For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాక్ పోర్షన్ సెక్సీగా కనబడాలంటే...!

|

సాధారణంగా మహిళలు ఎంతటి సౌందర్యవతులలో అందరికి తెలిసిన విషయమే. అయితే సహజ సౌందర్యానికి మరికొన్ని మెరుగులు దిద్దుకొంటే ఆ సౌదర్యం ఎప్పటీ అలాగే నిలిచి ఉంటుంది. అందంగా, రూపవతి, పుట్టడమే కాదు పుట్టనప్పటి నుండి వయస్సు పెరిగే కొద్ది శరీరం మీద, అలంకరణ మీద, వస్త్రాల మీ మహిళలకు మోజు పెరుగుతుంటుంది. ప్రతిదీ కొత్తగా వేసుకోవాలని, కొత్తగా కనబడాలని ఆరాటపడుతుంటుంది.

ఒక్కొక్కో సందర్భంలో ఒక్కోరంగా తయారవడానికి ఉత్సాహం చూపిస్తుంది. ముఖ్యంగా మహిళలు వేసుకొనే మేకప్ విషయంలోనూ, వారు ధరించే దుస్తుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకొంటేరూ మేకప్ ఎలా వేసుకొన్నా దానికి తగ్గ వస్త్రాదారణ ఉండాలి. ముఖ్యంగా మహిళలు ముఖం, కాళ్ళు, చేతులు వంటి బాహ్యంగా కనిపించే అవయవాలను ఎంత ప్రాధాన్యత ను ఇస్తారో అంతే ప్రాదాన్యతను వీపు బాగంలో కూడా చూపించాలి. లేదంటే ఎంత మేకప్ చేసుకొన్నా ముందు వైపు ఎక్కువ ఆకర్షించేలా ఉండి, వెనుక వైపు ఆస్యహించుకొనేలా ఉండకూడదు.

మహిళలు ఒకప్పుడు శరీరం నిండుగా కప్పిఉండే విధంగా బ్లౌజులు (జాకెట్లు) కుట్టించుకొనే వారు. అయితే అది రాను రాను ఫ్యాషన్ వైపు మొగ్గు చూపడంతో కొద్దికొద్దిగా బ్యాక్ నెక్, ఫ్రెంట్ నెక్ క్రిందికి తగ్గించి ఒళ్ళు కనబడేలా ఇతరులను ఆకర్షించేలా వేసుకోవడం ప్రారంభించారు. అయితే అలా వేసుకోవాలంటే చక్కటి శరీర ఆకతి, శరీర చాయతో పాటు, ఎటువంటి చర్మ సంబంద సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొంత మంది మహిళల వీపు నిండా మొటిమలు, కాయలు, వంటివి వుండి అందరూ ధరించే అందమైన వి-నెక్, లేదా ఓ-నెక్ జాకెట్లు వేసుకోవాలంటే ఇబ్బందిగా వుంటుంది. మహిళలకు ముందు భాగమే కాదు...వెనుక భాగం కూడా నున్నగా నిగ, నిగ లాడుతూ వుంటే, మరింత సెక్సీ అపీల్ కనపడుతుంది. అందుకుగాను సింపుల్ గా ఇంట్లోనే ఏం చేయాలో చూడండి....

1. చర్మానికి గుడ్డు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి గుడ్డులోని తెల్లని సొనను తీసుకొని అందులో ఒక చెంచా నిమ్మరసం కలపి వీపు మొత్తానికి పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే నున్నగా నిగనిగలాడుతుంటుంది.

2. ఒక బౌల్ తో రెండు చెంచాల పంచదార, రెండు చెంచాల తేనె, రెండు చెంచాల నిమ్మరసం సమంగా తీసుకొని దానికి కొద్దిగా దానిమ్మగింజలను జతచేసి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వీపు బాగానికి బాగా పట్టించి ఇరవైనిమిషాల తర్వాత టిష్యు పేపర్ లేదా పొడి వస్త్రంతో పూర్తిగా తుడిచేసి తర్వాత పెరుగును అప్లై చేయాలి. పెరుగు తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. ఒరెంజ్ తొక్కలను ఎండ బెట్టి, తర్వాత వాటిని నీళ్ళల్లో ఒక రోజురాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు కొద్దిగా పాలు, నానిన ఆరెంజ్ తొక్కలను మిక్సీలో మెత్తని పేస్ట్ లా చేసుకొని, ఈ మిశ్రమాన్ని వీపుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చిని నీటితో శుభ్రం చేసేసుకోవాలి.

4. టమోటు గుజ్జు లేదా బాగా పండిన టమోటో ముక్కలను వీపు బాగంలో బాగా రుద్ది, అరగంట తర్వాత గోరు వెచ్చిని నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

5. మెంతులను నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా పెరుగు కలిపి, వీపుకు రాయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే సున్నితమైన చర్మం మీ సొంతం అవుతుంది.

6. రెండు చెంచాల రోజ్ వాటర్ లో రెండు చెంచాల తేనె కలిపి బాగా మిక్స్ చేసి వీపుకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే వీపు కోమలంగా తయారువుతుంది.

English summary

Beauty Tips to get Smooth Back...! | బ్యాక్ పోర్షన్ సెక్సీగా..ఆకర్షించేలా..1


 Having acne on your back? Try the suitable and simple home tip to get rid of it. If you're wondering how to look better naked, just use these tips
Story first published: Tuesday, July 17, 2012, 15:56 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more