Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అధర సౌందర్యం...ఇంటి చిట్కాలు...

1. పెదాలపైన ఉన్న మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. టూత్ బ్రష్ తో వలయాకారంలో మృదువుగా రుద్దాలి. దానివల్ల మురికి, జిడ్డు తొలగిపోయి పెదవులు తాజాగా కనిపిస్తాయి.
2. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందుగా పాలమీగడతో పెదాలను బాగా రుద్ది.. కడిగేయకుండా అలా వదిలేస్తే పెదాలకు తేమ అందుతుంది. పొడిబారకుండా ప్రకాశవంతంగా తయారవుతాయి.
3. రాత్రిపూట పెట్రోలియం జెల్లీని రెండుసార్లు పూతగా పూసి అలా వదిలేయాలి. దానివల్ల పెదవులకు తేమ అందుతుంది. దాంతో పెదాలు ఫ్రెష్ గా ఉంటాయి.
4. సహజంగా ఇంట్లో ఎప్పుడూ ఉండే పంచదార లేదా ఉప్పుతో పెదాల మీద రుద్దినా మృతకణాలు తొలగిపోతాయి. 5. రోజ్ వాటర్, కొబ్బరి నీళ్ళు, ఆలివ్ ఆయిల్ సమపాళ్ళలో తీసుకొని పెదవులకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల పగుళ్లు, ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా ఆరోగ్యంగా కనిపిస్తాయి.
6. పెదాలు నల్లబడ్డట్టు అనిపిస్తుంటే అరకప్పు గులాబీ రేకులను ఒక కప్పు పాలలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు మిక్సీలో వేసి మెత్తని ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో కూడా భద్రపరిచి తరచూ పెదాలకు రాస్తుంటే నలుపు రంగు తగ్గి క్రమంగా ఎర్రగా మారతాయి.



Click it and Unblock the Notifications