For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్ని.. మీరే చంపుకోవద్దు???

|

Bad Habits after Meal is equal to Suicide
ఉరుకుల పరుగుల జీవితంలో భాగంగా మానవాళి రకరకాల పనులలో నిమగ్నమై ఉంటుంది. దినచర్యల్లో భాగంగా రోజు ప్రతి ఒక్కరికి ఆహారం తప్పనిసరి, ప్రాంతాలవారీగా ఈ ఆహార అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో రోజు రెండుపూటలైన భోజనం చేస్తుంటారు. దైనందిన కార్యకలపాల్లో భాగంగా పలువురు తమ ఆరోగ్యానికి కీడును తలపెట్టే వ్యసనాలకు భానిసలవుతుంటారు. ఇలా చేయటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా భోజనం చేసిన తరువాత ఈ విధమైన చర్యలకు పూనుకోకూడదు...

టీ తాగొద్దు: భోజనం చేసిన వెంటనే 'టీ' తాగకూడదు, టీ వల్ల కుడుపులో వ్యాప్తి చెందే 'ఆసిడ్' మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం కాకుండా చేస్తుంది.

ధూమపానానికి దూరంగా ఉండండి:
భోజనం చేసిన తరువాత ధూమపానం చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు భేషుగ్గా ఉంటాయట. ముఖ్యంగా పొగరాయుళ్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

నిద్రపోకండి:
చాలా మందికి భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం అలవాటు. తినగానే పవళించటం వల్ల ఆహారం అరగక 'గ్యాస్ట్రిక్' ఇబ్బందులు తలెత్తుతాయట. అంతేకాదు పొట్టకూడా పెరుగుతుందట. అయితే భోజనం అనంతరం నిద్రను 15 నిమిషాల్లోపు ముగించుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.

పళ్లు తినకండి: బో్జనం చేసిన వెంటనే చాల మందికి పండ్లను తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. భోజనం తీసుకున్న వెంటనే పళ్లను ఆరగించటం వల్లన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. పళ్లు తినే అలవాటున్న వారు భోజనానికి రెండు గంటలు ముందుగాని, చేసిన రెండు గంటల తరవాత గాని తినటం మంచింది.

తిన్న వెంటనే స్నానం చేయ్యేద్దు: భోజనం పూర్తి చేసిన వెంటనే స్నానం చెయ్యకండి. తిన్న వెంటనే స్నానం చేయ్యటం వల్ల పొట్ట భాగంలో రక్త ప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం నశిస్తుంది.

English summary

Bad Habits after Meal is equal to Suicide | మిమ్మల్ని.. మీరే చంపుకోవద్దు???

Generally after a meal you do? Smoking, eating fruit, Gucci Handbag, tea, bath, adidas shoes, or loose belt, singing, walking, sleep? If you have more than one meal or more are used to, alert, and these details of life is the murder of your health!
Story first published:Thursday, October 27, 2011, 14:06 [IST]
Desktop Bottom Promotion