For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరచుగా టీ తాగడం, మొటిమల సమస్యకు దారి తీస్తుందా ?

ఈ ప్రశ్న అనేకమందికి తలెత్తుతూనే ఉంటుంది. మొటిమల సమస్య తలెత్తిన పక్షంలో కెఫీన్ దానికి ప్రధాన కారణంగా చెప్తుంటారు అనేకమంది. వాస్తవానికి కెఫీన్, మీ అడ్రినాలిన్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. క్రమంగ

|

తాజా మరియు స్పష్టమైన, ప్రకాశవంతమైన చర్మం అనేది ప్రతి అమ్మాయి కలగా ఉంటుంది. కానీ కొన్ని ఊహించని ఇతర జీవనశైలి అంశాలు కూడా మొటిమల వంటి చర్మ సమస్యలకు కారణం అవుతుందని ఆలస్యంగా తెలిసినప్పుడు, ఒకింత ఆందోళనకు లోనవడం పరిపాటిగా ఉంటుంది. ఆ కారకాలలో టీ కూడా ఒకటిగా ఉంది అంటే ఆశ్చర్యం కలుగక మానదు. వాస్తవానికి టీ చర్మ ఆరోగ్యానికి సహాయం చేస్తుందా లేక, సమస్యలకు కేంద్రబిందువుగా ఉందా ? ఇప్పుడు ఈ వ్యాసంలో తెలుసుకుందాం. ముందుగా మొటిమల సమస్యకు గల కారణాల గురించి తెలుసుకుందాం.

Can Drinking Tea Cause Acne

మన సెబాషియస్ గ్రంధులు చమురు ఉత్పత్తికై అధిక సమయం పనిచేస్తున్న ఎడల, తరచుగా మొటిమల సమస్య తలెత్తడం జరుగుతుంటుంది. చమురు, మురికి, మృత కణాలు వంటివి హెయిర్ ఫోలికల్స్ వద్ద అవరోధాలుగా ఉన్న కారణంగా, అవి ఇన్ఫెక్షన్ లోనై, వికారమైన పరిస్తితికి దారితీస్తుంది. ఈ పరిస్థితి సాధారణంగా కౌమార దశలో హార్మోన్ల అసమతౌల్యం వలన సంభవిస్తుంది. కానీ మొటిమలు చర్మానికి వృద్ధాప్య చాయలను తీసుకునివస్తాయి. ఒత్తిడి, కాలుష్యం, నిద్ర లేకపోవడం మరియు అనారోగ్యకరమైన ఆహార ప్రణాళిక వంటివికూడా మొటిమల తీవ్రతకు కారకాలుగా ఉంటాయి.
ఆహార పదార్థాల పాత్ర

ఆహార పదార్థాల పాత్ర

కొన్ని తీవ్రమైన సమస్యలకు చర్మ వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది. ఇతర సమయాల్లో, ఆరోగ్యకర జీవనశైలి మార్పులు మరియు ఆహార సర్దుబాట్లను అనుసరించడం ద్వారా మొటిమల సమస్యను దూరం చేయవచ్చు. మొటిమల చికిత్సలో భాగంగా తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలలో ఆహార పదార్థాల పాత్ర తెలుసుకోవడం ముఖ్యంగా ఉంటుంది. క్రమంగా మొటిమల సమస్యకు టీ ఏవిధంగా కారకం అన్న అంశం మీద తరచుగా బ్యూటీషియన్ల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది.

టీ సేవించడం

టీ సేవించడం

అసలు టీ సేవించడం, మొటిమల సమస్యకు ఏవిధంగా కారణం అవుతుంది ? దీనివెనుక ఉన్న వాస్తవాలు, ఉపయోగాలు, దుష్ప్రభావాల గురించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది.

టీ సేవించడం మొటిమలకు కారణంగా ఉంటుందా ?

టీ సేవించడం మొటిమలకు కారణంగా ఉంటుందా ?

టీ సేవించడం మొటిమలకు కారణంగా ఉంటుందా ? ఇందులో ప్రధానమైన విషయం ఏమిటంటే, అది సేవించే టీ రకం మీద ఆధారపడి ఉంటుంది. పాలు మరియు చక్కెర కలిపిన టీ, చర్మ ఆరోగ్యానికి ఎట్టిపరిస్థితుల్లో మంచిదికాదని చెప్పబడింది. పాల ఉత్పత్తులు చర్మ సమస్యలకు దారితీస్తాయని మనకు తెలియనిది కాదు. పాలు సెబం ఉత్పత్తిలో కీలకపాత్రను పోషిస్తుంది. అధిక చమురు మొటిమలకు దారితీస్తుందని అందరికి తెలిసిన విషయమే, అంతేకాక పాలను జీర్ణించుకోవటం కూడా కష్టంగా ఉంటుంది. క్రమంగా అస్తవ్యస్త జీర్ణక్రియలు చర్మ అనారోగ్యాలకు దారితీస్తాయి.

Most Read :నా భర్త రాత్రి ఆ పని చేసేటప్పుడు వదన్నా వినడు, అందరి ముందు నటిస్తాడు, అసలు రూపం అదిMost Read :నా భర్త రాత్రి ఆ పని చేసేటప్పుడు వదన్నా వినడు, అందరి ముందు నటిస్తాడు, అసలు రూపం అది

కెఫీన్ మొటిమలకు కారణం అవుతుందా

కెఫీన్ మొటిమలకు కారణం అవుతుందా

సత్వర పరిష్కారం : టీ తీసుకోవడం పరిమితం చేయండి. చర్మ ఆరోగ్యానికి బ్లాక్ టీ లేదా గ్రీన్ టీని ప్రయత్నించి చూడండి. మెరుగైన ఫలితాలను సాధించగలరు.

కెఫీన్ మొటిమలకు కారణం అవుతుందా ?

ఈ ప్రశ్న అనేకమందికి తలెత్తుతూనే ఉంటుంది. మొటిమల సమస్య తలెత్తిన పక్షంలో కెఫీన్ దానికి ప్రధాన కారణంగా చెప్తుంటారు అనేకమంది. వాస్తవానికి కెఫీన్, మీ అడ్రినాలిన్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. క్రమంగా మాటలలో తడబాటు, అధిక ఒత్తిడి స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు కారణంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక నిద్రలేమికి కూడా దారితీస్తుంది. క్రమంగా ఇటువంటి సమస్యలన్నీ, మొటిమలకు ఖచ్చితంగా దారితీస్తాయి. ప్రత్యక్ష ప్రభావం లేకపోయినా పరోక్ష ప్రభావం అధికంగా చూపిస్తుంది కెఫీన్.

అధిక చక్కెరలు మొటిమల సమస్యకు దారితీస్తుందా ?

అధిక చక్కెరలు మొటిమల సమస్యకు దారితీస్తుందా ?

మీరు విన్నది నిజమే, రక్తంలోని అధిక చక్కర స్థాయిలు మొటిమల సమస్య తీవ్రం అయ్యేలా చేస్తుంది. మీరు చక్కెరలు అధికంగా కలిగిన ఆహారాలను తీసుకున్నప్పుడు, మీ శరీరం మరింత ఎక్కువ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ మొటిమల సమస్యకు దారి తీస్తుంది. తక్కువ మోతాదులో చక్కెరలు ఉన్న ఆహారాన్ని తీసుకున్న యువతలో మొటిమల తగ్గుదల గణనీయంగా కనిపించిందని అధ్యయనాలలో తేలింది

చక్కెరల మోతాదును

చక్కెరల మోతాదును

సత్వర పరిష్కారం: మీ టీలో చక్కెరల మోతాదును తగ్గించండి లేదా వీలయితే చక్కెరలను పూర్తిగా త్యజించండి. తక్కువ శుద్ధి చేసిన బ్రౌన్ షుగర్, లేదా తేనెకు మారడం వంద రెట్లు మంచిది. కృత్రిమ స్వీటెనర్లను నివారించండి ఎందుకంటే అవి వేరే ఇతరత్రా సమస్యలకు కారణం అవుతాయి!

చర్మ సౌందర్యానికి గ్రీన్ టీ ప్రయోజనాలు :

చర్మ సౌందర్యానికి గ్రీన్ టీ ప్రయోజనాలు :

పాలు చక్కెరలతో కూడిన టీ సేవించడం మొటిమలకు దారితీస్తుందని తెలుసుకున్నారు కదా, మరి గ్రీన్ టీ తీసుకోవచ్చా ?

నిస్సందేహంగా, గ్రీన్ టీ మీకొక గొప్ప ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది బరువు నష్టాన్ని ప్రోత్సహించడమే కాకుండా, చర్మ ఆరోగ్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, చర్మానికి దీర్ఘకాల రక్షణను అందిస్తుంది. అనగా ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తూ మొటిమల సమస్యను దూరం చేయగలదు.

Most Read :సెక్స్ కు సంబంధించి ప్రమాదకరమైన సూచనలు వీటిని నిర్లక్ష్యం చేయకండిMost Read :సెక్స్ కు సంబంధించి ప్రమాదకరమైన సూచనలు వీటిని నిర్లక్ష్యం చేయకండి

సౌందర్య ఆరాధకులు మాత్రం

సౌందర్య ఆరాధకులు మాత్రం

గ్రీన్ టీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి కొన్ని అధ్యయనాలు సైతం ఉన్నాయి. అయితే సౌందర్య ఆరాధకులు మాత్రం రోజులో 2 - 3 కప్పులు సేవించాలని సూచిస్తుంటారు. అధికంగా గ్రీన్ టీ తీసుకోవడం డీహైడ్రేషన్ వంటి సమస్యకు దారితీస్తుంది. కావున, పరిమితమోతాదులోనే ఉండాలని గుర్తుంచుకోండి.

చర్మం ఆరోగ్యానికి నిమ్మ లేదా తేనె, వంటి స్నేహపూర్వక పదార్థాలు జోడించి తీసుకోవడం మంచిది. గ్రీన్ టీ సంచులను ఉపయోగించి తయారుచేసే ఫేస్ ప్యాక్లు లేదా ఎక్స్పోలియన్ట్స్ కూడా బాగా ప్రసిద్ది చెందాయి. టీ తాగడం వలన మొటిమల సమస్య పెరుగుతుంది అన్న ఆలోచన ఉంటే, నిస్సంకోచంగా పాలు, చక్కెరలు లేని గ్రీన్ టీ కి మారొచ్చు.

మీకు నచ్చినట్లయితే

మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Can Drinking Tea Causes Acne?

Can Drinking Tea Cause Acne
Desktop Bottom Promotion