Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
పొట్టపై వెంట్రుకలు ఇంట్లోనే తొలగించుకోడమెలా?
పొట్టపై వెంట్రుకలు ఇంట్లోనే తొలగించుకోడమెలా?

1. షేవ్ చేయండి: ఉదర భాగ వెంట్రుకలు కొందరికి గట్టిగా కూడా వుంటాయి. రేజర్ తో తీసేయాలనుకుంటే తీసేయండి. రేజర్ తో తీస్తే, మళ్ళీ త్వరగా వచ్చేస్తాయంటారు కొంతమంది. పర్వాలేదు తరచుగా షేవ్ చేయండి. కొద్దిపాటి కొబ్బరినూనె రాస్తే మెత్తబడి ఎదుగుదల త్వరగా వుండదు.
2. క్రీములతో తొలగించండి: సమయం, శక్తి వృధా కారాదు. చర్మ సంరక్షణ కావాలి. నేడు మార్కెట్ లో వస్తున్న వివిధ రకాల హెయిర్ రిమూవర్ క్రీములలో మంచిదాన్ని, ఎలర్జీ కలిగించనిదాన్ని ఎంపిక చేసి వాడండి. గతంతో పోలిస్తే, నేడు వచ్చే ఉత్పత్తులు నాణ్యతలు గలవిగానే వున్నాయి.
3. బ్లీచింగ్: కొంతమంది మహిళలకు పొట్టపై అతితక్కువ వెంట్రుకలుంటాయి. అదృష్టవంతులైన వీరికి వెంట్రుకలు తొలగించేకంటే, బ్లీచింగ్ మంచిది. కొద్దిపాటి బ్లీచింగ్ ఈ సమస్యను నివారిస్తుంది.
4. ఇంటివద్దే వ్యాక్సింగ్: కొత్తగా వ్యాక్స్ స్ట్రిప్ లు వస్తున్నాయి. వాటితో ఇంటివద్దే చేసుకోవచ్చు. పార్లర్ కు వెళ్ళనవసరంలేదు. వాటిని కొంచెం హీట్ చేసి ఉపయోగించడమే. కాళ్ళకు చేతులకు కాకపోయినా, చిన్నదైన పొట్ట భాగానికి ఇంటి వ్యాక్సింగ్ సౌకర్యమే!
5. సహజ వైద్యం: కిచెన్లోనే కావలసినవి వుంటాయి. కొద్దిపాటి పసుపు శనగపిండి కలపండి. ఈ మిశ్రమానికి పాలు లేదా నీరు కలపండి. ఈ పేస్ట్ ను పొట్ట వెంట్రుకలకు పట్టించి, నలిపేయండి. వెంట్రుకలు చాలావరకు తొలగిపోతాయి.
ఈ చిన్న పరిష్కారాలు ఇంటివద్దే.... మీ పొట్ట వెంట్రుకల సమస్యను తీరుస్తాయి



Click it and Unblock the Notifications
