Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
సీక్రెట్ ప్లేస్ లో అవాంచిత రోమాల తొలగింపుకు ఇంట్లోనే వ్యాక్సింగ్...

అవాంఛిత రోమాల వల్ల చర్మం నల్లగా కనిపిస్తుంది. వీటిని తొలగించటానికి రకరకాల పద్ధతులు వున్నాయి. అయితే అన్నింటిలోకీ వ్యాక్సింగ్ చాలా మేలైన పద్ధతి. వ్యాక్సింగ్ మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కేవలం బ్యూటీ పార్లర్ లోనే ఇది చేస్తారని అనుకోకూడదు.
వ్యాక్సింగ్ కు కావలసినవి: కాటన్ క్లాత్, పౌడర్, వ్యాక్సింగ్ మిశ్రమం, వ్యాక్సింగ్ స్టిక్. రెండు కప్పుల పంచదార, ఒక కప్పు నిమ్మరసం. ఈ రెండిటినీ బాగా కలపాలి. పంచదార కరిగిపయేంత వరకూ కలిపి స్టౌ మీద పెట్టాలి. పదిహేను నిమిషాల పాటు గరిటతో కలుపుతూ వుండాలి. గట్టిగా అయిన తర్వాత ఒక డబ్బాలో వేసి చల్లారిన తర్వాత గాలి తగలకుండా మూత పెట్టాలి.
వ్యాక్సింగ్ కోసం పంచదార, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని వ్యాక్సింగ్ హీటర్ లో వేసి వేడి చేయాలి. వ్యాక్సింగ్ చేయాలనుకున్న ప్రాంతంపై కొద్దిగా పౌడర్ రాసి గోరువెచ్చగా వున్న వ్యాక్స్ ను వాక్స్ స్టిక్ తో రాయాలి. ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుని వ్యాక్సింగ్ పైన అతికించి వ్యతిరేక దిశలో పైకి తీయాలి. ఇదే విధంగా శరీరంపైన ఎక్కడ రోమాలు ఉంటే అక్కడ వ్యాక్సింగ్ పైన అతికించి వ్యతిరేక దిశలో పైకి తీయాలి. ఇదే విధంగా శరీరంపైన ఎక్కడ రోమాలు వుంటే అక్కడ వ్యాక్సింగ్ చేసుకోవచ్చు. అయితే కొంత ప్రాక్టీస్ అవసరం అవుతుంది. మొదటిలోనే శరీరం అంతా వ్యాక్సింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం నిపుణుల దగ్గర చేయించుకోవటం ఉత్తమం.



Click it and Unblock the Notifications
