For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బహుమూలల్లో నలుపు దనం.. దుర్వాసనలు పోవాలంటే....?

|

Homemade Tips to Get fairer Underarms-Remove darkness
సాధారణంగా మనిషి శరీరంలో బహుమూలల్లో చర్మం నల్లగా మారడం సహజం అయితే శరీర ఛాయ ఎక్కువగా అంటే మరీ తెల్లగా ఉన్నవారికి, లేదా ఎర్రగా ఉన్పవారికి ఈ సమస్య ఎత్తి కనిపిస్తుంటుంది. అందుకు ప్రదాన కారణం బిగుతైన వస్త్రాలను ధరించడం లేదా ఆ ప్రదేశంలో ఎక్కువగా రుద్దడం వల్ల చర్మం రంగు మారుతుంది. దాంతో అక్కడ బ్యాక్టీరి తిష్టవేసి చెడువాసనలకు దారితీస్తుంది. కాబట్టి ఆ ప్రదేశాల్లో చర్మం రంగు(బ్లాక్ గా) మారకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుండి బయట పడవచ్చు.

చెమట ఎక్కువగా పట్టేవారిని బాధించే మరో సమస్య ఏంటంటే... బాహుమూలల్లో దుర్వాసన వేయడం. ఈ సమస్య వల్ల వారు నలుగురిలోనూ ఫ్రీగా కలవలేరు, మాట్లాడలేరు. ఈ దుర్వాసన సమస్య నుండి బయటపడాలనుకునేవారి కోసం అవససరమయ్యే చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బాహుమూలల్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు... ప్రతిరోజూ యాంటి బ్యాక్టీరియల్ సబ్బుతో చంకలు తదితర శరీర ముఖ్య భాగాలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. చంకలను శుభ్రం చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఎందుకంటే శరీరంలోని 80 శాతం స్వేదగ్రంధులు ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉంటాయి.

అలాగే... శుభ్రమైన లోదుస్తులు (బ్రా, ప్యాంటీ) ధరించాలి. ఈ లోదుస్తులు కాటన్‌ వి అయితే మరీ మంచిది. అవి చర్మంలోకి గాలివెళ్లేట్టు చేస్తాయి. పైన మాత్రం సింధటిక్ బట్టలు వేసుకున్నా ఫర్వాలేదు. ప్రతిరోజూ పళ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే కూడా శరీరం దుర్వాసన రాదు.

నీళ్లు బాగా తాగాలి. ఎందుకంటే, నీళ్లు ఎక్కువగా తాగినట్లయితే స్వేదగ్రంథులు బాగా పనిచేస్తాయి. దీంతో చెమట వాసన బాగా తగ్గిపోతుంది. స్నానం చేసిన తరువాత టాల్కం పౌడర్ వేసుకుంటే శరీరం పొడిగా ఉంటుంది. తద్వారా బ్యాక్టీరియా ఎక్కువ చేరదు. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు తినడం బాగా తగ్గించాలి. ఇవన్ని పాటించినట్లయితే బాహుమూలలను దుర్వాసన నుంచి కాపాడుకోవచ్చు.

స్నానానికి వెళ్ళే ముందు కొంచెం నిమ్మరసం తీసుకొని వెళ్ళి స్నానానికి ముందు చంకల్లో నిమ్మరసంను అప్లై చేయాలి. నిమ్మరసం రాసి రుద్దకూడా అలాగే ఐదు నిమిషాల పాటు వదిలేసి తర్వాత స్నానం చేసుకొంటే సరిపోతుంది. అలాగే మరో చిన్న చిట్కా ఏంటంటే స్నానం చేసి వచ్చిన తర్వాత బేకింగ్ సోడానా చంకలక్రిద కొద్దిగా రాసుకొంటే చెమట నుండి వెలువడే దుర్వాసనలు రావు. ముఖ్యంగా ఎక్కువ ఖరీదున్న డియోడరెంట్స్ ను ఉపయోగించ కూడదు. దాని వల్ల కూడా చర్మ నల్లగా మారుతుంది.

రెండు టేబుల్స్ స్పూన్ల నిమ్మరం, మూడు చెంచాల కీరదోసరసం వేసి బాగా మిక్స్ చేయాలి. దీనికి ఒక చెంచా పసుపు కూడా చేర్చి మూడు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బహుమూలల్లో అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసేసుకోవాలి. ఇలా ఒక వారంలో కనీసం ఐదు రోజుల పాటు పాటించినట్లైతే మీ సమస్య త్వరగా నయమయ్యి. చర్మం కాంతివంతంగాను, ఎంటువంటి దుర్వాసనలు రాకుండా కాపాడుతుంది.

తాజా ఆరెంజ్ తొక్కలను తీసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ఒక బౌల్ ల్లో రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని దానికి ఒక చెంచా పెరుగు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బహు మూలల్లో అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు...

English summary

Homemade Tips to Get fairer Underarms-Remove darkness | బహుమూలల్లో నలుపు దనం పోగొట్టే చిట్కాలు...

Underarm darkness or dark skin color or armpit is a common problem specially for those who has comparatively more fair skin. In this post I will suggest you a very effective home made treatment with natural products. If you follow these tips, then you can get rid of with this problem.
Story first published:Tuesday, July 31, 2012, 12:42 [IST]
Desktop Bottom Promotion