For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు వాడండి, అందంతో పాటు అనుకూలంగా ఉంటాయి

|

చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? అయితే మీ తర్వాతి హాలిడే ట్రిప్ కోసం ఎంచుకోదగిన చీరల రకాల గురించిన వివరాలను తెలుసుకోండి!

మీరు చీరలను ధరించడంలో ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారా, కానీ ఒకేరకమైన మోడల్స్ చూస్తూ విసుగు చెందారా ? ఏదైనా ఫంక్షన్ లేదా, హాలిడే వెళ్తున్నప్పుడు భిన్నరకాలలో చీరలను ధరించాలని భావిస్తున్నారా ? అయితే మీ తదుపరి కలెక్షన్స్ కోసం కొన్ని ప్రత్యేకమైన చీరల రకాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

అనగా చీరలను ఎంచుకునేటప్పుడు సాంప్రదాయక పోకడలు పక్కకు వెళ్ళకుండా, మరో పక్క ప్రయాణానికి అనువుగా ఉండేలా కూడా ఎంచుకోవలసి ఉంటుంది అవునా ? ఒకవేళ మీ భావన అదే అయితే, మీకోసమే ఈ వ్యాసం.

ప్రయాణాలకు ఉపక్రమించినప్పుడు, బహుశా మీరు సాంప్రదాయిక చీరల రకాల నుండి మీ దృష్టిని మార్చాలని భావిస్తుండవచ్చు. మరియు సమకాలీన సాంప్రదాయక చీరలకు బదులుగా వీటిని ఎంచుకోవలసి ఉంటుంది. సంవత్సరాలుగా, అనేక మంది డిజైనర్లు మోడర్న్ జెట్ సెట్టింగ్ మహిళల అవసరాలకు అనుగుణంగా చీరల రూపకల్పన చేస్తూ వస్తున్నారు. కొన్ని సందర్భాలలో సాంప్రదాయక భావన పక్కకు వెళ్ళకుండా, చీరలకు, పావడ(పెట్టీ కోట్స్), బ్లౌస్ లేకుండా కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది, ఆయా మోడల్స్ అనుసరించి. మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

పాంట్స్ తో కూడిన చీరలు :

పాంట్స్ తో కూడిన చీరలు :

పాంట్స్, డెనిమ్స్ ఉపయోగించి చీరలు ధరించడం అంటే ఉత్సుకతను కలిగి ఉండే మహిళల్లో మీరు కూడా ఉన్నారా ? అయితే మీకు ఈ అవకాశం ఉంది. మరియు ఈ రకం దుస్తులు ప్రయాణానికి అనువుగా ఉండడమే కాకుండా సాంప్రదాయక పోకడలను అనుసరించేలా కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన కాంబినేషన్, మీకు చీర ధరించిన లుక్ ఇస్తూనే, మీకు నచ్చేలా జీన్స్ ధరించడానికి అనుమతిస్తుంది. వినడానికి చాలాబాగుంది కదా. మరెందుకు ఆలస్యం, ఎటువంటి మోడల్స్ మీద ఒక లుక్ వేయండి మరి.

చీరకు బెల్ట్ ధరించడం :

చీరకు బెల్ట్ ధరించడం :

పల్లుతో సమస్యల కారణంగా, కొందరికి చీరలను ఎక్కువసేపు ధరించడం నచ్చదు. ఫంక్షన్ లేదా, సమావేశం పూర్తైన వెంటనే చీరను పక్కకు తోసి, సాధారణ దుస్తుల్లోకి వచ్చేస్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు, లేదా ధరించడంలోని లోపాల కారణంగా పల్లు జారిపోయే సమస్యలు తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ సులభమయిన ట్రిక్ ఉంటుంది. ఎటువంటి సందర్భంలో అయినా, పల్లు జారకుండా ఉండేలా బెల్ట్ ధరించడం ఉత్తమంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది ఒక అందమైన అంచును కూడా ఇస్తుంది. మీ పల్లు కూడా సరిగా బెల్ట్ కింద ఉంచినట్లు ఉంటుంది. క్రమంగా, మీరు స్వేచ్ఛగా నడవగలిగేలా మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన ఆకర్షణతో నిలబడగలరు.

కాన్సెప్ట్ సారీ :

కాన్సెప్ట్ సారీ :

మీరు సాధారణంగా ఒక ధోటీ చీరని కూడా ధరించవచ్చు. ధోటీ చీరలు ముందుగానే స్ట్రిచ్ చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, మీరు ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుని కనిపిస్తారు, మరియు చీర ధరించే భావాలను స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ చీరలు ఒక సామాన్య చీరల వలెనే పల్లును కలిగి ఉంటాయి కానీ ప్లీట్స్, ధోటిని పోలి ఉంటాయి. అదేవిధంగా, పాలాజ్జో చీరలు కూడా ఒక గొప్ప ఎంపికగా ఉండగలవు., ఇక్కడ పెట్టికోట్ (పావడ)కు బదులుగా మీరు పాలాజ్జో ప్యాంటు ధరించడం జరుగుతుంది. మరియు పల్లూ మీకు కావలసిన విధంగా తీయవచ్చు.

పూర్తి అలంకారప్రాయంగా, మోడర్న్ లుక్ :

పూర్తి అలంకారప్రాయంగా, మోడర్న్ లుక్ :

గత ప్రయాణాలతో పోల్చినప్పుడు, మీకు మరింత ఆకర్షణగా అల్ట్రా మోడల్ లుక్ ఇవ్వాలని భావించిన ఎడల, మీకు సూచించదగిన ఉత్తమ ఎంపికగా ఈ రకం ఉంటుంది. కానీ మీ అభిరుచిని బట్టి, మీరు కొన్ని ప్రయాణానికి అనువుగా చీరలను ప్యాక్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. ఈ చీరలు ప్రింట్లు మరియు శక్తివంతమైన రంగులతో ఉండేలా ఎంచుకోవచ్చు. లేదా సాదాసీదా రంగులలో కూడా అద్భుతమైన రూపాన్ని పొందవచ్చు.

Most Read : నాతో సరసాలాడి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోమంది, అబ్బాయిలు ఈజీగా ప్రేమలో పడరు, ఈజీగా మరిచిపోలేరు

బోల్డ్స్కై పేజీని అనుసరిస్తూ

బోల్డ్స్కై పేజీని అనుసరిస్తూ

మీ ప్రయాణానికి ఎటువంటి చీరను ఎంచుకోదలిచారు ? మీ వ్యాఖ్యలను అభిప్రాయాలను క్రింది విభాగంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం బోల్డ్స్కై పేజీని అనుసరిస్తూ ఉండండి.

English summary

Types of Saris for Travelling

Sari Lovers, Here Are The Type Of Saris That You Must Pack For Your Next Vacay
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more