For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన కనుబొమ్మలకు ఒత్తైన హెయిర్ గ్రోత్...

|

శరీరంలో అందంగా కనిపించేది ముందుగా ముఖం. ముఖాకృతికి కళ్ళు, ముక్కు, మూతి. ఎవరినైనా చూడగానే ఆ అమ్మాయి కళ్ళు బాగున్నాయి, మూతి బాగుంది, ముక్కు బాగుంది అని చెప్పుకొంటుంటారు. ఇవన్నీ చక్కటి ఆకృతి కలిగి ఉన్నప్పుడు ముఖంలో అంత అందం పొదిగి ఉంటుంది. మన శరీంలో ముఖ్యమైన అవయమైన కంటిదే.. అవి రెప్ప వేసినా... మూసినా.. రెప రెపలాడినా... నవరసాలనూ అద్భుతంగా చూపించి...మనిషి మనసులోని భావాన్ని... ఎదుటివారికి ఎలాంటి శబ్ధంలేకుండానే స్పష్టంగా చూపించే కళ్లు... నిన్నటి తరంలోనే కాదు నేటి తరంలోనూ... భవిష్యతరం కూడా కళ్లు కుమ్మరించే భావాలను మరింత స్పష్టంగా కనిపించే విధంగానే వాటికి ఎన్నో విధాలైన మెరుగులు దిద్దుతూ వస్తున్నారు.

కళ్లు ఏ ఆకారంలో ఉన్నాసరే వాటిని అద్భుతంగా చూపించగలిగేవి కనుబొమ్మలే అనటంలో సందేహంలేదు ఎవ్వరికీ. అంతలా ప్రభావితం చేస్తాయి. అందుకనేమో... సాధారణ మహిళలల్లో కూడా ఐబ్రో పెన్సిల్స్‌ని వాడకం రాను రాను పెరుగుతోంది. ముఖానికి అందం కన్నులైతే, వాటికి కనుబొమలు. కనుబొమలకు చక్కటి ఆకృతినిస్తే చాలు ముఖం ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. అంత ముఖ్యమైన కనుబొమలు కొందరికి పలుచగా ఉంటాయి.

మరికొందరికి మందగా ఉంటాయి. ఇంకొందరి అసలు కనుబొమ్మలు ఉండవు అలాంటి వారు ఐబ్రో పెన్సిల్ ను ఉపయోగించి అందంగా కనబడేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతే కాకుండా ఐబ్రో చేయించుకొన్నప్పుడు కొన్ని పొరపాట్లు వల్ల ఐబ్రో హెయిర్ ఎక్కువగా తియ్యడం వల్ల చాలా పలుచగా అనిపిస్తుంటుంది. అది మళ్ళీ పెరగాలంటే కొన్ని నెలలు పడుతుంది. అలా కాకుండా సహజ అందాలను దక్కించుకోవాలంటే... ఐబ్రో చక్కగా పెరిగాలంటే అందుకు కొన్ని ప్రత్యేకమైన పద్దతులను ఉపయోగించనట్లైతే ఐబ్రో చక్కగా పెరుగుతాయి.

క్యాస్ట్రో ఆయిల్

క్యాస్ట్రో ఆయిల్

కనుబొమ్మలు, కనుప్పలు కొందరికి ఒత్తుగా ఉండవని బాధపడుతుంటారు. వాళ్లు రోజు పడుకునే ముందు క్యాస్ట్రో ఆయిల్ రాసుకుంటే.. వెంట్రుకలు ఒత్తుగా వస్తాయి. క్యాస్ట్రో ఆయిల్ ను రెండు మూడు నిముషాలు కనుబొమ్మల మీదు మసాజ్ చేయాలి. అరగంట అలాగే వదిలేసి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తే చాలు.

కోకో -నిమ్మ

కోకో -నిమ్మ

కొబ్బరి నూనెలో మరియు నిమ్మ తొక్క ఐబ్రో తిరిగి పెరిగేలా చేస్తుంది. రెండు చెంచాల కొబ్బరినూనెలో నిమ్మతొక్కను వేసి మెత్తగా గ్రైడ్ చేయాలి. ఐబ్రో పలుచాగా ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్నిరాస్తే హెయిర్ రీగ్రోత్ అవుతుంది. చర్మానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ కలగదు.

అలోవెరా

అలోవెరా

చాలా పలుచగా ఉన్న ఐబ్రో ఉన్నా, లేదా ఐబ్రోలను ఓవెర్ ప్లక్కింగ్ చేసినా పలుచగా కనబడుతాయి. అటువంటప్పుడు కనుబొమ్మల మీద ఆలోవెర జెల్ ను అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా మసాజ్ చేసి, కొద్దిసేపు అలాగే వదిలేసి తర్వాత ఫేష్ వాష్ చేసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

ఉల్లిపాయల రసంలో సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఇది ఘాటైన వాసనను కలిగి కళ్ళను మంట పెట్టిస్తాయి. అయితే ఈ సల్ఫర్ హెయిర్ త్వరగా పెరిగేలా చేస్తాయి. కాబట్టి ఉల్లిపాయలను మెత్తని పేస్ట్ చేసి, ఆ రసంలో కాటన్ బాల్స్ అద్ది కనుబొమ్మల క్రింది బాగానా మసాజ్ చేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

మెంతి

మెంతి

మెంతుల్లో ఎన్ని ఔషద గుణాలున్నాయో మనకు తెలిసిన విషయమే. ఇవి హెయిర్ గ్రోత్ కు బాగా ఉపయోగపడుతాయి కాబట్టి జుట్టుకు తరచూ పెట్టుకొంటుంటారు. అలాగే ఈ మెంతి పేస్ట్ ను ఐబ్రో మీద కూడా అప్లై చేయడం వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది. మెంతి పేస్ట్ లో బాదం నూనెను మిక్స్ చేసి అప్లైచేయాలి.

మిల్కీ వే

మిల్కీ వే

పాలు లేదా పాల ఉత్పత్తులలో ప్రోటీనులు మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. రాత్రి పడుకొనే ముందు పాలలో కాటన్ బాల్స్ ముంచి కళ్ళ చుట్టు మసాజ్ చేసి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాస్ట్ గా పెరుగుతుంది.

Story first published: Tuesday, October 16, 2012, 12:30 [IST]
Desktop Bottom Promotion