For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోగాలను దూరం చేసే రతిక్రీడ!

By B N Sharma
|

Couple11
రతిక్రీడ సమర్ధవంతంగా నిర్వహిస్తూ వుంటే అది శరీరానికి వచ్చే చాలా రోగాలకు వ్యాధి నివారిణిగా పనిచేస్తుందని వైద్యులు చెపుతున్నారు. . వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు అయినా భాగస్వామితో రతి క్రీడలో పాల్గొంటే శరీరం చురుకుగా, ఆరోగ్యంగా వుండి వ్యాధులను దరికి చేరకుండా చేస్తుందట. వేరే విధంగా చెప్పాలంటే, రతిక్రీడ శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒక మంచి ఫిట్ నెస్ వ్యాయామంగా భావించవచ్చని వారు చెపుతున్నారు. వారానికి మూడు సార్లు రతిక్రీడను ఆచరిస్తే, శరీరంలో వ్యర్ధంగా పేరుకుపోయే అనేక కేలరీలు ఖర్చయి శరీరానికి బలం చేకూరుతుందట.

ఇదే విధంగా రతిక్రీడ రెగ్యులర్ గా చేస్తూ పోతే, మంచి రక్త సరఫరా ఏర్పడి కొల్లెస్టరాల్ మంచి స్థాయికి రావడం మొదలైన ప్రయోజనాలే కాక శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుందట. చురుకుగా రతిక్రీడ చేసేవారి జీవితకాలం మరింత ఎక్కువ కాలం సాగుతుందని కూడా పరిశోధకులు చెపుతున్నారు.

శరీరంలోని ప్రధాన అవయవాలు, ఇతర భాగాలు సమర్ధవంతంగా పని చేసి ఆరోగ్యంగా వుంటాయని, దీంతో అవయవాలలోని వివిధ రకాల కణాలు మరింత శక్తివంతంగా ఉంటాయని, కొలెస్ట్రాల్, లేదా గుండె జబ్బు లు రాకుండా బ్రహ్మాండమైన ఔషధంలా ప్రతిరోజూ చేసే రతిక్రీడ పని చేస్తుందని ఈ అధ్యయనం తేల్చింది. పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధులను యాభై శాతానికి తగ్గించుకోవచ్చనికూడా అధ్యయనం తెలుపుతోంది.

ఇంతేకాక, శరీరంలో రెగ్యులర్ గా వచ్చే నొప్పులు కూడా రతిక్రీడతో తగ్గి సుఖంగా ఉంటారని నిపుణులు చెపుతున్నారు. ఆధునిక యాంత్రిక జీవనం ఎంతో ఒత్తిడికలిగి వుందని, ఈ ఒత్తిడిని తగ్గించేందుకు రతి క్రీడ ఓ మంచి ఔషధంగా సహకరిస్తుందని ఈ అధ్యయనం తేల్చింది. రతిక్రీడలో పాల్గొన్న తర్వాత బ్రెయిన్, రక్తప్రసరణ వ్యవస్థ ఎంతో మెరుగు పడతాయని, వారిలోని ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయని అధ్యయనం పేర్కొంది.

English summary

Love Making Resolves All Body Diseases! | రోగాలను దూరం చేసే రతిక్రీడ!

Effective Lovemaking keep the body fit from all diseases, Tissues in different organs gets activated and become efficient. With the result, Chollesterol or diseases related to Heart, etc. gets cured or prevented. Researchers say that Lovemaking on a regular basis cuts down the heart diseases in men. All bodily aches, stress, strain, etc. get disappeared once you start sexual activity with your partner.
Story first published:Wednesday, December 7, 2011, 17:01 [IST]
Desktop Bottom Promotion