For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజు ‘గ్రీన్ టీ’ తాగితే..?

|

The Miracle of Green Tea
పచ్చగా పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలంటే తాగండి గ్రీన్ టీ అని నిపుణులు సైతం చెబుతున్నారు. గ్రీన్ టీలో ఉన్నన్ని ఔషధగుణాలు మరెందులోనూ లేవన్న విషయాన్ని చైనాలో నాలుగు వేల సంవత్సరాల క్రితమే కనుగొన్నారట. తలనొప్పి నుంచి ఒత్తిడి వరకూ ఆజీర్తి నుంచి అల్జీమర్స్ వరకు ఏ వ్యాధికైనా ఇది అద్భుతమైన మందు అంటారు చైనీయులు. అందుకే కాబోలు ఎందరో నిపుణులు ఇందులోని ఆరోగ్య రహస్యాన్ని శోధించే పనిలో నిమగ్నమయ్యారు.

ప్రస్తుతం అనేక మందిని కలవరపెడుతున్న వ్యాధి క్యాన్సర్. క్యాన్సర్ కారక కణాలను అడ్డుకోగల గుణాలు గ్రీన్ టీలో చాలానే ఉన్నాయట. క్యాన్సర్ రోగులు క్రమం తప్పకుండా ఈ టీని తాగడం వల్ల వ్యాధి మరింత పెరగకుండా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఊబకాయం నియంత్రణకు గ్రీన్ టీను మించిన ఔషుధం లేదు. కెఫీన్ కాంబినేషన్‌తో కలిసిన గ్రీన్ టీని తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయట. గ్రీన్ టీ తాగేవాళ్లలో చెడు కొలెస్ట్ర్రాల్ తగ్గి మంచి కొలెస్ట్ర్రాల్ పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

English summary

The Miracle of Green Tea | రోజు ‘గ్రీన్ టీ’ తాగితే..?

Is any other food or drink reported to have as many health benefits as green tea? The Chinese have known about the medicinal benefits of green tea since ancient times, using it to treat everything from headaches to depression. In her book Green Tea: The Natural Secret for a Healthier Life, Nadine Taylor states that green tea has been used as a medicine in China for at least 4,000 years.
Story first published:Tuesday, December 6, 2011, 12:16 [IST]
Desktop Bottom Promotion