జరుగుతుందోనని భయపడ్డారు.

మహమ్మద్ ఘోరీ ఈ సంఘటనని తనలాభం కోసం వాడుకోవాలనుకున్నాడు, అతను ఢిల్లీని, తూర్పు పంజాబ్ పై దాడిచేసాడు. ఘోరీ వద్ద చాలా పెద్ద సైన్యం ఉండటంతో, పృథ్వీరాజ్ కన్నౌజ్ సాయం కోరాడు కానీ అనుకున్నట్టుగానే తిరస్కారం పొందాడు. కానీ తనకున్న మేధస్సు మరియు వీరత్వంతో పృథ్వీరాజ్ యుద్ధం గెలిచి ఘోరీని తన ఖైదీగా చేసుకున్నాడు.

English summary

Women who caused wars in Indian History

Indian history has always been painted in one way or the other that women, land or the the greed for throne were the reasons of war. Women being the victim of one’s perception of interpreting and narrating the story.
Story first published: Wednesday, November 29, 2017, 14:30 [IST]
Subscribe Newsletter