Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత యోగం..! - సోమవారం, 13 ఏప్రిల్ 2026 -
16 ఏళ్లుగా విడిపోయినా వదలని బంధం.. భర్తకు సుప్రీంకోర్టు షాకింగ్ ఆదేశాలు! -
ఏప్రిల్ ఎండలు మండిపోతున్నాయా? ఈ చిట్కాలతో వడదెబ్బకు చెక్ పెట్టండి -
విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆ చిన్న కానుక వైభవ్ కెరీర్నే మార్చేస్తుందా? -
ఎండల తీవ్రత నుంచి బయటపడాలా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి -
మేష సంక్రాంతి 2026: ఈ ముహూర్తంలో పూజ చేస్తే అదృష్టం మీదేనా? -
మేషం, కర్కాటకం, మీన రాశుల వారికి ఈ వారం సూర్య సంచారంతో భారీ అదృష్టం..! - 12 నుండి 18 ఏప్రిల్ 2026 వరకు -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 12 ఏప్రిల్ 2026 -
ఐస్ క్రీమ్స్ కంటే చల్లగా.. కూల్ డ్రింక్స్ కంటే హెల్తీగా..ఈ సమ్మర్ కు జొన్న గంజి బెస్ట్! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా టేస్టీ నూడుల్స్ చేయండి!
కుటుంబ సభ్యులతో పాటు అతిథులకూ .. టేస్టీ బ్రేక్ ఫాస్ట్
బ్రేక్ ఫాస్ట్ లలో వెరైటీగా, చూస్తానే తినేయాలనిపించి, నోరూరించే వంటకం కోకోనట్ కచోరి. కచోరి అంటే గుండ్రంగా అందులో మిశ్రమ పదార్థాలతో నిండుగా నింపి టేస్టీ గా ఉండే పఫ్డ్ ఇండియన్ బ్రెడ్ లాంటిది అనుకోవచ్చు. అయితే బ్రెడ్ కాదండోయ్.... కచోరీలను కొన్ని వరైటీలతో నింపి చేసుకొంటారు. కోకోనట్ మిశ్రమానికి బదులు, ఆలూ మిశ్రమం తో కూడా చేసుకొంటారు. అయితే కొబ్బరి మిశ్రమంతో తయారు చేసే అన్ని వంటలు చాలా పాపులర్ వంటకాలు కాబట్టి అదే ఫ్లేవర్ తో మరో వెరైటీ వంటకం బ్రేక్ ఫాస్ట్ మీ కోసం...

కావలసిన పదార్థాలు:
యాలకులు: 2
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 2
కొబ్బరి తురుము: 2cups
మైదా: 4-6cups
నెయ్యి: 5-6tbsp
పంచదార: 2tbsp
ఉప్పు : చిటికెడు
నూనె: 2cups
తయారు చేయు విధానం:
1. ముందుగా చెక్క, లవంగం, యాలకలు మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మైదా , నెయ్యి, పంచదార, మరియు కొద్దిగా ఉప్పు వేసి , నీళ్ళు చేర్చి చపాతి పిండిలా మృదువుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు కొబ్బరి తురుమును మిక్సీలో వేసి సన్నని పలుకుగా గ్రైండ్ చేసుకొని, దానికి ముందగా పౌడర్ చేసి పెట్టుకొన్న యాలకుల, లవంగాల పొడిని మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి.
4. ఇప్పుడు మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక్క ఉండను మద్యలో చిన్న గుంటలా వత్తి అందులో కొబ్బరి మిశ్రమాన్ని నింపి, మళ్ళీ పూర్తిగా కవర్ చేసేయాలి. కావలసిన సైజులో వత్తుకోవాలి.
5. ఇలా పిండి మొత్తం బాల్స్ లా తయారు చేసుకొన్న తర్వాత, వీటిని బాదూష లేదా మీకు నచ్చిన షేప్ లో అన్ని ఉండలను వత్తుకోవాలి.
6. ఇప్పుడు లోతైన ఫ్రైయింగ్ పాన్ తీసుకొని స్టౌ మీద ఉంచి అందులో నూనె పోసి, వేడయ్యాక అందులో వత్తిపెట్టుకొన్న కచోరీలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ రెండు వైపులా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని తయారు చేసుకొన్న తర్వాత హాట్ హాట్ గా సర్వ్ చేయడమే ఆలస్యం.... చక్కటి రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ మీ కుటుంబ సభ్యులతో పాటు అతిథులకు వడ్డించండి......



Click it and Unblock the Notifications











