For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుక్కలకూ స్నానాలు చేయించాలి, ఎలా చేయించాలో తెలుసా, ఆ సయమంలో వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

|

పెంపుడు కుక్క ఉన్న ప్రతి ఒక్కరు ఆ కుక్కను తమ బెస్ట్ ఫ్రెండ్ వలె భావిస్తారు. ఎందుకంటే, విశ్వాసానికి మాత్రమే కాదు స్నేహానికి కూడా మారుపేరుగా ఉంటాయి పెంపుడు కుక్కలు. కొందరైతే తమ జీవితాన్ని వాటికే అంకితం అన్నట్లుగా జీవిస్తుంటారు.

కుటుంబంలో ఒకటిగా మారిపోయే ఈ పెంపుడు కుక్కలు ప్రేమ, స్నేహానికి మారుపేరుగా ఉంటాయి. క్రమంగా వాటితో సమయాన్ని వెచ్చించడం ద్వారా ఇతర బాధలను మర్చిపోయి మానసిక ప్రశాంతత తోడయ్యేలా తోడ్పాటునందిస్తాయి. ఇంటికి వెళ్ళగానే కాలి చుట్టూ చేరి అవి చేసే అల్లరిని ఆస్వాదించే వాళ్లకు తెలుసు ఆ ఆనందం ఎలాంటిదో. తమ జీవితాన్ని యజమాని కోసమే అంకితం అన్నట్లు జీవించే పెంపుడు కుక్కలను అనారోగ్యం బారిన పడకుండా సురక్షితంగా కాపాడుకోవడం మన కనీస బాద్యత.

పెంపుడు కుక్కతో సహవాసం అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, ఒక పెంపుడు కుక్కను కలిగి ఉండడమనేది ఖచ్చితంగా అదనపు బాధ్యతగా ఉంటుంది. పెంపుడు కుక్కలకు సాధారణంగా ప్రత్యేకమైన నిర్వహణ అవసరంగా ఉంటుంది. మీరు చూపించే శ్రద్ద ప్రేమ ఆధారితంగా అవి మీకు ఉత్తమ స్నేహితులుగా మారగలవు.

మీరు ఒక కుక్కకు యజమానిగా ఉన్నట్లయితే, మీకు వాటి నిర్వహణ గురించిన పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. ఏది ఏమైనా, ప్రతిరోజు వాటికి స్నానం చేయడం అంటే జరగని పని. అవునా ?

క్రమంగా రెండు స్నానాల మద్య సమయంలో వాటి విసర్జనల కారణంగా ఏర్పడే దుర్వాసనలను నివారించడం గురించిన అవగాహన ఉండాలి. అన్ని సమయాల్లో మీ ఉత్తమ స్నేహితుని దుర్వాసన నుండి దూరంగా ఉంచేందుకు గల చక్కని పరిష్కారాలను ఇక్కడ పొందుపరచబోతున్నాము. క్రమంగా వాటికి స్నానం చేయడం కుదరలేదని ఆందోళన చెందకుండా, ధైర్యంగా ఉండవచ్చు. పైగా అవి తాజా అనుభూతికి కూడా లోనవుతాయి.

How To Keep A Dog From Smelling In Between Baths

1) వాటి చర్మాన్ని తరచుగా బ్రష్ చేయండి :

మీరు విన్నది నిజమే. కుక్కలు, పిల్లులు తమ చర్మాన్ని బ్రష్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడుతాయి. దీనికి పెద్ద సమయం కూడా పట్టదు, పైగా అవి మీ ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదించగలుగుతాయి మరియు మీ బంధం గట్టిపడుతుంది. తరచుగా బొచ్చుతో కూడిన వాటి చర్మాన్ని బ్రష్ చేయడం ద్వారా, వాటి జుట్టు మీద ఉండే దుమ్ము అధిక శాతం తొలగిపోవడంతో పాటు, ఊడిపోతున్న వెంట్రుకలను తొలగించడం సాధ్యమవుతుంది. క్రమంగా దుర్వాసనను దూరం చేయవచ్చు. అంతేకాకుండా ఈ ప్రక్రియ, వాటి బొచ్చును ఆరోగ్యకరంగా మరియు మెరిసేలా ఉంచుతుంది. తరచుగా బ్రష్ చేయడం ద్వారా, రాలిపోతున్న జుట్టు నివాస స్థలంలో ఎక్కువగా లేకుండా కూడా చూసుకోవచ్చు. కానీ బ్రష్ చేసేందుకు వీలయ్యేలా, మృదువైన మరియు విశాలమైన దువ్వెనను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

How To Keep A Dog From Smelling In Between Baths

2) వాటి దంతాలనును శుభ్రంగా ఉంచండి :

ఒక తాజా శ్వాస తక్షణమే మిమ్ములను తాజా అనుభూతి గురిచేస్తుందా ? ఇదే మీ ఫర్రి స్నేహితునికి కూడా వర్తిస్తుంది. ఇంతవరకు మీరు మీ కుక్క నోటి పరిశుభ్రతపై ఆసక్తిని చూపకపోతే, ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని నిర్ధారించుకోండి. మీ పెంపుడు కుక్క దంతాలకు మంచి స్క్రబ్బింగ్ ఇవ్వడం ద్వారా గిన్గివిటిస్ సమస్యలు మరియు చెడు శ్వాస నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

How To Keep A Dog From Smelling In Between Baths

3) వాటి చెవులను తరచుగా శుభ్రపరచండి :

ఇది కొంచం ఆశ్చర్యగొల్పేదిగా ఉన్నా, నిజం. వాటి చెవులను శుభ్రం చేయడం ద్వారా తక్షణమే వాటి నుండి చెడు వాసనను తొలగించడానికి సహాయం చేస్తుంది. వారి చెవులను శుభ్రం చేయకపోవడం మూలంగా అది దుర్వాసనకు తరచుగా బాధ్యత వహిస్తుంది. చెవులను శుభ్రం చేసే ప్రక్రియలో, కాటన్ బాల్స్, బేబీ ఆయిల్ ఉపయోగించడం ఉపయోగకరంగా ఉంటుంది. ఏదేమైనా కూడా ఇయర్ బడ్స్ వినియోగించకూడదని నిర్ధారించుకోండి. మీరు వాటి చెవిలో ఎంత దూరం వెళ్తున్నారు అనేది మీకు అర్ధం కాదు కాబట్టి., ఏమాత్రం వాటి అంతర్గత భాగాలకు తగిలినా అవి నొప్పిని అనుభవించవలసి ఉంటుంది. కావున ఇయర్ బడ్స్ ని వినియోగించకండి.

How To Keep A Dog From Smelling In Between Baths

4) వాటి పరుపులను లేదా పడక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచండి :

మీ పెంపుడు కుక్క మరియు మీరు ఇద్దరూ మంచి పరిశుభ్రతను పాటించడం అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పబడుతుంది. మీ పెంపుడు కుక్క నిద్రించే పరుపు అనేక రకాల జెర్మ్స్, టిక్స్ మరియు కొన్ని దుర్వాసనలకు ఇల్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ కుక్కని శుభ్రపరిచే క్రమంలో భాగంగా, దాని పడకను శుభ్రపరుస్తున్నప్పటికీ, మీ ప్రయత్నాలు తరచుగా విఫలం అవ్వొచ్చు. కావున అత్యంత కీలకమైన ఈ దశను దాటకుండా నిర్వహించగలగాలి. వాటి పడకను శుభ్రపరచడంలో సమర్థవంతమైన చిట్కాగా ఆపిల్ సైడర్ వెనిగర్ వినియోగం ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ¼ కప్పును వినియోగించి తరచుగా శుభ్రంచేయడం ద్వారా, దుర్వాసనని తటస్తం చేయడానికి మరియు సుదీర్ఘకాలం మీ పెంపుడు కుక్కను శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుంది.

How To Keep A Dog From Smelling In Between Baths

5) బేకింగ్ సోడాతో డ్రై బాత్ ఇవ్వండి :

సాధారణ స్నానాలకు, పొడి స్నానాలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. ఇది మీ శ్రమను కూడా కాస్త తగ్గిస్తుంది. అదేవిధంగా మీ పెంపుడు కుక్కను దుర్వాసన నుండి కూడా దూరంగా ఉంచుతూ, తాజా అనుభూతిని ప్రేరేపిస్తాయి. కేవలం వాటి మీద ఉండే బొచ్చు మీద, బేకింగ్ సోడా చల్లుతూ, మీ అరచేతులు లేదా ఒక మృదువైన బ్రష్ సహాయంతో మసాజ్ వలె రుద్దడం ద్వారా ఈ పొడి స్నానం చేయవచ్చు. కొంతసేపు అలాగే ఉంచిన తర్వాత, దువ్వెన లేదా టవల్ వినియోగించి, శుభ్రపరచండి. ఈ పద్దతి, మీ కుక్కను అప్పుడే స్నానం నుండి బయటికి వచ్చినట్లుగా తక్షణ తాజాదనాన్ని అందిస్తుంది. ఈ పద్దతి మీ పెంపుడు కుక్క జ్వరంతో బాధ పడుతున్నప్పుడు, లేదా స్నానానికి దూరంగా ఉండాల్సిన పరిస్తితులు తలెత్తినప్పుడు చక్కగా ఉపయోగపడుతుంది.

How To Keep A Dog From Smelling In Between Baths

6) వాటి బొమ్మలను, మరియు పట్టీలను కూడా తరచుగా శుభ్రంచేయండి :

ఖచ్చితంగా ప్రతిరోజూ మీ పెంపుడు కుక్కకు స్నానమును ఇవ్వలేకపోవచ్చు కానీ వాటి దుర్వాసనను తొలగించడానికి వాటి బొమ్మలు మరియు పట్టీలు వంటి వస్తువులను శుభ్రం చేయడానికి మాత్రం కొంత సమయం వెచ్చించడం మంచిది. నిరంతరం ఏదో ఒక పనిలో లేదా ఆటలలో ఉండే మీ పెంపుడు కుక్కలు తరచుగా మురికిబారిన పడుతూ ఉంటాయి. కావున వాటి బొమ్మలు మరియు పట్టీలను తరచుగా శుభ్రం చేయడం మంచిదిగా సూచించబడుతుంది.

How To Keep A Dog From Smelling In Between Baths

7) వాటి పాదాలను తరచుగా శుభ్రం చేయండి :

పెంపుడు కుక్కలు తరచుగా ఆరుబయట వెలుపల ఆడటానికి ఇష్టపడుతాయి. మనం ఎంతగా అలిసిపోయినా కూడా వాటితో ఆడుకోవడానికి వెనుకడుగు వేయలేము, క్రమంగా వాటితో పాటు తరచుగా బయటకు వెళ్ళడం పరిపాటిగా ఉంటుంది. కానీ అవి మనకు వలె పాదరక్షలను ధరించవు. కావున, బయట ఆడుకుని తిరిగి వచ్చిన తర్వాత వాటి పాదాలను శుభ్రం చేయడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇప్పుడు కొందరు సాక్సులు వేయడం, లేదా పాదరక్షలను కొనడం కూడా చేస్తున్నారు. ఈ ప్రక్రియ, మీ ఇంటి లోపలికి బయట మురికిని తీసుకురాకుండా కాపాడుతుంది. క్రమంగా మీ కుక్క కూడా దుర్వాసన నుండి దూరంగా ఉండగలుగుతుంది.

How To Keep A Dog From Smelling In Between Baths

8) అనారోగ్యకరమైన వాతావరణాలలో పెంపుడు జంతువుల వైప్స్ ఉపయోగించండి :

ఈ పెట్ వైప్స్ తరచుగా ఉపయోగిస్తూ, వాటిని శుభ్రం చేయడం ద్వారా అవి తాజా అనుభూతికిలోనై రోజంతా చురుకుగా ఉండగలవు. తరచుగా వైప్స్ లో ఫ్లేవర్స్ మార్చడం కూడా మంచిది. బేబీ వైప్స్, పెట్ వైప్స్ ఒకటి కాదని గుర్తుంచుకోండి.

How To Keep A Dog From Smelling In Between Baths

9) వెనిగర్ మరియు నీళ్ళ మిశ్రమం :

వెనిగర్ మరియు నీళ్ళను సమపాళ్లలో కలిపి, స్ప్రే వలె వాటిమీద చల్లడం ద్వారా అవి దుర్వాసనకు దూరంగా ఉండగలవు.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు మీ పెట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం కూడా మంచిది. ఒక్కోసారి, కొన్ని రకాల వాసనలను అనారోగ్యాలను కూడా సూచించగలవు. క్రమంగా వాటికి టీకాలు, వాక్సీన్లు వేయడం ద్వారా వాటిని అనారోగ్యాల బారిన పడకుండా కాపడగలరు. మరియు మీ పెంపుడు కుక్క మీద మీరు తీసుకునే శ్రద్దను అనుసరించి, కుటుంబ ఆరోగ్య వాతావరణం కూడా ఆధారపడి ఉంటుందని మరువకండి. వాటిని నిర్వహించేటప్పుడు, మీ కుటుంబ సభ్యులు బాక్టీరియా బారిన పడకుండా ఉండేందుకైనా, వీటి శుభ్రత ప్రకారం జాగ్రత్తలు తప్పనిసరి. ఏదిఏమైనా వారానికి కనీసం 2 సార్లు మీ పెట్స్ ఆరోగ్యం మీద దృష్టి సారించి వాటి స్నానానికి సమయం కేటాయించడం ఉత్తమం. పైన చెప్పిన చిట్కాలన్నీ, ప్రత్యామ్నాయాలు మాత్రమే అని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

కుక్కలకూ స్నానాలు చేయించాలి, ఎలా చేయించాలో తెలుసా, ఆ సయమంలో వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

How To Keep A Dog From Smelling In Between Baths
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more