For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పళ్లు గట్టిబడాలంటే..?

|

Gingili Oil Protects your Teeth
ప్రతి ఒక్కరికి పంటి శుభ్రత ఎంతో ముఖ్యం, దంత సంరక్షణ విషయంలో ఏ మాత్రం ఆశ్రద్ధ వహించినా రోగాలు వ్యాపిస్తాయి. నలుగురిలో ఆత్మవిశ్వాసాన్ని కొల్పోవల్సివస్తుంది. ప్రతి రోజు బ్రెష్ చేసుకునేముందు టేబుల్ స్పూన్ నువ్వల నూనెను నోట్లో పోసుకుని పది నిమిషాల పాటు పుక్కిలించి ఆ తరువాత నోటిని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధానాన్ని రోజు అనుసరించటం వల్ల పళ్లు గట్టిపడటంతో పాటు, నోటి దుర్వాసన, నోటి పూత, చిగుళ్ల పోటు ఇతర దంత వ్యాధులు పూర్తిగా తొలగిపోతాయి. దంత వ్యాధులు లేని వారు సైతం ఈ ప్రక్రియను ఆచరించటం మంచింది. ఈ పుక్కిలింపు చర్య వల్ల దంత సౌందర్యమే కాదు చెవి, ముక్కు, కళ్లు, గొంతు భాగాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.

దంత సంరక్షణకు పాటించండి పలు చిట్కాలు:

ముఖ్యంగా నీరు సమృద్ధిగా తీసుకోవాలి. నోటి దుర్వాసన పోవాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి. ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా దుంతాలను శుభ్రం చేసుకోవాలి. ఆహారం తీసుకున్న ప్రతిసారి నీళ్లతో పుక్కిలించి నోటిని శుభ్రపరుచుకోవాలి. ఉన్నత ప్రమాణాలతో తయారుకాబడి నిపుణలచే గుర్తింపు పొందిన ఫ్లూరైడ్ ఉన్న టూత్ పేస్ట్ నే వాడాలి. చిరుతిళ్లను తగ్గించాలి. చక్కెర శాతం అధికంగా ఉన్న ఆహార పదార్ధాలతో పాటు శీతల పానీయాలను తగ్గించండి.
పంటి నొప్పితో బాధపడుతుంటే రెండు తులసి ఆకులతో పాటు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి తీసుకుని మూడింటిని కలిపి పంటి కింద రెండు నిమిషాల పాటు అదిమి పెడితే ఉపశమనంగా ఉంటుంది.

English summary

Gingili Oil Protects your Teeth | పళ్లు గట్టిబడాలంటే..?

I have been asked by a few people to post something that relates to maintenance of oral hygiene, and tips to maintain clean and healthy teeth.
Desktop Bottom Promotion