Just In
- 10 min ago
వైరల్ వీడియో : మందు బాబులం.. మేమే మహారాజులం.. అంటున్న చిన్నారులు..
- 1 hr ago
ఆ కార్యంలో కలకాలం కచ్చితంగా సక్సెస్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...
- 1 hr ago
డయాబెటిస్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం లేదా? మరి పరిష్కారం ఏంటి?
- 3 hrs ago
నిలబడి తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? మీ సందేహానికి సమాధానం ఇక్కడ ఉంది
Don't Miss
- Technology
ఐఫోన్ ఎస్ఈ2 రావడం లేదు,దాని బదులు ఐఫోన్ 9 వస్తోంది
- Sports
ఆప్ఘన్ బోర్డు కీలక నిర్ణయం: రషీద్ ఖాన్‌కు డిమోషన్, కెప్టెన్‌గా అస్గర్
- News
అత్యాచారానికి ఉరిశిక్ష... ఏపి దిశ చట్టానికి క్యాబినెట్ ఆమోదం
- Movies
నాగబాబు చేసిన పనితో ఆ నటుడి కోసం వెతుకుతున్న జబర్ధస్త్ టీమ్.. రీప్లేస్ చేయనిది అందుకే.!
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Automobiles
కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు..
జ్యోతిష్యం, సెప్టెంబర్ 5వ తేదీ
గురువారమైన ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఏవైనా ప్రతికూలత అంశాలుంటే జాగ్రత్తలు పాటించండి. ఈరోజు ఆనందంగా గడపండి.
ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
మీ గత భవిష్యత్తు కలతపెట్టే అంశంగా మారుతుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఉత్తమంగా ఉంటుంది. మీ తప్పులను కూర్చుని విశ్లేషించుకోండి. మీ మెరుగుదల కోసం పని చేయండి. శాంతియుతంగా జీవించడానికి మీరు మానసిక సమతుల్యతను పాటించాలి. ఆర్థిక రంగంలో విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేస్తారు.
ఒక ముఖ్యమైన పని మిమ్మల్ని బిజీగా మార్చుతుంది. విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం మానుకోండి. ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
లక్కీ కలర్ : రెడ్ (ఎరుపు)
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 4 గంటల నుండి 7.45 వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
కుటుంబంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు మిమ్మల్ని రోజంతా బంధిగా ఉండేలా చేస్తుంది. ఒక ముఖ్యమై నిర్ణయానికి సంబంధించి మీరు మీ తోడబుట్టిన మరియు తల్లిదండ్రుల సలహా తీసుకుంటారు. మీ భాగస్వామి కూడా తగినంత బాధ్యత వహిస్తారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా నిరాశ పరచరు. మీరు సాధించని విషయాలతో నిరాశ చెందాల్సిన పనిలేదు. కళలు మరియు డ్రాయింగ్ లో ఉన్న వారు బాగా ప్రదర్శనలు చేస్తారు. మీలో కొందరు పని ముందు సరైన మార్గదర్శకత్వం కోసం ప్రయత్నిస్తారు. కార్పొరేట్ రంగంలో ఉన్నవారు తమ ఉద్యోగాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తారు. ఆఫీసుల్లో పనిచేసే వారు గాసిప్స్ లో భాగం కావడం మానుకోండి. మీ ప్రియమైన వారి నుండి ఒక శుభవార్తను వింటారు. ఉదయం పూట నడకతో మీ రోజును ప్రారంభించండి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నెంబర్ : ఎనిమిది
లక్కీ టైమ్ : ఉదయం 9.40 నుండి మధ్యాహ్నం 12.55 వరకు

మిధున రాశి మే 21 - జూన్ 20
మీ వైఖరి మరియు మీ తప్పుడు ప్రవర్తన కారణంగా మీ జీవిత భాగస్వామికి కష్టాలు మొదలవుతాయి. చిన్న చిన్న విషయాలు మీకు కలతను కలిగిస్తాయి. మీ సన్నిహితుడు మీ సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తాడు. మీరు మీ యాత్రను రద్దు చేయాల్సి ఉంటుంది. ఇది మీ పిల్లలను నిరాశపరుస్తుంది. బడ్జెట్ యొక్క దుర్వినియోగం ఆందోళన కలిగిస్తుంది. అదనపు ఆదాయ వనరుల కోసం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ యజమాని కొంతకాలం దూరంగా ఉండటంతో మీరే బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు ఇక్కడ మరియు అక్కడ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మెరుగుపడటం మంచి సంకేతం.

కర్కాటకరాశి జూన్ 21 - జూలై 22
ఎట్టకేలకు మీరు ఆరోగ్య ప్రాముఖ్యతను గ్రహిస్తారు. వ్యాయామం కోసం మిమ్మల్ని పెంచడానికి ఈ ఆత్మ చాలా అవసరం. ఆరోగ్య స్పృహతో ఉండటం మీ శ్రేయస్సు యొక్క సంకేతం. ఇదే పనిలో విజయవంతమైన రోజు అవుతుంది. మీ సహోద్యోగులకు వారి అవసరాలకు అనుగుణంగా మీరు మార్గనిర్దేశం చేస్తారు. కెరీర్ కౌన్సెలింగ్ కోసం ప్రణాళిక వేసేవారు గందరగోళం చెందుతారు. మీరు మీ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లిదండ్రులకు సహాయం కోసం ప్రయత్నిస్తారు. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తారు. మీ దగ్గరి స్నేహితుడు/బంధువు ఆర్థిక పరంగా మీ సహాయం కోరవచ్చు. ఇందుకు మీ భాగస్వామి కూడా మద్దతుగా ఉంటారు. విశ్రాంతి రోజు మీరు మీ పిల్లలతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీ ప్రియమైన వారితో ప్రయాణం ప్రత్యేకంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ కలర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 4.05 నుండి ఉదయం 10 గంటల వరకు

సింహరాశి : జులై 23-ఆగస్టు 22
పనిలో కష్టంగా ఉండే రోజు. అలసట వల్ల మీకు బలహీనంగా అనిపిస్తుంది. అధిక ఒత్తిడిని అధిగమించేందుకు మీరు మరింత కష్టపడాలి. మీ ఉన్నతాధికారులు మీరు పనులు చేయకుండా అడ్డుపడే అవకాశముంది. వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండే వారు భారీ లాభం పొందుతారు. కుటుంబసభ్యుల ఆశీర్వాదం ఉంటుంది. మీ ప్రియమైన వారితో మీ సంబంధాన్ని బలోపేతం చేయడం ఫలప్రదంగా ఉంటుంది. కడుపు నొప్పి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. మెరిట్ లో ఎక్కువ స్కోరు సాధించిన వారికి ఇది వేడుకల సమయం.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నెంబర్ : 15
లక్కీ టైమ్ : సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
మీకు ఎక్కువ ప్రాాజెక్టులు వస్తున్నందున మీ సామర్థ్యం గురించి ప్రశంసలు అందుతాయి. కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా హూషారుగా ఉంటుంది. దీర్ఘకాలిక చట్టపరమైన కట్టుబాట్లు ముగిసిపోతాయి. ఇది మీకు చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు చేసిన తప్పుకు మీరు క్షమాపణలు చెబుతారు. దగ్గరి బంధువు ఈరోజు సాయంత్రంలోపు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు. మీ ప్రియమైన వారితో శృంగార విందు మీ మానసిక స్థితిని పెంచుతుంది. ఆర్థికంగా మెరుగుదల ప్రతి ఒక్కరినీ ఒక మలుపు తిప్పుతుంది. మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు చేతిరాత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : వాయిలెట్
లక్కీ నెంబర్ : 27
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
మీకు నిలిచిపోయిందనుకున్న డబ్బు ఈరోజు మీకు అందుతుంది. ఆర్థికంగా అదృష్ట రోజు అవుతుంది. మిగులు ఆదాయం కూడా అద్దె ద్వారా లేదా ఇలాంటి వాటి ద్వారా రావచ్చు. తల్లిదండ్రుల సలహాతో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం అదృష్టంగా ఉంటుంది. మీ భాగస్వామి డిమాండ్ చేసిన కొన్ని విషయాలకు మీరు నో చెప్పాల్సి ఉంటుంది. అధిక నిరీక్షణను ఎక్కడైనా నివారించండి. ఇది మీకు తప్ప మరెవరికీ బాధ కలిగించదు. అలసట మరియు బలహీనత కొన్ని రోజులు రోజువారీ దినచర్యలో భాగంగా ఉంటాయి. కాబట్టి పెద్దగా బాధపడటానికి ఏమీ లేదు. మీ కుటుంబంలో ఐక్యత ప్రత్యేకమైన క్షణాన్ని తీసుకువస్తుంది. అందరినీ దగ్గరగా చేస్తుంది. చుట్టుపక్కల ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి.
లక్కీ కలర్ : డీప్ బ్లూ
లక్కీ నెంబర్ 28
లక్కీ టైమ్ : ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చికరాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
మీ అవగాహన మరియు సహాయక స్వభావం ఇతరులకు సహాయపడుతుంది. మీకు గౌరవం కూడా వస్తుంది. మీ సన్నిహితుడు/బంధువు సహాయంతో పెద్ద పురోగతిని అధిగమిస్తారు. మీలో కొందరు మీ సమస్యలను మీ సొంతంగా పరిష్కరిస్తారు. మీ కష్టపడి పనిచేసే స్వభావం మీకు గుర్తింపు మరియు గౌరవాన్ని తెస్తుంది. తరచుగా ప్రయాణించడం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒత్తిడి లేని జీవితాన్ని పొందడానికి వీలైనంత త్వరగా గత విషయాలను మరచిపోండి. త్వరలో అన్ని విషయాలు సాధారణంగా మారతాయి. సాయంత్రం సమయంలో ఏదో మిమ్మల్ని బాధపెడుతుంది. కానీ భయపడొద్దు. వ్యాపారవేత్తలు భారీ లాభాలను పొందుతారు. తల్లి ఆరోగ్యం చాలా కాలం తర్వాత కుదుట పడుతుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నెంబర్ : 14
లక్కీ టైమ్ : ఉదయం 8.55 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి నవంబర్ 22 - డిసెంబర్ 21
మీ పనిలో ఒక ప్రధాన అవకాశాన్ని పొందుతారు. మీ వ్యాపార భాగస్వామి ద్వారా మీకు నష్టం జరగొచ్చు. కాబట్టి వ్యాపార రంగంలో జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక పరంగా సాధారణ రోజుగా ఉంటుంది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు మరింత కృషి చేస్తారు. కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన విషయాలలో రెండో ఆలోచనను ఇవ్వడం మానుకోండి. అధిక వ్యయం మీ నియంత్రణలోకి వస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రియమైన వారితో స్నేహపూర్వక సంబంధంతో ఈరోజు సజావుగా సాగుతుంది. పిల్లలు వారి అత్యుత్తమ నటనతో తల్లిదండ్రులు గర్వంగా భావిస్తారు.
లక్కీ కలర్ : రాగి ఎరుపు
లక్కీ నెంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి డిసెంబర్ 22 - జనవరి 19
ఫైనాన్షియల్ గా మీరు తక్షణ పెట్టుబడి కోసం ప్లాన్ చేయకూడదు. డ్రైవింగ్ మరియు ఎక్కువ దూరం ప్రయాణించడం తగ్గించుకోవం మేలు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలవడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. కొత్త జంటలు తమ సమయాన్ని ఉపయోగించుకుని శృంగార క్షణాలు కలిసి గడుపుతాయి. మీ జీవిత భాగస్వామి మీకు ప్రత్యేకమైనదాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది ఇద్దరికీ రిఫ్రెష్ లాగా అవుతుంది. బిజినెస్ ఫ్రంట్ లో కష్టపడి పనిచేయడం వల్ల పనులు సజావుగా సాగుతాయి. మొత్తంగా మీ ప్రయత్నానికి ప్రశంసలు అందుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తినడం మానుకోండి.
లక్కీ కలర్ : కాషాయ రంగు
లక్కీ నెంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9.15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఆర్థికపరంగా ఈరోజు కలిసి వస్తుంది. కానీ మీరు తెలివిగా ఖర్చు చేయాలి. ప్రణాళిక ప్రకారం పని చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టు గురించి ఉత్సాహంగా ఉంటారు. కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి చిన్న మార్పులు రావచ్చు. మీరు మీ విధులను శ్రద్ధగా వ్యవహరిస్తారు. మీ ఉన్నతాధికారులకు గర్వంగా అనిపిస్తుంది. కుటుంబపరంగా ఇది అనుకూలమైన రోజు. ఎందుకంటే అందరూ కలిసి సరాదాగా గడుపుతారు. ఒక చిన్న ట్రిప్ కూడా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో శృంగారం ఇద్దరికీ అద్భుతంగా ఉంటుంది. వివాహం కోసం వేచి ఉన్న వారికి శుభవార్త. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ ప్రతిపాదనకు అంగీకరిస్తారు.
లక్కీ కలర్ : ఎల్లో (పసుపు)
లక్కీ నెంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
మీరందరూ చాలా కాలం తర్వాత సమైక్యంగా వేడుకను జరుపుకుంటారు. కొత్తగా పెళ్లి అయిన జంటకు ప్రేమ గాలిలో ఉంటుంది. బిజినెస్ పరంగా విషయాలు బాగా అభివృద్ధి చెందుతాయి. మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది. విషయాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు ఈరోజంతా సంతోషంగా ఉంటారు. మీ పనిలోనూ రిలాక్స్ అవుతారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యారంగంలో విద్యార్థులు తమను తాము నిరూపించుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు మీ రోజును వ్యాయామంతో ప్రారంభించాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నెంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు