Latest Updates
-
రెస్టారెంట్ వాళ్లు దాచే 5 సీక్రెట్స్ ఇవే.. ఇలా వండితే మీ చికెన్ కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్! -
వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
నోరూరించే పచ్చి మామిడికాయ టమాటా పచ్చడి..అన్నం,దోశ,చపాతీ దేనిలోకైనా అమృతమే! -
సీబీఎస్ఈ ఫలితాల టెన్షన్ పడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు మీ భయం పోగొడతాయి -
రోజుకు 4 సార్లు కడుపు నిండా తింటూనే 12 కిలోల బరువు తగ్గిన యువకుడు.. ఎలాగో తెలుసా? -
రొటీన్ అన్నం,కూరలతో బోర్ కొట్టిందా? అయితే చిటికెలో ఈ పాలకూర రైస్ ట్రై చేయండి..మళ్లీ మళ్లీ తింటారు! -
సముద్రం మధ్యలో మంచినీటి బావి..రామేశ్వరంలో అంతుచిక్కని అద్భుతం! -
గ్యాస్ లేకున్నా నో ప్రాబ్లమ్..రైస్ కుక్కర్ లో వేడివేడి పూరీలు ఇలా చేసుకోండి! -
వేసవిలో ఆరోగ్యం కోసం.. ఈ చిన్న మార్పులతో రోజంతా ఫుల్ ఎనర్జీ! -
షష్ఠి తిథి, మూలా నక్షత్రం వేళ కొత్త పనులు మొదలుపెడుతున్నారా?
ఫేవరెట్ ఈవెనింగ్ టీ స్నాక్ ఆలూ బోండా
బోండా లేదా పకోడా వంటివి నూనెలో ఫ్రైచేసి ఈవెనింగ్ స్నాక్స్ గా తినేటటువంటి చిరుతిండ్లు. దక్షిణ భారత దేశంలో(కర్ణాటక, ఆంధ్ర) వీటి పేర్లు కూడా చాలా ఫేమస్. బోండాను చాలా రకాలుగా వండుతారు. ఆకు కూరలు, కూరగాయలు, లేదా ఉల్లిపాయలు, వంకాయలు, బీరకాయలు, పచ్చిమర్చి, బంగాళదుంప ఇలా చాలా రకాలు...
ఇండియన్ ఫ్రైయిడ్ స్నాక్స్ లో ఆలూ బోండా చాలా ఫేమస్ వంటకం. వీటిని సాయంత్ర సమయంలో టీ, కాఫీ లేదా టమోటో కెచప్ తో వేడివేడిగా తినవచ్చు. అంతే కాదు ఇంటికి వచ్చే అథితులకు కూడా అతి సులభంగా, అతి త్వరగా తయారు చేసి వండించేయెచ్చు . ఈ ఫేవరెట్ ఈవెనింగ్ టీ స్నాక్ ఆలూ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం....

కావలసిన పదార్థాలు:
ఉడికించిన బంగాళదుంపలు(ఆలూ): 2-4(ఉడికించి చిదిమి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4-6
శెనగపిండి: 1cup
కారం: 1tsp
గరం మసాలా: 1/4tsp
కొత్తిమీర తరుగు: 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంప, మరియు ఉప్పు, పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర, మరియు పచ్చిమిర్చి వేసి బాగా కలగలుపుకోవాలి.
2. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శెనగపిండి తీసుకొని, దానికి కొద్దిగా ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్ళు పోసి బోండా పిండిలా కలుపుకోవాలి. (చిక్కగాను లేదా కొద్దిగా పలుచగా కూడా కలుపుకోవచ్చు)
3. ఇప్పుడు ఆలూ మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోనికి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లో చేసుకోవాలి. ఇలా కొన్ని బాల్స్ చేసుకొన్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు, ఫ్రైయింగ్ పాన్ లో నూనె పోసి, బాగా కాగిన తర్వాత మంట మీడియంగా పెట్టి ఆలూ బాల్స్ శెనగ పిండి మిశ్రమంలో వేసి, ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి ఒక ప్లేట్ లోనికి తీసుకొని వేడి వేడిగా చట్నీ లేదా టమోటో కెచప్ తో సర్వ్ చేయాలి. అలాగే ఉడికించిన బోండాను రెండుగా కట్ చేసి మధ్యలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం కొద్దిగా చిలకరించి సర్వ్ చేయొచ్చు.



Click it and Unblock the Notifications











