For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నుదుటి మీద చర్మం వదులుకాకుండా కాపాడే సహజ సిద్దమైన చిట్కాలు !

నవ్వు మరియు కోపం వంటి భావ వ్యక్తీకరణలలో కూడా కండరాల కదలికలలో అధికంగా మార్పులను కలిగించడం ద్వారా, ముడుతలు చేరి చర్మం వదులుగా అయ్యేందుకు భాద్యత వహిస్తాయి. అలాగని నవ్వు, కోపం వంటి భావ వ్యక్తీకరణలను దూరం

|

నుదుటిపైన చర్మం ఒక్కోసారి వదులుగా తయారవుతుంది. ఇది కండర కణజాలాలు బలహీనపడడం వలన సంభవిస్తుంది. ఈ సమస్య వృద్ధాప్యం ఫలితంగా ముడతలు ఏర్పడడం మూలంగానే కనిపించవలసిన అవసరం లేదు. వాస్తవానికి చర్మంపై ముడతలు అనేవి, కేవలం వయస్సు ప్రభావం వలనే కాకుండా, అనేక ఇతర కారణాల వలన కూడా సంభవిస్తుంది.

యుక్త వయసులో కూడా ఈ సమస్య తలెత్తడానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలుగా ఒత్తిడి, జన్యు వారసత్వం, జీవన శైలి, అధిక మేకప్, ముఖ కవళికలను అధికంగా ప్రదర్శించడం మొదలైనవిగా ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే.

నవ్వు మరియు కోపం వంటి భావ వ్యక్తీకరణలలో కూడా కండరాల కదలికలలో అధికంగా మార్పులను కలిగించడం ద్వారా, ముడుతలు చేరి చర్మం వదులుగా అయ్యేందుకు భాద్యత వహిస్తాయి. అలాగని నవ్వు, కోపం వంటి భావ వ్యక్తీకరణలను దూరం చేయడం అంటే జరగని పని.

ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్న వారు తరచుగా సహజ సిద్దమైన నివారణల కోసం చూడడం పరిపాటిగా ఉంటుంది. అవునా? ఒకవేళ మీరే భాదితులు అయితే, ఈ వ్యాసంలో పొందుపరచబడిన 15 ఉత్తమ సహజసిద్ద నివారణలు, మీ చర్మానికి హాని కలిగించకుండా సమస్యను నివారించడంలో మీకు ఎంతగానో సహాయం చేయగలవు.

1. మీ జీవనశైలిని మెరుగుపరచండి :

ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి దాదాపు ప్రతి సమస్యకు ఒక చక్కని పరిష్కారంగా ఉంటుంది. అదేవిధంగా, మీ జీవనశైలిలోని ఆరోగ్యకరమైన మార్పులు మీ వదులైన చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకుని రావడంలో సహాయం చేస్తుంది. అదనపు ఒత్తిడి లేదా ఆందోళనలను తగ్గిస్తుంది. విటమిన్లు, మినరల్స్ తో కూడిన మంచి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, సరైన మోతాదులో శరీరానికి నీటిని అందివ్వడం ద్వారా మంచి జీవన శైలికి తోడ్పాటుని అందివ్వవచ్చు. ముఖ్యంగా విటమిన్ A, C మరియు E లతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, నుదిటిమీద ముడుతలను మరియు వదులైన చర్మాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

2. నుదురు మసాజ్ :

మసాజ్ అనేది చర్మాన్ని బిగుతుగా చేయడానికి సూచించదగిన పురాతన పద్దతులలో ఒకటిగా చెప్పబడుతుంది. ఇది మీ ముఖ కణజాలంలో రక్త ప్రసరణను మెరుగుపరచి, వదులు చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయం చేస్తుంది. దీని కోసం పార్లర్ల చుట్టూ తిరగనవసరం లేదు. మీ ఇంట్లోనే మీ నుదుటికి చక్కటి మసాజ్ను అందివ్వవచ్చు.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

నుదుటి మసాజ్ చేసే పద్దతి :

కొన్ని చుక్కల ఆలివ్ నూనెను తీసుకుని, శాంతముగా 8 నుండి 10 నిమిషాలు పైకి కిందకి వేళ్ళను కదిలిస్తూ, నుదిటిపై మసాజ్ చేయండి. ఉత్తమ ఫలితాలను పొందేందుకు ప్రతిరోజూ కనీసం ఒకటి లేదా రెండుసార్లు దీన్ని అనుసరించండి. ఆలివ్ నూనె తేమను పెంచడంలో సహాయపడుతుంది మరియు చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. క్రమంగా ముడుతలను కలిగించే కణాలను సైతం తగ్గిస్తుంది.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

3. సూర్యకాంతికి ఎక్కువ బహిర్గతం కాకండి :

సూర్యరశ్మికి ఎక్కువగా బహిర్గతం కావడం మూలాన, మీ చర్మం దెబ్బతినడానికి గల ఆస్కారాలు పెరుగుతాయి. క్రమంగా నుదిటి మీద ముడుతలు సైతం పెరుగుతాయి. కావున, వెలుపలకు వెళ్ళేటప్పుడు, రెగ్యులర్ సన్స్క్రీన్ వాడకం, లేదా మాస్క్ వంటివి వినియోగించడం మంచిది. క్రమంగా హానికరమైన కిరణాలు మరియు సూర్యుని వేడిమి మీ చర్మాన్ని దెబ్బతీయకుండా కాపాడవచ్చు.

4. పెట్రోలియం జెల్లీ :

దాదాపు ప్రతి ఇంటిలోనూ కనిపించే పెట్రోలియం జెల్లీ (ఉదాహరణకు వాజిలీన్) చర్మాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. కావున, మీ నుదుటి మీద కొంత మొత్తంలో పెట్రోలియం జెల్లీని వర్తించి, 5 నిమిషాల వరకు వృత్తాకారంలో మసాజ్ వలె చేయండి. ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే ముందు అనుసరించండి, కొన్ని వారాల్లోనే మెరుగైన వ్యత్యాసాన్ని గమనించవచ్చు. అయితే, ఈ పరిహారం మొటిమలకు గురయ్యే చర్మ రకాల కొరకు సిఫార్సు చేయబడదు. ఎందుకంటే పెట్రోలియం జెల్లీ మొటిమలను కలిగించే కణాల ఉత్పత్తిని పెంచవచ్చు.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

5. ఎగ్ వైట్ మాస్క్ :

గుడ్డులోని కొల్లాజెన్ మరియు ప్రోటీన్లు చర్మాన్ని బిగుతుగా చేయడంలో ఎంతగానో సహకరించగలవు. క్రమంగా వదులుగా ఉన్న చర్మాన్ని రిపేర్ చేయడంలో సహాయం చేయగలదు. ఒక గుడ్డు నుండి తెల్ల సొనను వేరు చేసి, నుదుటిపై ఒక పొరలా వర్తించండి. తర్వాత 10 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత మోస్తరు నీటితో శుభ్రం చేయండి. మెరుగైన ఫలితాలను పొందేందుకు ప్రతిరోజూ ఈ పద్దతిని పునరావృతం చేయండి.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

6. తేనె :

తేనె చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడే ఏజెంట్లను కలిగి ఉంటుంది మరియు ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నేరుగా మీ నుదుటిపైన ముడి తేనెని దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మంచి ఫలితాలను పొందేందుకు బియ్యం పిండితో కలిపి వర్తించవచ్చు. బియ్యం పిండిలో ఉత్తమమైన అనామ్లజనకాల మొత్తాలు ఉంటాయి, ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేస్తాయి. 1 స్పూన్ బియ్యం పిండిలో 1 స్పూన్ ముడి తేనెను కలపండి. పేస్ట్ గట్టిగా ఉన్నట్లు భావిస్తే, మిశ్రమానికి మరింత తేనెని అనుగుణంగా చేర్చవచ్చు. మీ నుదుటి మీద మాస్క్ వలె వేసి, పూర్తిగా ఆరేవరకు ఉంచి, చల్లని నీటితో కడిగివేయండి. ఉత్తమ ఫలితాల కోసం వారంలో రెండు సార్లు అనుసరించండి.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

7. మీ నిద్రా భంగిమలను మార్చండి :

అవును, మీరు విన్నది నిజమే. బోర్లా తిరిగి పడుకోవడం కారణంగా, నుదుటి మీద దిండు ప్రభావం లేదా ఒత్తిడి అధికంగా ఉండడం వలన కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. కావున, వృద్దాప్య చాయలను నివారించుటకు, నిద్రా భంగిమలు కూడా పాత్ర పోషిస్తాయని మరువకండి. ఎక్కువగా వెల్లకిలా పడుకుని, మిలటరీ పొజిషన్ తీసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

8. యోగ :

ఇంతకు ముందు చెప్పినట్లుగా, మన ఒత్తిడి మరియు ఆందోళనలు నేటి యువతరానికి ప్రధాన శాపంగా పరిణమించాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. క్రమంగా ఇవి అకాల వృద్దాప్య చాయలకు కూడా హేతుకంగా మారాయి. యోగ అనేది ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలలో ఉత్తమంగా చెప్పబడుతుంది. ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను అందివ్వడమే కాకుండా చర్మం మీద ముడుతలు తగ్గించేందుకు దోహదం చేస్తుంది.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age
9. కొబ్బరి నూనె :
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయం చేయడంతో పాటు, ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మాన్ని అందివ్వడంలో సహాయపడే అనామ్లజనకాలను అత్యుత్తమంగా కలిగి ఉంటుంది. అంతేకాకుండా చర్మంలోని ఫ్రీ రాడికల్స్ ( స్వేచ్ఛా రాశులను) నివారించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది, క్రమంగా చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
మీ నుదుటి మీద కొన్ని కొబ్బరి నూనెను వర్తించి, అది మీ చర్మం పూర్తిగా శోషించేలా శాంతముగా మసాజ్ చేయండి. నిద్రకు ఉపక్రమించే ముందు, ప్రతిరోజూ దీన్ని అనుసరించడం ద్వారా కొన్ని వారాలలోనే భారీ వ్యత్యాసాన్ని చూడవచ్చు.
Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

10. సిట్రస్ ఫేస్ ప్యాక్ :

విటమిన్ సి మరియు ఇ ప్రధానంగా బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్ల జాతులలో కనిపిస్తాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు హైడ్రేటింగ్ గా ఉంచడంలో సహాయపడతాయి. నిమ్మకాయ మరియు నారింజ వంటి సిట్రస్ పండ్ల రసాన్ని మీ నుదుటిపై నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అది పూర్తిగా ఆరిన తర్వాత, వెచ్చని నీటితో కడగడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరు.
మరొక పద్దతిలో బియ్యం పిండిని, ¼ కప్ నారింజ పల్ప్ తో కలిపి, మీ నుదిటి మీద వర్తించడం కూడా చేయవచ్చు. 25 నిమిషాల తర్వాత మోస్తరు నీటితో ముఖాన్ని కడగండి. ఉత్తమ ఫలితాల కోసం వారంలో రెండు సార్లు పునరావృతం చేయండి.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

11. ముడుతల నివారణలో కలబంద :

అలోవేరాలో ఉన్న పునరుత్పత్తి ఏజెంట్, చర్మ సంరక్షణలో ఉత్తమంగా సహాయపడుతుంది. తద్వారా చర్మాన్ని మృదువుగా, మరియు డీహైడ్రేషన్ లేకుండా ఉంచడంలో సహాయం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం మీ ముఖం కడుక్కోవటానికి ముందు మరియు పడకకు ఉపక్రమించే ముందు మీ నుదురు మీద కొంత కలబంద గుజ్జును వేసి మసాజ్ చేయండి. 15 నిముషాలు పొడిగా ఉండనిచ్చిన తర్వాత, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి. మీ చర్మం మామూలు స్థితికి వచ్చే వరకు ప్రతిరోజూ ఈ పద్దతిని అనుసరించండి.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

12. ఓర కంటితో చూడడం లేదా మెల్ల కన్ను మాదిరి కళ్ళను ఉంచడం (స్క్విన్టింగ్) :

మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నట్లయితే మీరు తక్షణమే ఈ అలవాట్లను నివారించండి. ఈ అలవాట్లను చింగలించి చూడడం అని కూడా వ్యవహరిస్తుంటారు. కళ్ళతో చేసే ఈ ప్రయోగాలు, కండరాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపగలవు. తద్వారా నుదిటి ముడుతలకు కారణమవుతుంది. ఇటువంటి అలవాట్లను నివారించడానికి కళ్ళజోళ్ళ కొనుగోలు చేయడం మంచిది.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

13. మద్యపానం, ధూమపానం నివారించండి :

మద్యపానం మరియు ధూమపానం అనేవి చిన్న వయస్సులోనే నుదిటి మీద ముడుతలు కనిపించడానికి గల ఇతర కారణాలుగా ఉన్నాయి. వాటిలో ఉన్న హానికర పదార్ధాల కారణంగా వృద్ధాప్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కొల్లాజన్ను విచ్ఛిన్నం గావించి, చర్మం పగుళ్ళకు కారణమవుతుంది. క్రమంగా నుదిటి ముడుతలకు కారణమవుతుంది.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

14. మీ ముఖాన్ని హైడ్రేటెడ్ గా ఉంచండి :

మీ చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడం ద్వారా, ముడుతలను నివారించడానికి ఉత్తమంగా సహాయపడగలదు. చర్మం పొడిబారకుండా, తేమగా ఉండేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. క్రమంగా స్నానానికి కఠినమైన సబ్బులను వినియోగించకుండా, సాంప్రదాయక పద్దతులను అనుసరించేలా ప్రయత్నించండి. లేదా మీరు వినియోగిస్తున్న సబ్బులు మీ చర్మానికి ఎంతవరకు సరిపోతాయో మీ స్కిన్ డాక్టరును సంప్రదించి తెలుసుకోండి. ముఖాన్ని శుభ్రపరచేందుకు, వీలైనంత వరకు తక్కువ రసాయనాలు కల్గిన సబ్బులు, ఫేస్ వాష్లు లేదా సాంప్రదాయక పదార్ధాలను వినియోగించండి. ఇటువంటివి, మీ చర్మాన్ని ముడతల బారిన పడకుండా కాపాడగలవు. అంతేకాకుండా, చర్మాన్ని శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో భాగంగా తరచుగా పళ్ళ రసాలను, మంచి నీటిని, కూరగాయలను అనుసరించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీలయితే మీ మొబైళ్ళలో రిమైండర్లను అనుసరించి, నీటిని తీసుకునేలా ప్రణాళికలు చేసుకోండి.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age

15. కంటి నిండా నిద్ర అవసరం :

మిగిలిన శరీరం మాదిరిగానే, చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి కూడా సరైన నిద్ర అవసరంగా ఉంటుంది. నిద్ర లేకపోవడం కారణంగా చర్మ కణాల విచ్ఛిన్నానికి కారణమవుతుంది., ఇది నొసటి మీద ముడతలు కనిపించడానికి కూడా ఒక కారణం కావచ్చు. కనిష్టంగా ప్రతిరోజూ ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రను పొందటానికి ప్రయత్నించండి. క్రమంగా ఇది మీ ముఖం మీది ముడుతలను నివారించడంలో సహాయం చేయగలదు.

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age
అంతే కాకుండా క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకర జీవన శైలి, కాలుష్య కోరల బారిన పడకుండా సురక్షణా పద్దతులను అనుసరించడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, శుభ్రతను పాటించడం, ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికలను అనుసరించడం వంటివి కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి. శారీరికంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కావున అన్నిటా జాగ్రత్త తప్పనిసరి.
Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

నుదుటి మీద చర్మం వదులుకాకుండా కాపాడే సహజ సిద్దమైన చిట్కాలు !

Natural Ways To Fight Sagging Skin On Forehead At A Young Age
Desktop Bottom Promotion