For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలువల్లాంటి కళ్లకు సహజ పద్దతులు....!

|

Natural Home Remedies For Under Eye Wrinkles.....!
కళ్లకింద నల్లటి వలయాలు ముఖం మీద ఇబ్బందికరంగా కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎన్ని క్రీములు వాడినా ఫలితం ఉండదు. కళ్లకింద నల్లటివలయాల్ని, ముడతల్ని మాయం చేసేందుకు మేకప్‌లో కొన్ని మెలకువలు ఉన్నాయి. మేకప్‌తో నల్లటివలయాల్ని, ముడతల్ని కనిపించకుండా చేసే పద్ధతులు కొన్నైతే, అవి కాకుండా కంటికి సరిపడా న్రిదపోయి, నీళ్లు ఎక్కువగా తాగితే సహజంగానే నల్లటి వలయాల్ని, ముడతల్ని మాయం చేయొచ్చు. ఇంట్లో పదార్థాలతోనూ కలవల్లాంటి కళ్లు కోసం చిట్కాలున్నాయి...అవేంటో చూద్దాం...

1. బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. రెప్పల కింద దూదితో తుడిచి మృదువుగా కొబ్బరినూనెతో మర్దన చేయాలి. దాంతో హాయిగా నిద్రపడుతుంది. వలయాలు తగ్గుముఖం పడతాయి.
2. కీరదోస వల్ల కూడా చక్కని ఉపశమనం లభిస్తుంది. కీర రసం తీసి అందులో దూదిని ముంచి రోజూ రెండు పూటలా కంటి భాగంలో తుడిస్తే ఆ ప్రాంతంలోని మృతకణాలు దూరమవుతాయి. చర్మం కాంతివంతగా మారుతుంది.
3. బాదం పలుకులు కూడా సమస్యను తగ్గించేస్తాయి. వాటిని పాలలో నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి నల్లగా మారిన చోట పూత వేసి అరగంటయ్యాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
4. రెండు చెంచాల టమాటా రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి కళ్లకింద నెమ్మదిగా రాయాలి...కొద్ది సేపు అలా వదిలేసి దూదితో తుడిచి కడగాలి.
5. అలాగే గులాబీ నీళ్లలో దూదిని ముంచి కళ్ల మీద పావుగంట ఉంచాలి. ఇలా చేస్తే అలసిన కళ్లకు హాయిగా ఉండటమే కాదు సమస్య దూరమవుతుంది.
6. నాలుగు మెంతి ఆకుల్ని మెత్తగా రుబ్బి కళ్లకింద నల్లటివలయాలమీద పూతలా వేసి మర్దన చేస్తే ఆ ప్రాంతంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మం మీద నలుపు పోతుంది.
7. రెండు చెంచాల టమాటారసంలో తగినంత పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేసి నల్లగా ఉన్న ప్రాతంలో పూత వేయాలి. ఆరాక కడిగేస్తే సరిపోతుంది.
8.కళ్ళకు మాయిశ్చరైజర్ రాసుకుంటే ముడతలు కనిపించవు. అవకాడో, నువ్వులు, విటమిన్ కె, ఇ లు ఉన్న మాయిశ్చరైజర్లయితే మంచిది.
9. నల్లటి వలయాలు కనిపించకుండా ఉండేందుకు కన్సీలర్ వాడాలి. లేత బంగారు రంగు కన్సీలరయితే నల్లటివలయాల్ని బాగా కప్పేస్తుంది. లేతరంగు కన్సీలర్ వాడితే బాగుంటుంది.
10. ఫౌండేషన్ వేసుకున్నా లేకపోయినా కన్సీలర్ వాడొచ్చు. నల్లగా ఉన్న ప్రాంతంలో కన్సీలర్‌ను చుక్కలుగా పెట్టి ఉంగరం వేలితో సున్నితంగా కంటిచుట్టూ పరవాలి. ఇవన్నీ మేకప్‌తో నల్లటివలయాల్ని, ముడతల్ని కనిపించకుండా చేసే పద్ధతులు.

English summary

Natural Home Remedies For Under Eye Wrinkles.....! | కలువల్లాంటి కళ్ల కోసం...!

Eye wrinkles are a common problem that affect many us of these days. Appearances of fine lines around the eyes and under eye wrinkles are a normal part of the aging process. As you age, your skin will naturally grow thinner. As it grows thinner, it is much easier for wrinkles to form. Typically, these wrinkles tend to appear around the eyes before they appear anywhere else. Some wrinkles are caused by repetitive motions, so the act of smiling, when it crinkles up your eyes can lead to laugh lines.
Story first published:Tuesday, May 1, 2012, 16:03 [IST]
Desktop Bottom Promotion