For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చూడగానే ఆకర్షించే అందమైన కళ్ళు కోసం..!

|

Tips for A Beautiful Eyes..
ముఖం చూడగానే ఆకర్షించే వాటిలో కనుల మొదటిగా వుంటాయి. ప్రస్తుతకాలంలో స్త్రీ, పురుషులు ఇరువురు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. దాని వల్ల కలిగే నష్టాలు చాలానే వున్నాయి. వాటిలో ఒకటి కళ్లు. కంప్యూటర్ ముందు కూర్చొని విశ్రాంతిలేకుండా పని చేయుట వలన కళ్లు అలసిపోవుట, కళ్లు క్రింద ముడతలు వచ్చుట, మంట పుట్టుట వంటివి జరుగుతున్నాయి. అటువంటి వాటిని దూరంగా వుంచుటకు కొన్ని నియమాలు పాటించినట్లైతే సరి.

1. కంప్యూటర్ ఎదుట కూర్చుని ఎక్కువ సేపు పనిచేసేవారు మధ్యమధ్యలో చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి.
2. కళ్లకింద ముడతలు పోవాలంటే... ఒక కప్పు నీళ్లలో ఎండు ఉసిరికాయని నానబెట్టాలి. మర్నాడు పొద్దున ఈ నీళ్లలో మరో కప్పు నీళ్లు కలిపి వాటితో కళ్లని కడుక్కోవాలి.
3. టూవీలర్ ప్రయాణం చేసేవారయితే కళ్లజోడు లేదా హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అయినా పొల్యూషన్‌ తో ఇంటికెళ్లేసరికి కళ్లు రెండూ ఎర్రబడిపోతాయి. అలాంటపుడు ఇంటికెళ్లగానే మొహం కడుక్కుని పచ్చిపాలలో ముంచిన దూదిని కనురెప్పలపై పెట్టుకుని ఓ ఐదునిమిషాలు పడుకోవాలి.
4. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంలో ఆకు కూరలు, బొప్పాయి, గుడ్లు, చేపలు, పాలు... ఉండేలా చూసుకోండి.
5. కళ్లు మండుతున్నట్టు అనిపిస్తే బాగా మాగిన అరటి పండు తొక్కను కళ్లుకు సమంగా పరుచుకొని కొద్ది సేపు పడుకోవాలి.
6. కీర దోసకాయను చక్రాలుగా కోసి కళ్ళ మీద పెట్టుకుంటే అలసట తగ్గుతుంది.
7. కనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువుగా రాలిపోతుంటే వాటికి ఆలివ్ ఆయిల్ రాస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
8. కళ్ళను రోజుకు వీలైనంత వరకు రెండుసార్లుకంటే ఎక్కువ కడుగకూడదు.
9. కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. కంటి అందాన్ని పెంచేందుకు వాడే వస్తువులు సాధ్యమైనంవరకు కంపెనీ ఉత్పత్తులనే వాడాలి.

English summary

Tips for A Beautiful Eyes.. | అందమైన కళ్ళు కోసం..!

Eyes are the best part of human organ. They can express any kind of emotion. Even the person who does not have the ability to talk can express himself through the eyes.
Desktop Bottom Promotion