For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాదాల పగుళ్ళు మాయం చేసే 5 బెస్ట్ హోం రెమెడీస్

|

సాధారణంగా కొంత మందిని గమనించినట్లైతే చాలా అందంగా కనబడుతారు. పైనుండి క్రింద వరకూ చాలా చక్కగా శరీర ఆకృతి, శరీర ఛాయ ఆకర్షనీయంగా ఉంటాయి. అయితే పాదాల విషయానికొస్తే మాత్రం అక్కడ చిన్న లోపం కనిపిస్తుంది. నిండు చందమామలో నల్ల మచ్చలా. దాంతో సిగ్గు, బిడియం చోటు చేసుకుంటుంది. పాదాలు పగుళ్ళతో కాళ్ళు అందవిహీనంగా ఉంటాయి.

అందుకు కొన్ని బలమైన కారణలు ఉంటాయి. అవి శరీరములో అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి సాదారణంగా వస్తుంటాయి. కఠిన నేలపై నడవడం కూడా ఒక కారణమే. ఎత్తైన చెప్పులు ధరించి నడవడంతో పాదల వద్ద రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే అధిక బరువు కలిగిఉండడం, పాదాల మీద శ్రద్ద తీసుకోకపోవడం, పోషకాహార లోపము పాదాల పగుళ్ళకు కారణమౌతున్నాయి...అలాంటి వారు కొన్ని నివారణోపాయాలు పాటిస్తే పాదాల సౌందర్యం మీసొంతం అవుతుంది.

పాదాల పగుళ్ళు మాయం చేసే 5 సులభ చిట్కాలు.!

నిమ్మరసం, ఉప్పు-గ్లిజరిన్ -రోస్ వాటర్: ఇది ఒక బెస్ట్ మంచి చిట్కా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖర్చుతక్కువ, ఫలితమెక్కువ కాబట్టి. ఒక బౌల్లో రాళ్ళ ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ వేసి అందులో గోరు వెచ్చని నీళ్ళు పోసి అందులో కాళ్ళు మునిగేలా కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఇరవై నిముషాల తర్వాత స్ర్కబ్బర్ తో స్ర్కబ్ చేయాలి. మెత్తబడిన కాళ్ళనుండి మృత చర్మం తొలగిపోయి అందంగా మారుతాయి. శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా గ్లిజరిన్, రోజ్ వాటర్, నిమ్మరసం మళ్ళి మిక్స్ చేసి చిక్కని పేస్ట్ ను శుభ్రం చేసి కాళ్ళకు పట్టించి ఆరనివ్వాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అవసం ఐతే పడుకొనే ముందు కాళ్ళకు సాక్సులు ధరించుకోవచ్చు.

పాదాల పగుళ్ళు మాయం చేసే 5 సులభ చిట్కాలు.!

ఫూట్ ఆయిల్ మసాజ్: బాగా పగిలిన పాదాల పగుళ్ళకు ఇది మరొక సులభమైన చిట్కా. పొడి చర్మం కలవారు ఎక్కువగా పాదాల పగుళ్ళకు గురి అవుతుంటారు. అలాంటివారు రాత్రి పడుకొనే ముందు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, హైడ్రోజెనెటెడ్ వెజిటేబుల్ ఆయిల్ వీటిలో ఏఒక్కదానితోనైనా బాగా మసాజ్ చేసుకొని పడుకోవాలి. పాదాల పగుళ్ళు తగ్గే వరకూ రెండు మూడు సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

పాదాల పగుళ్ళు మాయం చేసే 5 సులభ చిట్కాలు.!

ఫ్రూట్ మసాజ్: బాగా పండిన అరటిపండును బాగా గుజ్జులా చేసి పగిలిన పాదాలకు అలాగే పట్టించాలి. పది పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మెత్తబడుతాయి. ఇలా ప్రతి రోజూ కూడా చేయొచ్చు. ఎక్కువగా పాదాల పగుళ్ళున్నప్పుడు అవొకాడో ఫ్రూట్ మసాజ్ బాగా పనిచేస్తుంది. సగభాగం అవొకాడో లేదా పచ్చికొబ్బరి తీసుకొని మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసి అరటిపండు గుజ్జుకు కలిపి కాళ్ళకు పట్టించి మసాజ్ చేయాలి. అవొకాడో లేదా పచ్చికొబ్బరిలో ఎసెన్సియల్ ఆయిల్స్, మినిరల్స్, విటమిన్ ఉండటం చేత పొడిబారిన పాదాలను న్యూరిష్ చేయబడి పాదాల పగుళ్ళను పోగొడుతుంది. పగుళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. అరటి బదులు బొప్పాయిని కూడా వాడుకోవచ్చు.

పాదాల పగుళ్ళు మాయం చేసే 5 సులభ చిట్కాలు.!

నేచురల్ ఆయిల్ ట్రీట్మెంట్: మీ పాదాలు ఎప్పుడు పొడి బారి పగుళ్ళు ఏర్పడుతుంటే తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్, మరియు బియ్యం పిండితో కలిపి బాగా రఫ్ గా పేస్ట్ చేసి కాళ్ళకు పట్టించాలి. తర్వతా ఒక బకెట్లో పాదాలు మునిగేలా గోరువెచ్చని నీళ్ళు పోసి అందులో బాదాం ఆయిల్, లేదా ఆలివ్ ఆయిల్ వేసి పాదాలను అందులో డిప్ చేసి కొద్దిసేపు నాననివ్వాలి. పది నిముషాల తర్వాత బయటకు తీసి బాగా స్ర్కబ్ చేసినట్లైతే సున్నితమైన పాదులు మీ సొంతం అవుతాయి.

పాదాల పగుళ్ళు మాయం చేసే 5 సులభ చిట్కాలు.!

వాక్స్ మరియు మస్టర్డ్ ఆయిల్ ట్రీట్మెంట్: పగిలిన పాదాలను బాగుచేసుకోవడానికి చాలా సార్లు చాలా పద్దతులను ఉపయోగించి విసిగి వేసారిపోయినట్లైతే వాక్స్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. అదేలా అంటే మైనపు వత్తులు దారం తీసేసి చిన్నచిన్నగా పొడిచేసి ఆవనూనెలో వేసి కరిగించాలి. కాళ్ళు వేడినీళ్లలో ముంచి స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకొన్న తర్వాత ఈ మెల్డెడ్ మస్టర్డ్ ఆయిల్ ను పాదాలకు పట్టించాలి. ఇలా నిద్రకు ఉపక్రమించే ముందు చేసి, పాదాలకు సాక్సులు తొడుక్కోవాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే ఎంతటి పగుళ్లైన మాయం అవ్వాల్సిందే.

అందుకు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు.. ఎటువంటి చికిత్సా అవసరం లేదు. అధికంగా ఖర్చు చేయనవసరమూ లేదు. ఇంట్లో సాధారణంగా లభించే వస్తువులతోనే అందమైన పాదాలను సొంతం చేసుకోవచ్చు. అందుకు ఐదు బెస్ట్ హోం రెమెడీస్ కలవు అవేంటో ఒకసారి చూద్దాం...

English summary

5 The Best Home Remedies for Cracked Heels...! | పాదాల పగుళ్ళు మాయం చేసే 5 సులభ చిట్కాలు.!

We all know how the cracked heels pain and create difficulties in even walking smartly! So, without going into the details as to why we get cracked heels (we all know that the dry winds in winters, lack of moisturizing elements and improper care of feet, especially dry feet, cause the cracked heels), I will just write down the 5 best home remedies for cracked heels! The tips for curing cracked heels listed here goes from simpler to tougher depending upon the level of cracked heel problem
Desktop Bottom Promotion