For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గులాబీ రేకులాంటి పాదాల కోసం...

|

కాలాన్ని బట్టి శరీరంలో మార్పులు చోటు చేసుకొంటాయి. అలాగే పాదాలు, చేతులు రంగుమారిపోతాయి. పగుళ్ళు ఏర్పడి అందవిహీనంగా కనబడుతుంటాయి. శరీరంపై బాహ్యాంగా కనిపించే చర్మం, కాళ్ళు, చేతులు సంరక్షించుకోవడం ద్వారా శరీరాన్ని కోమలంగా ఉంచకోగలుగుతాం. పాదాలు కోమలంగా, పరిశుభ్రంగా ఉంటే చూడముచ్చటగా ఉంటాయి. మనలో కొందరి పాదాలు మరోసారి చూడాలనిపించేంత అందంగా ఉంటే, మరికొందరి పాదాలు పగుళ్లతో అపరిశుభ్రంగా ఉంటాయి. పాదాల సంరక్షణ మీద దృష్టి పెట్టకపోతే మృతకణాలు పేరుకుపోయి రంగు మారిపోతాయి. కాబట్టి ఈ సమస్యల నివారణకు ఇంట్లోనే ఆరోగ్యవంతంగా, మరింత అందంగా మీ పాదాలను తీర్చిదిద్దుకోవచ్చు.

1. లైమ్ ఫ్రూట్ స్ర్కబ్: నిమ్మకాయలు: 3, పంచదార: 2టేబుల్ స్పూన్లు, బాదం నూనె 1టేబుల్ స్పూన్, పుదీనా ఆకులు: కొద్దిగా, లైమ్ ఎసెన్షియల్ ఆయిల్. నిమ్మకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండ్ చేయాలి. దీంట్లో ఆల్మండ్ ఆయిల్, పుదీనా ఆకులు, ఎసెన్షియల్ ఆయిల్ పంచదార వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన పాదాలకు పట్టించి వేళ్ళతో వలయాకరంలో పది నిమిషాల పాటు మసాజ్ చేసి కడిగేయాలి. పాదాలకు తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

2. స్పైస్ మసాజ్ ఆయిల్‌తో కలిపి లవంగ నూనెను ఉపయోగించవచ్చు. ముందుగా పాన్‌లో నీటిని వేడిచేయాలి. నలగ్గొట్టిన ఒక టీ స్పూన్ అల్లం, ఏడు లేక ఎనిమిది లవంగాలు, సన్నగా తరిగిన నిమ్మగడ్డిని వేసి ప్యాన్‌లోని పదార్థాలన్నీ బాగా కలిపి సువాసనలు వెలువడే సమయంలో ప్యాన్ నీటిలో నుండి తీసి చల్లార్చాలి. ఈ నూనె గోరువెచ్చగా ఉన్నపుడే చర్మంపై మసాజ్ చేయాలి.

3. షుగర్ ఫ్రూట్ స్ర్కబ్: పంచదార పావుకప్పు, పావు కప్పు బాదం ఆయిల్, అరటీస్పూన్ జింజర్ ఎసెన్సియల్ ఆయిల్ ఈ పదార్థాలన్నీ కలిపి ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన పాదాలకు పట్టించి 10నిమిషాల పాటు మర్ధనా చేసి కడిగేయాలి. ఈ విధంగా ఫూట్ స్ర్కబ్ లను వారంలో ఒక్కసారి పాదాలకు అప్లై చేస్తే పాదాలు లేత గులాబీరేకులు ఉంటాయి..

4. పసుపు: దుర్గంధం వెదజల్లే పాదాలు, చెప్పులు కరిచిన పాదాలకు మంచి ఔషధంలా పసుపు పనిచేస్తుంది. కొన్ని వేపాకులకు పసుపు చేర్చి కొద్దిగా నీరు జోడించి పేస్ట్‌లా రుబ్బి పాదాలపై, వేళ్ళ సందుల్లో బాగా రాయాలి. ఈ పేస్ట్ పూర్తిగా ఎండిపోయాక నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే పాదాల మురికి తొలగడంతోపాటు పగిలిన కాళ్లు బాగుపడతాయి.

5. కాలి గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటే ఆకర్షణీయంగా కనిపించే మాట నిజమే. అయితే అప్పుడప్పుడు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది. కాలివేళ్లకు, గోళ్లకు గోరింటాకు పెట్టుకోవడంతోపాటు పాదాలచుట్టూ ‘యు’ ఆకృతిలో గోరింటాకు పెట్టుకుంటే పాద సౌందర్యం ద్విగుణీకృతమవుతుంది.

6. తాజా గులాబీ రేకులను సగం కప్పు తీసుకుని సగం కప్పు పాలలో వేయాలి. దానికి ఒక చెంచా గ్రామ్ ఫ్లోర్, కొంచె రోజ్‌వాటర్ జతచేసి పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమంతో పాదాలు, మోచేతులకు మర్దనా చేసి 10 నిమిషాల తరువాత తొలగించాలి.

7. పాదాలకు అలంకరించిన పట్టీలు, మెట్టెలు మెరుస్తూ పరిశుభ్రంగా ఉండాలి. పాదరక్షలు అనువుగా, హాయిగా ఉండాలి కాని పాదాలకు ఒరుసుకుని ఇబ్బంది పెట్టేవి వాడకూడదు.

English summary

Home made Tips for Foot Care | గులాబీ రేకులాంటి పాదాల కోసం...

Natural Foot Care can be an at home pleasure with just a little time and a few natural ingredients. It is worth spending some time in preparation of natural, homemade foot care recipes during the winter so the summers can be spent in maintaining wonderful, soft feet instead of trying to repair the damage.
Story first published: Monday, April 9, 2012, 17:32 [IST]