Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
కాత్యాయని దేవిని పూజిస్తే వివాహ సంబంధిత సమస్యలను దూరం అవుతాయా? అమ్మవారిని పూజించి చూడండి అన్నీశుభాలే
కాత్యాయనీ దేవిని పూజించబడే ఇంట్లో శాంతి, శ్రేయస్సు కలుగుతుంది. వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాత్యాయనీ దేవిని పూజించడం ద్వారా ఫలితాలను పొందగలరని సలహా ఇవ్వబడింది. వివాహ వి
కాత్యాయని దేవిని పూజించడం వివాహసంబంధ సమస్యలను దూరం చేస్తుందా ?
నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు. క్రమంగా ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది. ఈ తొమ్మిది రూపాలలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది. మంగళ దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది.
ఆమే కాత్యాయయుని కుమార్తె, కాత్యాయనీ. కాత్యాయనీ దేవి నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది. ఇందులో ఆమె తన ఎడమ వైపు పై చేతిలో కమలాన్ని, మరో చేతిలో కత్తిని కలిగి ఉంటుంది. అదేవిధంగా, కుడి చేతులు అభయ మరియు వరద ముద్రలతో కూడుకుని ఉంటాయి. పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనమిస్తుంది.

కాత్యాయనీ దేవిని పూజించబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడింది. వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాత్యాయనీ దేవిని పూజించడం ద్వారా ఫలితాలను పొందగలరని సలహా ఇవ్వబడింది. వివాహ విషయాలలో ఆలస్యం, భార్యా భర్తల మధ్య తరచుగా విభేదాలు, సరైన భాగస్వామిని కనుగొనలేక పోవడం, వంటి సమస్యలు నవరాత్రి వేళల్లో ఆమెకై ఉపవాసం పాటించడం ద్వారా తొలగించబడుతుందని చెప్పబడింది. ఆమె వర్ణనలు కాళిక పురాణాలలో కూడా కనిపిస్తాయి. కాత్యాయనీ దేవి కూడా ఆదిశక్తి అంశగా పరిగణించబడుతుంది. కావున భయాన్ని త్యజించడం కోసం కూడా కాత్యాయనీ దేవిని పూజించడం జరుగుతుంది.

పన్నెండవ గృహంతో సంబంధం ఉన్న దేవతగా కాత్యాయనీ దేవిని కొలవడం జరుగుతుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం, కాత్యాయనీ దేవి జన్మ కుండలి చార్ట్లో బృహస్పతి గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆమెను 'బ్రహ్మ మండల ఆదిశక్తి దేవి' అని కూడా పిలుస్తారు. గోకులంలోని గోపికలు, కృష్ణుని ప్రేమను పొందుటకై ఈ దేవతకు ప్రార్ధనలు చేశారని చెప్పబడింది. భగవత్ పురాణంలో వారు యమునా నదిలో స్నానం చేసి, ధూప దీపాలతో, పువ్వులు మరియు నైవేద్యాలను సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్పబడింది. ఈ ఉపవాసాలు చేయడం ద్వారా, క్రమంగా దోషాలు తొలగిపోయి వివాహ మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పబడింది. దేవీ నవ రాత్రులలో కాత్యాయని దేవీని పూజ చేయడం వివాహాది సమస్యలతో భాదపడేవారికి అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పబడుతుంది.
వివాహానికి సంబంధించిన సమస్యల నివారణ కొరకు సూచించబడిన కాత్యాయని దేవీ మంత్రాలను కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి :

1. ముందస్తు వివాహానికి సూచించబడిన కాత్యాయనీ మంత్రం :
ఓం కాత్యాయనీ మహామయే, మహాయోగిన్యాధీశ్వరీ !
నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః !!

2. వివాహ ఆలస్యానికి సూచించదగిన కాత్యాయని మంత్రం :
హే గౌరీ శంకర్ అర్ధాంగి యధా త్వాం శంకర్ ప్రియా !
తథా మమ్ కురు కల్యాణి కంటకం సుదుర్లభం !!

3. వివాహ సమస్యల నుండి బయట పడేందుకు :
హే గౌరీ శంకర్ అర్ధంగిని యథా త్వం శంకర ప్రియ !
తథా కమ్ కురు కల్యాణి కంత్ కాంత్ సుదుర్లభమ్ !!

4. ఆలస్యమైన వివాహాలకు కాత్యాయనీ సూర్య మంత్రం :
ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!

5. కోరుకున్న భాగస్వామి కోసం సూచించదగిన కాత్యాయనీ మంత్రం :
ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!

6. మంచి వివాహ జీవితానికి ఉద్దేశించిన కాత్యాయనీ మంత్రం :
ఓం షంగ్ శంకరాయ సకల్ జన్మర్జీత్ పాప్ విధ్వామ్స్ నాయ్ !
పురుషార్ద్ చౌతుస్టాయ్ లాభయ్ చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ !!

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications