Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
అధిక పొట్ట రావడానికి కారణాలు...పొట్ట తగ్గించే మార్గాలు...

పొట్ట పలురకాలు. పొట్ట అవస్థలు అనేక రకాలు. అధిక పొట్ట ఉండటం వల్ల కూర్చోవడానికి కుర్చి సరిపోదు, బట్టలు అసలే పట్టవు, నడిస్తేనేమో ఆయాసం, పరిగెత్తడం మహా కష్టం, నిలుచుంటే ఎప్పుడెప్పుడు కూర్చుందామా అనిపిస్తుంటుంది. అయితే పొట్ట మాత్రం తగ్గదు.. దాని వల్ల వచ్చే బరువు తగ్గదు. పెరుగుతున్న పొట్టను ఫ్లాట్‌గా ఎలా చేయాలి? అలా పెరగకుండా ఎలా నియంత్రించుకోవాలన్న అంశాలపై అవగాహన అవసరం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు…పొట్ట రాకుండా రోజువారీగా తప్పరి సరిగా డైట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్ట ఎలా వస్తుంది దానికి కారణాలేంటి? చాలా మందికి పొట్టి అధికంగా తినడం వల్ల, అధికంగా వ్యాయామం కూడా అదికపొట్టను కలిగిస్తుంటారు..ఇవి పక్కన పెట్టి అధిక పొట్టకి అసలు కారణాలేంటో చూద్దాం....
1. వంశపారం పర్యం: ఇంట్లో వంశపారంపర్యంగా ఎవరికైనా అధిక పొట్ట కలిగి ఉన్నా మీకు సంక్రమించే అవకాశం ఉంది.
2. రాత్రి భోజనం చాలా ఆలస్యంగా తీసుకోవడం: రాత్రి భోజనం చాలా లేట్ గా తినడం. తిన్న వెంటనే అలాగే నిద్రకు ఉపక్రమించడం కూదా అదిక పొట్ట రావడానికి ఒక కారణం.
3. పని ఒత్తడి: పనిచేసే కార్యాలయాల్లో పని ఒత్తిడి, వ్యక్తిగతంగాను ఒత్తడికి గురికావడం కూడా అధిక పొట్టకు దారితీస్తుంది.
4. జీర్ణాశయ సమస్య: జీర్ణాశయ సమస్యలు అంటే తిన్నది జీర్ణకాకపోవడం, గ్యాస్ట్రి వంటి సమస్యలతో పాటు అధిక పొట్టకు మార్గాలు.
ఇలాంటివన్నీ ముఖ్య కారణాలైతే కొంతమంది వెంటనే నేను వ్యాయమం మొదలు పెట్టేస్తాను, పొట్ట తగ్గించేసి సన్నబడుతానంటుంటారు. అయితే అది కరెక్ట్ కాదు. అది తాత్కాలికమూ కాదు. ముందుగా దీర్ఘకాలానికి ప్లాన్ వేసుకొని తర్వాత మొదలు పెట్టినట్లైతే తప్పకుండా పొట్ట తగ్గి నాజుగ్గా తయారవుతారు.
1. పొట్ట తగ్గించి, బరువు తగ్గాలనుకొనే వారు అల్పాహారం తీసుకోకుండా మాత్రం ఉండకూడదు. కొంతైన సరే ఉదయం పూట తీసుకోవాలి.
2. ఎక్కువ భోజనం: రెండు పూట భోజనం చేసి ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకొనే కంటే, రోజుకు మూడు నాలుగు సార్లు మంచి ఆరోగ్య కరమైన పౌష్టికహారాన్ని తీసుకోవాలి. అప్పుడు ఎక్కువ ఆకలి ఉండదు.
3. స్నాక్స్: స్నాక్స్, స్వీట్స్, నూనె పదార్థాలు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
4. నీళ్ళు: రోజులో ఎక్కువ నీళ్ళు తాగుతుండాలి. నీళ్ళు ఎక్కువగా తాగడంవల్ల మిమ్మల్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచడేమే కాకుండా, జీర్ణ వ్యవస్థకు బాగా పనిచేస్తుంది.
5. వ్యాయమం: 1. జాగింగ్: ముందు ఒక కిలోమీటర్ దూరం స్లోగా పరిగెత్తడం అలవాటు చేసుకోవాలి. తర్వాత డిస్టెన్స్ ను పెంచుకోవాలి.
2. సైక్లింగ్: జాగింగ్ మీకు బోర్ అనిపిస్తే..సైకిల్ తొక్కడం ఆరంభించండి.
3. ఫాస్ట్ గా నడవడం: జోరుగా నడవడం మొదలు పెట్టు రెండు మూడు కిలో మీటర్లు నడవాలి.
4. జంపింగ్: కొంచెం ఎత్తులో నుండి దూకడం వంటివి చేయాలి.
5. డాన్సింగ్: ఒక రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని మీకు నచ్చిన రాక్ సాంగ్ పెట్టుకొని ఎక్కవ సౌండ్ పెట్టుకొని మీకు వచ్చిన పద్దతిలో డాన్స్ చేయండి ఇది కూడా ఒక రకమైనటువంటి వ్యాయామమే.....



Click it and Unblock the Notifications