For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ తప్పిన అధరాలను కాంతివంతంగా చేసే చిట్కాలు....

|

Homemade tips for Natural Lips...!
అధరాల సంరక్షణకు ఈ రోజుల్లో శ్రద్ధ తీసుకోవడంలో మహిళలు పోటీ పడుతున్నారు. ఎందుకంటే ముఖారవిందాన్ని ప్రతిభించడంలో అదరాల పాత్ర ఎంతో ఉంది. దాంతో పలు అంతర్జాతీయ కంపెనీలు సైతం మహిళల సౌందర్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. మగువల అధరాలకు అందమైన లుక్కు తీసుకురావడంలో ఎన్నో పద్దతులను పాటిస్తున్నారు.

శరీరంలో తేమ తగ్గినప్పుడు, మృతకణాల కారణంగా పెదాలు పొడిబారడం.. కళ తప్పినట్టు కనిపించడం జరుతుంది. ఆ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందిగా మారతాయి. అధరాల అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే సంరక్షణ జాగ్రత్తలు పాటించడం అవసరం...

ఒక టీస్పూన్ తేనెలో కొద్దిగా వంటసోడా, ఆలివ్ నూనె కలిపి పెదాలకు రాసి మర్దన చేయాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే మృతకణాలు తొలగిపోయి సున్నితంగా మారతాయి. అలానే అరచెంచా తేనెలో చిటికెడు పంచదార కలిపి మర్దన చేసుకొన్నా ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో ఓట్స్ పొడి కలిపి చిన్నారుల టూత్ బ్రష్ తో పెదాల మీద సున్నితంగా రుద్దాలి. దీని వల్ల నలుపురంగు తగ్గి.. రంగును సంతరించుకుంటాయి.

గెప్పుడు గులాబీరేకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పాలలో నానబెట్టి మర్నాడు ముద్దగా చేసి పూతలా వేయాలి.. అరగంట తర్వాత మంచినీటితో శుభ్ర చేస్తే కళ తప్పిన అధరాలు కాంతిమంతగా మారతాయి. రోజంతా తేమగా ఉంటాయి. బాగా పొడి బారిన వాటికి కీరదోస గుజ్జు రాస్తుంటే ఫలితం ఉంటుంది. గ్లిజరిన్‌, నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి. తేనె, నిమ్మరసాల మిశ్రమం పెదవులకు రాస్తే పెదవుల నలుపు పోతుంది.

గ్లిజరిన్ లో కొద్దిగా తేనె కలిపి రాత్రిపూట పడుకునే ముందు రాసుకోవాలి. మర్నాడు చల్లటినీళ్లతో కడుక్కోవాలి. అలానే పాలమీగడ కూడా అధరాల అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఆముదం రాయడం వల్ల పెదాలకు తేమ అంది క్రమంగా పగుళ్లు తగ్గుముఖం పడతాయి. నలుపు తగ్గి వన్నెలీనుతాయి. అంతే కాదు పండ్ల రుచులతో కూడిన లిప్ బామ్ కు బదులుగా ఈకాంలో సన్ స్ర్కీన్ గుణాలున్న దాన్ని ఎంచుకోవడం మేలు. బాదం పొడిలో కొద్దిగా పాలమీగడ కలిపి పెదాలకు పూతలా వేయాలి. కొద్దిసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాయాలి. . ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మృదువుగా మారి అందంగా కనిపిస్తాయి.

ప్రతిరోజూ వెన్న, మీగడ, పెరుగులాంటివాటిలో ఏదైనా ఒకదానిని పెదవుల మీద రాసుకున్నట్టయితే పెదవులు మృదువుగా నిగనిగలాడుతూ ఉంటాయి. పెదవుల నల్లదనాన్ని పోగొట్టేందుకు నిమ్మరసం చుక్కలు కలిపిన మీగడ పెదవులకు రాసినట్టయితే నల్లదనం మెల్లమెల్లగా కనుమరుగవుతుంది. కాటన్ బాల్ ను తడి చేసి పెదవులపై సున్నితంగా రబ్ చేస్తే మృ తకణాలు తొలగిపోతాయి. తర్వాత నిమ్మరసం, తేనె గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకుని రాత్రి పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తే పెదవులు మృదువుగా, గులాబీరంగులోకి మారతాయి.

English summary

Homemade tips for Natural Lips...! | కళ తప్పిన అధరాలను కాంతివంతంగా...!

Beauty is not successful without smile on your face. Everyone should be add smile as a beauty part. For broad smile you need to have soft,flexible and pink lips which is the most attractive part on your face. That’s why you have to care of your lips by using some home made natural beauty recipes.
Story first published:Wednesday, June 20, 2012, 18:56 [IST]
Desktop Bottom Promotion