Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
కళ్ళ విషయంలో జర జాగ్రత్త సుమీ..!
కళ్ళ విషయంలో జర జాగ్రత్త సుమీ..!

కంటికి జబ్బు చేసిందంటే మనకు ముందుగా కళ్ళలో మంట, కంటి వెంట నీరు కారడం, కళ్ళు అంటుకుపోవడం, వాపు రావడం, కళ్ళు ఎర్రబడటం, పుసులు కట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్ళు. అటువంటి కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందమైన కళ్ళు కావాలంటే డాక్టర్ సలహా లేకుండా లోషన్స్ గానీ, ఆయిల్స్ గానీ వాడరాదు. కళ్ళు చుట్టూ పేస్ పేక్‌లు, మాస్క్‌లు, పవరుగల ఆస్ట్రిజెంట్స్ వాడరాదు.
కంటి చుట్టుప్రక్కల ప్రదేశంలో గోకటంగానీ, రబ్ గానీ చేయరాదు.తక్కువ కాంతితో గానీ, ఎక్కువ కాంతిలోగానీ చదవరాదు. చిన్న అక్షరాలు చదవటం వల్ల మన కళ్ళు అలసట చెందగలవు. అందువల్ల చిన్న అక్షరాలు చదవకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే అందరూ కూడా ఎక్కువ టీ.వి.ని చూడటానికి ఇష్టపడుతున్నారు. ఎక్కువగా టీ.వి. చూడడం కూడా మన కళ్ళకు మంచిదికాదు.
ఇక మగవారి విషయానికి వచ్చినట్లయితే వారు పొగ ఎక్కువగా త్రాగుతూ ఉంటారు. పొగ ఎక్కువగా త్రాగటం వల్ల విటమిన్ 'సి' లోపించి కళ్ళు చుట్టూరా నల్లని చారలు ఏర్పడగలవు. పొత త్రాగటం తగ్గించుకున్నట్లయితే కళ్ళ క్రింద ఏర్పడే నల్లటి చారలు కూడా తగ్గించు కోవచ్చు. తద్వారా కళ్ళను అందంగా ఉంచుకోవచ్చు. కంటి మేకప్ తుడుచుకోవటానికి రోజ్‌వాటర్‌లో ముంచిన నూలు బట్ట ఉపయోగించాలి. నెమ్మదిగా వత్తుతూ తుడవాలి. కనురెప్ప చివర్లు జాగ్రత్తగా తుడవాలి. జిడ్డు చర్మం కలవారు కంటి చుట్టూ క్రీము రాసుకోవటం మంచిది.



Click it and Unblock the Notifications
