For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ కంటిని కాపాడుకుంటున్నారా..?

|

Eye Care Tips and Natural Eye Treatment
రోజంతా అదేపనిగా కంప్యూటర్‌ చూస్తూ పనిచేయటం, టీవీ చూడటం, నిద్రలేమి లాంటి కారణలతో కళ్ళు అలసిపోయి, ఉబ్బినట్లుగా తయారవుతాయి. అంతే కాకుండా, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు రావటం మొదలవుతాయి. కళ్లను కాపాడే కనురెప్పల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కళ్లను రోజుకు వీలైనంత వరకు రెండు సార్లు కంటే ఎక్కువగా కడగకూదు. కంటి నిండా నిద్ర పోవాలి. కంటి అందాన్ని పెంచేందుకు వాడే వస్తువులు సాధ్యమైనంత వరకు కంపెనీ ఉత్పత్తులనే వాడాలి.

కళ్లచుట్టూ ఏర్పడ్డ మచ్చలు పోవాలంటే..

నిమ్మరసం, తేనె కలిపిన నీటిని కళ్లచుట్టూ అద్దాలి. విటమిన్‌ ''ఎ'' ఉన్న ఆహార పదార్థాలు తినాలి. రోజ్‌ వాటర్‌ని కళ్లచుట్టూ దూదితో అద్దుకుని కాసేపు విశ్రమించాలి. దోసకాయ గుజ్జు, నిమ్మరసం కలిపి కళ్లచుట్టూ సున్నితంగా మసాజ్‌ చేస్తే బావుంటుంది.

కళ్ల చుట్టూ ఏర్పడ్డ మడతలు రాకుండా..

ఆల్మండ్‌ ఆయిల్‌, ఆలివ్‌ ఆయిల్‌గాని కంటిచుట్టూ వున్న చర్మాన్ని సున్నితంగా మర్ధనా చేయాలి. కళ్లకు అతిగా మేకప్‌ వేయకూడదు. కంటి రెప్పలకు, నొసలకు ఆల్మండ్‌ ఆయిల్‌ వాడడం వల్ల వెంట్రుకలు ఊడకుండా వుంటాయి. పాలమీగడ, రోజ్‌వాటర్‌ కలిపి కళ్లచుట్టూ రాస్తే మంచిది.

కళ్లు ఒత్తిడికి గురికాకుండా..

ఎక్కువ టీవి చూడకూడదు. డాక్టర్‌ సలహాలు పాటించాలి. చల్లని నీటితో కళ్లను తరచూ శుభ్రపరచుకోవాలి. కంటి ప్రదేశాల్లో గోకకూడదు. కళ్లకు తరచూ రోజ్‌వాటర్‌ ఉపయోగించాలి. జిడ్డు చర్మం వుంటే కళ్లచుట్టూ క్రీం రాసుకుంటే బెటర్‌. కళ్లల్లో రెండు చుక్కలు ఆముదం వేసుకుంటే కళ్లు ఫ్రెష్‌ అవుతాయి. ఆల్మండ్‌ ఆయిల్‌, నిమ్మరసం కలిపి కళ్లచుట్టూ పెట్టుకోవాలి. బంగాళాదుంపల గుజ్జును కళ్లచుట్టూ రాసుకుంటే చారలు మాయం. కలబంద కాడల గుజ్జు కూడా కళ్లచుట్టూ పెట్టుకుంటే నలుపు తగ్గిపోతుంది.

English summary

Eye Care Tips and Natural Eye Treatment | మీ కంటిని కాపాడుకుంటున్నారా..?

Eyes are one of the most important organ in the human body and vision is one of the most wonderful gift. But often many people neglect the importance of eye care and do not pay proper attention towards eye care.
Story first published:Monday, December 5, 2011, 14:44 [IST]
Desktop Bottom Promotion