For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడాళ్లూ..! ఆ అలవాట్లు మానుకోకపోతే అంతే సంగతులు

|

ఆడవాళ్ళకే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే వాళ్ళు తమ గురించి తాము పట్టించుకోరు కనుక. అలాగే రోజూ వాళ్లు అనుసరించే కొన్ని అలవాట్ల వల్ల కూడా వాళ్ళకు అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి. ఆ అలవాట్లు శరీరానికి పెద్ద సమస్యల్నే తెచ్చిపెడుతున్నాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకొని సాధ్యమైనంత వరకూ వాటిని గురించి తగిని జాగ్రత్తలు తీసుకొంటే ఆనందంగా గడపగలుగుతారు.

జంక్ ఫుడ్

జంక్ ఫుడ్

మనసుకి బాధగా ఇబ్బందిగా అనిపించినప్పుడు ఒక పెద్ద చాకొలెట్ బార్ తినేసి హమ్మయ్య ఇప్పుడు మనసు తేలిక పడింది...

మేకప్ తో నిద్ర

మేకప్ తో నిద్ర

చాలా మంది మేకప్ తీసేందుకు ఓపిక లేదంటూ రాత్రిళ్లు మేకప్ తోనే నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఉదయం నుంచి పేరుకుపోయిన దుమ్ము...

నిద్ర సరిగా లేకపోయినా

నిద్ర సరిగా లేకపోయినా

నిద్ర సరిగా లేకపోవడం వల్ల సమస్యలు మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలోనే ఎక్కువ నిద్రలేమి వల్ల రకరకాల సమస్యలు వచ్చిపడతాయి.

హై హీల్స్(ఎత్తుమడమల చెప్పులు)

హై హీల్స్(ఎత్తుమడమల చెప్పులు)

ఎత్తుమడమల చెప్పలు వేసుకుంటే అందంగా కనిపిస్తారు. అయితే రెండు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నచెప్పులను రోజూ వేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చిపడతాయి

బ్రా సైజ్

బ్రా సైజ్

ఎనభై శాతం మంది మహిళలు తాము వేసుకునే బ్రా సైజు సరిగా ఉండేలా జాగ్రత్తపడరు. ఏదో ఒకటిలే అని వాటిని వాడడం వల్ల వెన్ను నొప్పి,

బరువైన హ్యాండ్ బ్యాగ్

బరువైన హ్యాండ్ బ్యాగ్

మీరు రోజూ ఆఫీసుకి తీసుకెళ్లే బ్యాగు ఎంతు బరువు ఉందో ఎప్పుడైనా గమనించారా? హ్యాండ్ బ్యాగ్ లోకి మీరు నెట్టే మొబైల్ ఫోన్.

జంక్ ఫుడ్: మనసుకి బాధగా ఇబ్బందిగా అనిపించినప్పుడు ఒక పెద్ద చాకొలెట్ బార్ తినేసి హమ్మయ్య ఇప్పుడు మనసు తేలిక పడింది అనుకుంటారు. కానీ ఆ చాకొలేట్ బార్ మీ నడుము చుట్టుకొలతని పెంచుతుందనే విషయాన్ని గుర్తించరు. విచారంగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తినాలనిపించడం సహజం. ఇలా తినడం వల్ల అప్పటికప్పుడు ఉపశమనం కలుగుతుంది. కాని మీ సమస్య పరిష్కారం కాదు. అందుకని బరువులో మార్పు తెచ్చే ఈ పద్దతి కంటే మనసుకి ఉత్సాహాన్నిచ్చే ఇతర పద్ధతులన్ని వెతుక్కోవాలి.

మేకప్ తో నిద్ర: చాలా మంది మేకప్ తీసేందుకు ఓపిక లేదంటూ రాత్రిళ్లు మేకప్ తోనే నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఉదయం నుంచి పేరుకుపోయిన దుమ్ము, ధూళి రాత్రంతా అలానే ఉండి ముఖంపై చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దానివల్ల ముఖంపై మచ్చలు ఏర్పడడం మొదలవుతుంది. అలాగే మస్కారా, ఐ మేకప్ వంటివి తీయకుండా నిద్రపోవడం వల్ల కంటి దురద, ఇన్ఫెక్షన్ లు వస్తాయి.

నిద్ర సరిగా లేకపోయినా: నిద్ర సరిగా లేకపోవడం వల్ల సమస్యలు మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలోనే ఎక్కువ నిద్రలేమి వల్ల రకరకాల సమస్యలు వచ్చిపడతాయి. పనిసామర్థ్యం తగ్గిపోతుంది. లైంగికాసక్తి ఉండదు, వాహనాలు నడిపేటప్పుడు యాక్సిడెంట్లు చేసే అవకాశం ఉంది. ఎక్కువ కాలరీలున్న ఆహారాన్ని తినడం వల్ల, చర్మం కాంతి విహీనమైపోయి, ముడతలు వచ్చిన ముసలివాళ్లలా కనిపిస్తారు.

హై హీల్స్(ఎత్తుమడమల చెప్పులు): ఎత్తుమడమల చెప్పలు వేసుకుంటే అందంగా కనిపిస్తారు. అయితే రెండు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నచెప్పులను రోజూ వేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చిపడతాయి. ఎత్తుమడమల చెప్పుల వల్ల కీళ్ళపై వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. మడమలపై పడే ఒత్తిడి వల్ల తలనొప్పి వస్తుంది. శరీర భంగిమలో మార్పు వస్తుంది. దాంతో అర్థరైటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బ్రా సైజ్: ఎనభై శాతం మంది మహిళలు తాము వేసుకునే బ్రా సైజు సరిగా ఉండేలా జాగ్రత్తపడరు. ఏదో ఒకటిలే అని వాటిని వాడడం వల్ల వెన్ను నొప్పి, శ్వాసలో ఇబ్బందులు వక్షోజాల కింది భాగంలో చారలు పడటం, మచ్చలు ఏర్పడడం, వక్షోజాలు నొప్పి పుట్టడం, శరీర భంగిమలో తేడా రావడం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్రా నుంచి ఎద బయటకు వచ్చినా, వీపు భాగం నొక్కి పట్టినట్టు ఉన్నా బ్రా స్ట్రాప్స్ భుజాల మీద నుంచి జారిపోయనట్టు ఉన్నా అది మీ సైజు బ్రా కాదని గుర్తించాలి. ఇన్ని సమస్యలు రాకుండా ఉండాలంటే బ్రా కొనేముందు కొలతలు తీసుకుని సరిపడే సైజువే తీసుకోవాలి. మొహమాటం పడితే మీరే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

బరువైన హ్యాండ్ బ్యాగ్: మీరు రోజూ ఆఫీసుకి తీసుకెళ్లే బ్యాగు ఎంతు బరువు ఉందో ఎప్పుడైనా గమనించారా? హ్యాండ్ బ్యాగ్ లోకి మీరు నెట్టే మొబైల్ ఫోన్. పర్సు, సన్ గ్లాసెస్, పుస్తకం, న్యూస్ పేపర్, మేకప్ సామాగ్రి, గొడుగు, వాటర్ బాటిల్... ఇవన్నీ కలిపితే ఒక పెద్ద రాయి అంత బరువు ఉంటుంది. అంత బరువును భుజాన వేసుకుని మోయడం వల్ల శరీరంపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. భుజానికి హ్యాండ్ బ్యాగ్ ను వేలాడదీయడం వల్ల మెడ, వెన్ను సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ బరువును సమం చేసేందుకు మెడ మీకు తేలియకుండానే వంగిపోతుంది. దాంతో మెడపై ఒత్తిడి పడి మెడనొప్పి వస్తుంది. అలాగే వీపు భాగంలో కూడా నొప్పి ఎక్కువగా వస్తుంది. శరీర భంగిమలో తేడా రావడం వల్ల బాధకరమైన ఆర్థరైటిస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని హ్యాండ్ బ్యాగ్ లో అనవసరమైన వాటన్నింటినీ తీసి పక్కన పడేసి బరువు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అందుకని ఈ ఆరు విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకోండి.

English summary

Change Your Habits; Live Healthy Life! | ఛీ.. ఛీ.. ఆ అలవాట్లు మానుకోండి

Most of us have lifestyle habits we would like to change. Life would be richer and more productive if we took better care of our bodies, minds, and spirits.
Desktop Bottom Promotion