Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అధిక పొట్టతో బాధపడుతుంటే....?

బరువు బలవంతంగా తగ్గినప్పుడు మూడు నుంచి ఆరు నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది. బరువు తగ్గాలనుకొనే వారు ముందుగా పండ్లు, పండ్ల రసాల్లాంటివి పంచదార లేకుండా అధిక మోతాదులో తీసుకుంటే నీరసం నుంచి బయట పడతారు. కూరగాయలు, ఆకుకూరలు, బాదం, ఖర్జూరాలు, ఎండు ద్రాక్షలాంటివి చర్మానికి వెంట్రుకలకు మంచి పోషణనందిస్తాయి.
చాలా మంది బరువు త్వరగా తగ్గాలని మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, నూనెలు రాస్తుంటారు. వాటివల్ల ఫలితం నామమాత్రం. ఆయుర్వేదంలో బరువు తగ్గడానికి చాలా విధానాలు ఉన్నాయి..ఒంటికి పూతరాయడం, చెమట పట్టే విధంగా వ్యాయామాలు చేయడం వాటిల్లో కొన్ని మీ కోసం....
1. బరువు పెరుగుతున్నాప్పుడు పొడిగా, వేడిగా ఘాటుగా ఉండే వస్తువులను భోజనంలో తీసుకోవాలి. పుల్కాలు, మిరియాలు, గోరువెచ్చటి నీళ్లకు ప్రాధాన్యమివ్వడం మంచిది.
2. తైలం పూయకుండా నలుగు పట్టాలి అప్పుడే అది పనిచేస్తుంది. అలాగే తిప్పగీగ, త్రిఫలాలను, మజ్జిగ తేనెను ఎక్కువగా తీసుకోవాలి.
3. కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటి శాతంఎక్కువగా ఉండే బీర, అనప, పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి.
4. పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు. కాలేయం పనితీరును పెంచే ఆసనాలు వేయాలి. వాటిని చేయడం వల్ల కాలేయం పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది.
5. అరచెంచా మెంతి పొడి నీళ్లలో కలిపి రాత్రి పూట తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకోవడం. రకరకాల పిండి పదార్థాలతో బయట చేసే పిండి వంటలు తినకూడదు. మితంగా భోజనం చేయాలి. రోజుకి నాలుగు సార్లు తీసుకోవాలి.
6. ఆవ, ఆలివ్, పొద్దతిరుగుడు, నువ్వుల నూనెలను కొద్దిగా తీసుకుంటే జుట్టు, చర్మానికి ఇబ్బంది ఉండదు. ఉప్పు కూడా చాలా తక్కువ తీసుకోవాలి.
7. శరీర బరువు అసాధారణంగా పెరుగుతున్నప్పుడు జబ్బులు, అలర్జీ మధుమేహం, కీళ్లు, అరిగిపోవడం, శ్వాసకోస సమస్యలు, అధిక రుతుస్రావం, అల్పరుతుస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications
