గర్భధారణ సమయంలో పులిపిర్లలను తొలగించడానికి 3 సురక్షితమైన, సహజ నివారణ పద్ధతులు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

సాధారణంగా పులిపిర్లు అనేవి గర్భధారణ సమయంలో అందరి మహిళలను బాధించే ఒక సమస్య. ఇది చర్మం మీద చిన్న ఆకృతిలో మొటిమలాగ మాంసంతో ఏర్పడి చాల ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మీ చర్మం మీద వచ్చినప్పుడు మీరు మీ చేతితో కానీ ఏదైనా గుడ్డతో కాని రుద్దినప్పుడు భరించలేనంత నొప్పిని కలిగిస్తుంది. మీకు కొంచం ఊరట కలిగించే విషయం ఏంటంటే ఈ పురిపిర్ల వలన మీకు కానీ మీ శిశువుకు కానీ ఎలాంటి హాని ఉండదు. కాబట్టి మీరు వీటిని వదిలించుకోవాలనుకుంటే ప్రసవం అయ్యేంతవరకు ఆగడం మంచిది.

ఈ లోపు, మనం గర్భదారణ సమయంలో వచ్చే పురిపిర్ల గురించి, మరియు వాటిని నివారించడానికి ఇంటివద్దే తయారుచేసుకొని కొన్ని సహజమైన నివారిణుల గురించి ఇప్పుడు తెలుసుకుందామా....

3 Safe And Natural Remedies To Remove Skin Tags During Pregnancy

పరిమాణము: ఇవి సాధారణంగా చూడటానికి ఒక అంగుళం కంటే చిన్నదిగా లేదా ఒక బియ్యం ధాన్యం కంటే తక్కువగా వీటిని కొలుస్తాయి, కానీ అవి కొన్నిసార్లు పెద్దవిగా పెరుగుతాయి.

రంగు: పురిపిర్లు మాములుగా చర్మం రంగులో లేదా కొద్దిగా ముదురు రంగులో ఉంటాయి.

ప్రదేశం: ఈ హానిరహితమైన పురిపిర్లని సాధారణంగా మీ చర్మం యొక్క ముడుతలు లేదా కంటిదగ్గర, ముఖం, మెడ, కండరములు, అండర్ ఆర్మ్, ఛాతీ ఫై భాగంలోనూ, ఛాతీ కింద, తొడల లోపల మరియు జననేంద్రియ వంటి అంశాలలో సాధారణంగా కనిపిస్తాయి.

గర్భధారణ సమయంలో పురిపిర్లు రావడం సాధారణం. గర్భధారణ సమయంలో ఈ పురిపిర్లు హార్మోన్ల మార్పులు కారణంగా ఏర్పడవచ్చు.

3 Safe And Natural Remedies To Remove Skin Tags During Pregnancy

హార్మోన్ ఈస్ట్రోజెన్ గర్భధారణ సమయంలో చర్మ మార్పులకు కారణమవుతుంది. ఇది పురిపిర్లు రావడానికి బాధ్యత వహిస్తుంది.

గర్భధారణ సమయంలో, కొత్తగా వేరు వేరు ప్రాంతాల్లో పురిపిర్లు రావచ్చు లేదా పాతవే రెట్టింపు కావచ్చు.

పురిపిర్లు రావడానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా ఎవరూ చెప్పలేకపోయారు. ప్రామాణిక సిద్ధాంతం ముఖ్యంగా రెండవ సారి గర్భం ధరించినప్పుడు వచ్చే హార్మోన్ల మార్పులు, చర్మ కణాల ఉత్పత్తిని పెంచుతాయి మరియు చర్మపు పురిపిర్ల సంఖ్యని పెంచుతాయి.

ఈస్ట్రోజెన్ మరియు మాస్ట్ కణాలు గా పిలువబడే తెల్ల రక్త కణాల రకం, పురిపిర్లను తయారు చేస్తాయి. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ అనేది చర్మంలో జరిగే మార్పులకు బాధ్యత వహిస్తుంది, చర్మంపై నల్లటి మచ్చలను లేదా నల్లటి నిప్పల్స్, మాస్ట్ కణాలు కొల్లాజెన్ యొక్క ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మీ చర్మానికి ప్రోటీన్ ని అందజేస్తుంది.

గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగడం కూడా పురిపిర్లు రావడానికి ఒక కారణం కావచ్చు.

ఇవి వచ్చే ప్రాంతాన్ని బట్టి, ఈ పురిపిర్లను 3 రకాలుగా చెప్పవచ్చు: క్యూటానియోస్, జననేంద్రియము మరియు ఆసన,క్యూటానియోస్ వంటి పురిపిర్లను మీ చర్మంపై ఎక్కడైనా రావచ్చు. జననేంద్రియ మరియు ఆసన చర్మం పురిపిర్లు వల్వా మరియు యోని భాగాలలో రావచ్చు మరియు ఇవి కొన్నిసార్లు మీరు ధరించే దుస్తుల ఘర్షణ కారణంగా గాయపడవచ్చు.

3 Safe And Natural Remedies To Remove Skin Tags During Pregnancy

గమనిక: మీ జననేంద్రియ ల వద్ద వచ్చే మొటిమను తప్పుగా గుర్తించవద్దు. ఈ మొటిమలు వైరల్ సంక్రమణ వలన సంభవిస్తాయి మరియు వీటికి చికిత్స అవసరం. ఒక్కొక్కసారి ఎలాంటి వైద్యం లేకపోయినా ప్రసవం తర్వాత ఈ మొటిమలు అదృశ్యమవచ్చు.

పురిపిర్లు ప్రమాదకరమైనవి కాదు. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటుకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా ఉండవచ్చని ఒక అధ్యయనం సూచిస్తున్నప్పటికీ, దానిని ఖచ్చితంగా నిరూపించడానికి మరో 7 పరిశోధనలు అవసరం.ఇవి మీ నగల లేదా మీ బట్టలు ద్వారా లాగబడకపోతే అవి సాధారణంగా బాధాకరమైనవి కావు. కొన్ని పురిపిర్లు సాధారణంగా గర్భం తర్వాత అదృశ్యమవుతాయి. కానీ అవి తమంతట తాము అదృశ్యం కాకపోతే, మీరు సహజ నివారణల మీద ఆధారపడవచ్చు.

3 Safe And Natural Remedies To Remove Skin Tags During Pregnancy

గర్భధారణ సమయంలో పురిపిర్లను తొలగించడానికి ఉపయోగించే కొన్ని సహజ నివారిణులు:

పురిపిర్లు సాధారణంగా శస్త్రచికిత్సతో తీసివేయబడతాయి - వాటిని (కాల్చి) లేదా గడ్డకట్టించడం ద్వారా తొలగిస్తారు. కానీ మీ శిశువు జన్మించేంతవరకు అవి ఉండాలి. పురిపిర్లను తొలగించడానికి వాడే క్రీమ్లు శిశువుకు మంచివి కావు, మరియు శస్త్రచికిత్సా పద్ధతులు మీ గర్భం మీద ఒత్తిడిని కలిగించవచ్చును.

ఒకవేళ మీ పురిపిర్లు చిన్నవి అయితే, ప్రసవం తర్వాత ఈ మూడు సహజమైన

3 Safe And Natural Remedies To Remove Skin Tags During Pregnancy

నివారణలు ప్రయత్నించండి:

టీ ట్రీ ఆయిల్: 100% సహజమైన టీ చెట్టు నూనె లోకి ఒక పత్తి బంతిని ముంచి మరియు పురిపిర్లు వున్న ప్రాంతంలో రాయండి. పురిపిర్ల ను రుద్దకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. కాసేపు దానిని వదిలివేయండి. మీరు దీన్ని రోజుకు 2-3 సార్లు చేయవచ్చు. నూనె త్వరగా ఎండిపోతుందని అనిపిస్తే, ఒకవేళ మీది పొడి చర్మం అయితే ఆలివ్ నూనె ని కలుపుకోవచ్చు.

ఆపిల్ సైడర్ వినెగర్: మొదట పురిపిర్లు వున్న ప్రాంతాన్ని బాగా శుభ్రం చేసి, యాపిల్ సైడర్ వినెగార్లో పత్తి బంతిని నానబెట్టి, రోజుకు వీలైనన్ని సార్లు పురిపిర్లు మీద రాయండి. ఇలా 3 సార్లు రోజుకు రుద్దడం వలన

కొన్ని రోజుల్లో చర్మం యొక్క రంగు మారుతుంది అవి రాలిపోతాయి. కానీ మీరు ఆపిల్ సైడర్ వినెగార్ ని ఉపయోగించాడనికి ముందు చర్మం పరీక్ష చేసుకొని తరువాత వాడటం ఉత్తమం.

దీనిని ఒక దారంతో కట్టాలి: రక్తం సరఫరాను కత్తిరించడానికి పురిపిర్ల బేస్ చుట్టూ ఒక పత్తి దారం లేదా దంత ఫ్లోస్ తో కట్టాలి. ఇది సమయంతో పాటు రాలిపోతుంది.ఈ ప్రక్రియను ముడివేయడం అని కూడా పిలుస్తారు.

English summary

3 Safe And Natural Remedies To Remove Skin Tags During Pregnancy

Skin tags during pregnancy are annoying. These pesky little flesh bulbs are a nuisance to your appearance. And if they happen to rub against your skin or clothes, they can be oh so painful! The only saving grace is that they are not harmful for you or your baby. So however much you may want to get rid of them, hold on till childbirth.
Subscribe Newsletter