For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంపై ఉండే మురికి, మృతకణాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు 10 ఉత్తమ మార్గాలు, పాటించి చూడండి

|

రోజూవారీ జీవన విధానంలో భాగంగా అధిక శాతం కలుషిత వాతావరణానికి మరియు సూర్యరశ్మికి శరీరాన్ని ప్రభావితం చేయడం జరుగుతుంటుంది. క్రమంగా చర్మం అధిక మోతాదులో మురికి బారిన పడుతుంటుంది. కాలక్రమేణా మీ చర్మం యొక్క ఉపరితల భాగాలలో మరియు చర్మ రంధ్రాలలో మృత కణాలు పేరుకోడానికి దారితీస్తుంది. క్రమంగా మొండి చర్మం, మొటిమల బ్రేక్అవుట్ మరియు వృద్ధాప్య చాయల అకాల సంకేతాలు వంటి వివిధరకాల దారుణమైన చర్మ సమస్యలకు దారితీస్తుంది.

ఇలా జరగకుండా నిరోధించడానికి, మీ చర్మం అన్ని వేళల్లో శుభ్రంగా మరియు ధూళి రహితంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, సౌందర్య దుకాణాలలో లభించే చర్మ-శుద్ది ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. దీనికి కారణం వీటిలోని అధిక మొతాదులోని రసాయనాలు. ఇవి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి.

కావున, చర్మం నుండి మురికిని, మరియు మృతకణాలను తొలగించే ప్రక్రియలో భాగంగా సహజసిద్దమైన నివారణా పద్ధతులను ప్రయత్నించడమే ఉత్తమమని, మరియు సురక్షితంగా కూడా ఉంటాయని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. పైగా, అవి మీ చర్మాన్ని కాలుష్య కారకాల నుండి కాపాడేందుకు అత్యంత సమర్థవంతమైనవిగా సూచించబడుతుంది.

ఇక్కడ, మీ చర్మం నుండి సహజసిద్దంగా మురికిని తొలగించడానికి వినియోగించదగిన టాప్ 10 చిట్కాలతో కూడిన జాబితాను పొందుపరచడం జరిగినది. అవి, మీరు కోరుకునే ఆరోగ్యకరమైన మరియు దోషరహిత చర్మాన్ని సాధించడంలో ఉత్తమంగా సహాయపడగలవు.

మీ చర్మం నుండి మురికిని మరియు మృతకణాలను పూర్తిస్థాయిలో తొలగించుటకు సూచించదగిన 10 ఉత్తమ మార్గాలు :

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

1. కాఫీ స్క్రబ్ :

కావలసిన పదార్ధాలు :

½ టీస్పూన్ కాఫీ గ్రౌండ్స్

1 టీస్పూన్ బాదం నూనె

4-5 డ్రాప్స్ టీ-ట్రీ ఆయిల్

పాటించవలసిన విధానం :

అన్ని పదార్ధాలను ఒక గిన్నెలోనికి తీసుకుని మిశ్రమంగా కలపాలి. మరియు తడి చేసిన చర్మంపై నలుదిక్కులా విస్తరించునట్లు మిశ్రమాన్ని అప్లై చేయండి. కొద్ది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. వారానికి కనీసం రెండు సార్లు అనుసరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరని చెప్పబడింది.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

2. పాలు మరియు ఉప్పు పేస్ట్ :

కావలసిన పదార్ధాలు :

1 టేబుల్ స్పూన్ పచ్చి పాలు

చిటికెడు ఉప్పు

పాటించవలసిన విధానం :

పదార్ధాలు రెండింటినీ మిళితం చేయండి. ఒక కాటన్ బాల్ తీసుకుని మీ ముఖం మీద నలువైపులా విస్తరించునట్లు వర్తించండి. ఒక పది నిమిషాలు అలాగే ఉండనిచ్చిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రపరచండి. వారంలో కనీసం ఒకసారైనా ఈ పద్దతిని అనుసరించిన ఎడల, మీ చర్మం శుభ్రంగా మరియు స్పష్టమైన ఉండేందుకు సహాయపడుతుంది.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

3. బాదం పొడి ప్యాక్ :

కావలసిన పదార్ధాలు :

½ టీస్పూన్ బాదం పొడి

అలోవేరా జెల్ 1 టేబుల్ స్పూన్

పాటించవలసిన విధానం :

బాదం పొడిని కలబంద మొక్క నుండి సేకరించిన గుజ్జుతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై వృత్తాకార వలయాకృతిలో నలువైపులా విస్తరించునట్లు వర్తించండి. 15 నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచండి. ఉత్తమ ఫలితాల కోసం, వారంలో కనీసం 2 మార్లు అనుసరించవలసినదిగా సూచించడమైనది. ఇది దుమ్ము లేదా మలినాల కారణంగా ఏర్పడిన అవాంచిత చ్చర్మ సమస్యలను నిరోధించడానికి మీ చర్మానికి చికిత్సలా ఉపయోగపడగలదు.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

4. ఆరెంజ్ పీల్ ప్యాక్ :

కావలసిన పదార్ధాలు :

చిటికెడు నారింజ తొక్క పౌడర్

2 టీస్పూన్లు రోజ్ వాటర్

పాటించవలసిన విధానం :

ఒక గిన్నెలో ఈ రెండు పదార్ధాలను తీసుకుని మిశ్రమంగా కలపండి. ఒక కాటన్ బాల్ తీసుకుని ఈ మిశ్రమాన్ని ముఖం మీద నలువైపులా విస్తరించునట్లు శాంతముగా వర్తించండి. 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉండనిచ్చిన తర్వాత, చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోండి. మీ చర్మంలో అంతర్గతంగా పేరుకుపోయిన మురికిని వదిలించుకోనే క్రమంలో భాగంగా ఈ మిశ్రమాన్ని వారంలో కనీసం రెండుసార్లు ఉపయోగించండి.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

5. వోట్మీల్ మరియు హనీ స్క్రబ్ :

కావలసిన పదార్ధాలు :

½ టీస్పూన్ ఓట్ మీల్

హనీ 1 టేబుల్ స్పూన్

పాటించవలసిన విధానం :

పైనపేర్కొన్న పదార్ధాలను ఒక గిన్నెలోనికి తీసుకుని మిళితం చేయండి. తర్వాత మీ ముఖం మరియు మెడ భాగాలలో పూర్తిస్థాయిలో నలువైపులా విస్తరించునట్లు వర్తించండి. కొన్ని నిమిషాల పాటు మసాజ్ వలె శాంతముగా స్క్రబ్ చేయండి. 5 నుండి 10 నిమిషాలు పొడిగా ఉంచిన పిదప, మంచి నీటితో శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం వారంలో కనీసం రెండు మార్లు అనుసరించవలసినదిగా సూచించడమైనది.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

6. ఆయిల్ మసాజ్ :

కావలసిన పదార్ధాలు:

1 టీస్పూన్ బాదం లేదా విటమిన్-ఇ నూనె

2-3 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

పాటించవలసిన విధానం :

పైన పేర్కొన్న రెండు పదార్ధాలను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడ ప్రాంతాల నందు, పూర్తిగా విస్తరించునట్లు అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు, వలయాకారంలో మసాజ్ చేసిన పిదప, వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచండి. వృద్దాప్య సమస్యలను నివారించడంలోనే కాకుండా, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో ఉపకరిస్తుందని చెప్పబడింది. ఉత్తమ ఫలితాలకోసం వారంలో కనీసం రెండుమార్లు అనుసరించవలసినదిగా సూచించడమైనది.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

7. అవోకాడో విత్తనాలు :

కావలసిన పదార్ధాలు:

1 టీస్పూన్ అవోకాడో విత్తనాలు

2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్

పాటించవలసిన విధానం :

అవోకాడో విత్తనాలను, ఆలివ్ నూనెతో కలపి, మిశ్రమంగా చేయండి. దీనిని మీ ముఖం మీద నలువైపులా విస్తరించునట్లు కొన్ని నిమిషాలపాటు శాంతముగా స్క్రబ్ చేయండి. 10నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఈ ఇంట్లో తయారుచేసిన స్క్రబ్ ను తరచుగా వినియోగించడం ద్వారా, చర్మాన్ని తాజాగా ఉంచడంతోపాటు చర్మ సమస్యలను దూరంచేయడంలో అత్యుత్తమంగా సహాయం చేయగలదు.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

8. టవల్ స్క్రబ్ :

కావలసిన వస్తువులు :

ఒక గిన్నెలో వేడినీళ్ళు

ఒక శుభ్రమైన టవల్

పాటించవలసిన విధానం :

వేడినీటిలో టవల్ ను నానబెట్టాలి. బాగా పిండిన తర్వాత, ఆ టవల్ ని ముఖం మీద ఉంచి శాంతముగా స్క్రబ్ చేయండి. అలా 5-10 నిమిషాలు కొనసాగించిన తర్వాత, వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచండి. మంచి ఫలితాలకోసం వారంలో 2 నుండి 3 మార్లు అనుసరించండి.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

9. పసుపు ప్యాక్ :

కావలసిన పదార్ధాలు :

చిటికెడు పసుపు పొడి

ఒక టీస్పూన్ కొబ్బరి నూనె

పాటించవలసిన విధానం :

ఈ రెండు పదార్ధాలను మిశ్రమంగా చేసి, ముఖం మరియు మెడ భాగాలలో పూర్తిగా విస్తరించునట్లు వర్తించండి. 5 నుండి 10 నిమిషాలు అలాగే ఉండనిచ్చిన తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి. చర్మంలో మురికి చేరడాన్ని నివారించడానికి వారంలో ఒకసారి అనుసరించండి. పసుపును ఎక్కువగా వాడడం ద్వారా చర్మం నెమ్మదిగా లేత పసుపురంగులోకి మారే అవకాశాలు ఉన్నాయి కావున, అనుసరించేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

10.గంధం ప్యాక్ :

కావలసిన పదార్ధాలు :

½ టీస్పూన్ గంధం పొడి.

2 టీస్పూన్లు రోజ్ వాటర్

పాటించవలసిన విధానం :

ఈ రెండు పదార్ధాలను మిశ్రమంగా చేసి, తడి చర్మంమీద నలువైపులా విస్తరించునట్లు ముఖం మరియు మెడ భాగాలలో పూర్తిస్థాయిలో వర్తించండి. 5 నిమిషాలు పొడిగా ఉంచిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేయండి. మీ చర్మంపై పేరుకుపోయిన ధూళి మరియు మృత చర్మ కణాల పెరుగుదలను నివారించడానికి దోహదపడే ఈ ప్యాక్, వారంలో రెండు సార్లు అనుసరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరని చెప్పబడింది.

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally

వీటితో పాటుగా మీ జీవన శైలి ప్రమాణాలు కూడా సవ్యంగా ఉండాలని నిర్ధారించుకోండి. ఎక్కువగా సూర్యరశ్మి, కాలుష్య కోరల బారిన పడకుండా, స్కాఫ్, ఆర్మ్ స్లీవ్స్, హెల్మెట్స్, పొల్యూషన్ మాస్క్స్ వంటివి వినియోగించడం, తరచుగా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవడం, శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండునట్లుగా పండ్లరసాలు, నీళ్ళు, కొబ్బరి నీళ్ళు వంటివి తరచుగా తీసుకోవడం, పీచు పదార్ధాలను తరచుగా మీ ఆహార ప్రణాళికలోనికి చేర్చుకోవడం, వ్యాయామానికి సమయం కేటాయించడం మొదలైనవి పాటిస్తున్నారని నిర్దారించుకోండి. జీవన శైలి ప్రమాణాలు సరిగ్గాలేని ఎడల, ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్ధమేనని గుర్తుంచుకోండి.

పైనచెప్పిన చిట్కాలు, సమస్యను తగ్గించడమే కాకుండా, చర్మాన్ని తేజోమయంగా చేయడంలో సహాయంచేస్తాయి. కావున మీ చర్మానికి తగినట్లుగా ప్యాక్ ఎంచుకుని అనుసరించవలసినదిగా సూచించడమైనది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

చర్మంపై ఉండే మురికి, మృతకణాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు 10 ఉత్తమ మార్గాలు, పాటించి చూడండి

Top 10 Ways To Remove Dirt From Your Skin Naturally
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more